Chandaki Village: ఆ ఊర్లో ఎవరూ వంట చేయరు… కానీ ఎవరు ఆకలితో ఉండరు
గుజరాత్‌లోని చండకీ (Chandaki village) అనే చిన్న గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చణీయాంశంగా మారింది. దీనికి కారణం అక్కడి ప్రజలు అనుసరిస్తున్న ఒక ప్రత్యేక జీవన విధానం.
ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో కిచెన్ ఉంటుంది. కానీ ప్రతి రోజు వంట జరగదు. అయినా కూడా ఎవరూ ఆకలితో నిద్రపోరు. ఇది అక్కడ ఏర్పడిన ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ సిస్టమ్ వల్ల సాధ్యమైంది.
యువత విదేశాలకు…
ఒకప్పుడు చండకీ గ్రామంలో వెయ్యికి పైగా జనాభా ఉండేది. కాలక్రమేణా యువత ఉద్యోగాల కోసం నగరాలకు, విదేశాలకు వెళ్లిపోయారు. దాంతో గ్రామంలో ఎక్కువగా వృద్ధులే మిగిలారు. రోజూ సరుకులు తెచ్చుకోవడం, వంట చేయడం వాళ్లకు కష్టంగా మారింది.
అప్పుడు గ్రామ సర్పంచ్ పూనంభాయ్ పటేల్ ఒక వినూత్న ఆలోచన తీసుకొచ్చారు — కమ్యూనిటీ కిచెన్.
రోజుకు రెండు పూటలు
ఈ కమ్యూనిటీ కిచెన్‌లో (Community Kitchen) ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఫ్రెష్ గుజరాతీ భోజనం వండి వడ్డిస్తారు. గ్రామస్తులు ప్రతీ నెల రూ.2,000 నుంచి రూ.2,500 వరకు చెల్లిస్తారు. దీనికి ప్రతిఫలంగా వారికి రోజూ రెండు పూటలా ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనం అందుతుంది.

వంట బాధ్యతను పాకశాస్త్రంలో అనుభవం ఉన్న వంటవాళ్లకు అప్పగించారు. దీంతో వృద్ధులకు వంట చేయాల్సిన భారం తగ్గింది, ఆరోగ్యం కూడా మెరుగుపడింది.
- Malana Village Mystery : హిమాలయాల్లో ఒక రహస్య గ్రామం..
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే డైనింగ్ హాల్లో అందరూ కలిసి భోజనం చేయడం. ఇది కేవలం భోజనం కాదు, ఒక భావోద్వేగ అనుభూతి. ఒంటరితనం తగ్గుతుంది, నాలుగు మాటలు మాట్లాడే అవకాశం లభిస్తుంది, మానసికంగా కూడా రిలీఫ్ కలుగుతుంది.
ఈ కమ్యూనిటీ కిచెన్‌ను సోలార్ పవర్‌తో నడపడం మరో విశేషం. పర్యావరణానికి అనుకూలంగా, తక్కువ ఖర్చుతో వ్యవస్థ కొనసాగుతోంది.
చండకీ గ్రామం మనకు చెప్పే సందేశం ఒక్కటే కమ్యూనిటీ బలంగా ఉంటే, జీవితం అంత కష్టం కాదు.భారతదేశానికి వెన్నెముక లాంటి గ్రామాల్లో ఇలాంటి ఆలోచనలు అమలైతే, వృద్ధుల జీవితం మరింత గౌరవంగా, భద్రంగా మారుతుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
