Sonmarg Avalanche: క్షణాల్లో ఇళ్లను ముంచేసిన మంచు.. CCTVలో అంతా రికార్డు
Sonmarg Avalanche: క్షణాల్లో ఇళ్లను మంచేసిన మంచు గడ్డ.. CCTVలో అంతా రికార్డుసెంట్రల్ కశ్మీర్లో ఉన్న సోన్మార్గ్ ప్రాంతంలో ఒక భారీ మంచు గడ్డ (Avalanche) స్థానిక నివాస ప్రాంతాల వైపు జారిపడింది.
ఈ ఘటనకు సంబంధించిన CCTVలో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు పర్వతాల నుంచి హఠాత్తుగా జారిపడిన మంచు గడ్డ చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా కవర్ చేస్తూ, సీసీటీవీ కెమెరా వరకు వెళ్లింది.
తాజా సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే భారీ ఆస్తి నష్టం కూడా నమోదు కాలేదు. అదృష్టవశాత్తు అవలాంచ్ సంభవించిన సమయంలో అక్కడ ఎక్కువ మంది పర్యాటకులు లేకపోవడం, అలాగే ట్రాఫిక్ మూమెంట్ చాలా తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
- ఇది కూడా చదవండి : Gulmarg: భారత్‌లో వెలిసిన మంచు స్వర్గం గుల్మార్గ్ పూర్తి ట్రావెల్ గైడ్ | Gulmarg Complete Travel Guide
CCTV ఫుటేజ్‌ను గమనిస్తే, మంచు ఒక్కసారిగా కొండపై భాగం నుంచి జారి, రోడ్డువైపు ఉన్న నివాస ప్రాంతాల దిశగా వేగంగా దూసుకొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఒక్క దృశ్యమే అవలాంచ్ పవర్ ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమయ్యేలా చేస్తోంది.
#BREAKING: Dramatic visuals of an avalanche caught on CCTV in Sonmarg of Central Kashmir tonight in India. No loss of life or major damage reported. More details are awaited. pic.twitter.com/FZkJRpFTcg
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 27, 2026
ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ హిమపాతం కొనసాగుతోంది. మనాలి (Manali) నుంచి కేదార్నాథ్ వరకు పలు ప్రాంతాల్లో భారీ స్నోఫాల్ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
#WATCH | Chamoli, Uttarakhand | Badrinath Dham seen covered in a pristine white blanket of snow as the area receives fresh snowfall.
— ANI (@ANI) January 27, 2026
Source: District Administration pic.twitter.com/sELFv0TGMB
మరోవైపు అమెరికా, రష్యా వంటి దేశాల్లో కూడా భారీ నుంచి అతి భారీ మంచు కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
🚨More insane footage coming out of Kamchatka, Russia where they have had the largest snowfall in 130 years.😳 pic.twitter.com/nfU3sxR0QK
— Don Keith (@RealDonKeith) January 19, 2026
ఇలాంటి పరిస్థితుల్లో వింటర్ డెస్టినేషన్స్‌కు ప్రయాణం చేయాలనుకునే వారు కొంతకాలం వేచి చూడటం ఉత్తమం. తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటే మాత్రం స్థానిక వాతావరణ పరిస్థితులను ముందుగా తెలుసుకుని ప్రయాణించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Feature Image Source : AdityaRajKaul /twitter

▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
