Amrabad Tiger Reserve లో అడవి జీవితానికి కొత్త ఊపిరి…విత్ సఫారీ
Amrabad Tiger Reserve (ATR) తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ వన్యజీవి ట్రావెల్ డెస్టినేషన్‌గా మారుతోంది. గత సంవత్సరాలుగా అటవీ ప్రాంత సంరక్షణ మరియు రెస్పాన్సిబుల్ టూరిజం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దాంతో రిజర్వ్‌లో జంతువుల కదలికలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.
50 పులలు కనిపించాయి
Tiger Sightings on the Rise
2025 అక్టోబర్ నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో (ATR) దాదాపు 50 పులులు కనిపించాయని అధికారులు తెలిపారు. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు; ఇది అటవీ ప్రాంతంలో వన్యజీవుల ఆరోగ్యం మెరుగైనదని సూచిస్తుంది.
నీటి లభ్యతను పెంచడం, మనుషుల చొరబాటును తగ్గించడం, నిత్యం పెట్రోలింగ్ నిర్వహించడం వలన జంతువుల వేటకు సంబంధించిన ప్రాంతాలు కవర్ అవుతున్నాయి.

సఫారీల్లో రకాలు | Safari Circuits for Tourists
పర్యాటకుల కోసం టైగర్ రిజర్వ్‌లో వివిధ Safari Circuits ఉన్నాయి:
- Farahabad Safari (16 కిమీ): తక్కువ సమయంలో అడవిలో ఫారెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ పొందవచ్చు.
- Gundam Safari (35 కిమీ): లోతైన అడవి ప్రాంతంలోకి తీసుకెళ్ళే అవకాశం ఇస్తుంది.
- Cave Safari: ప్రత్యేక రాక్ ఫార్మేషన్స్ మరియు జీవ వైవిధ్యాన్ని చూడవచ్చు.
- Kollam Safari (20 కిమీ): త్వరలో ప్రారంభం అవ్వబోతోంది.
- ఇది కూడా చదవండి : జూపార్క్‌కు వెళ్లే ముందు ఇవి తెలియకపోతే టైమ్ వేస్ట్ అవుతుంది | Hyderabad Zoo Entry Fee ,Timings

చెంచు ట్రైబ్ ప్రాధాన్యత |
Chenchu Tribe Role in ATR Tourism
అమ్రాబాద్ టూరిజంలో చెంచు ట్రైబ్ పాత్ర కీలకమైనది. మొత్తం 18 సఫారీ వాహనాలను స్థానిక చెంచు సభ్యులే ఆపరేట్ చేస్తున్నారు. వీళ్లు డ్రైవర్ గానే కాకుండా నేచర్ గైడ్లుగా కూడా విభిన్న బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మెరుగైన సదుపాయాల కల్పన
Infrastructure & Conservation
ప్రస్తుతం అమ్రాబాద్‌లో మౌలిక సదుపాయాలను పెంచే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎంట్రీ గేట్లను అప్‌గ్రేడ్ చేయడం, బయో-టాయిలెట్లు ఇన్స్టాల్ చేయడం, పరిశుభ్రమైన తాగు నీరు అందించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయడం వంటి చర్యలు తీసుకున్నారు.
ఈ సఫారీల ద్వారా వచ్చే ఆదాయం డైరెక్ట్‌గా Tiger Conservation Foundationకు వెళ్తుంది, పుల్ల సంరక్షణకు ఉపయోగపడుతుంది.

గుర్తుంచుకోవాల్సిన తేదీలు
Important Travel Dates
పుల్ల సంఖ్య లెక్కింపు కారణంగా 2026 జనవరి 20 నుంచి 26 వరకు సఫారీ సేవలు అందుబాటులో ఉండవు. అందుకే మీరు ట్రావెల్ ప్లాన్ చేసేముందు ఈ తేదీలను మరియు ATR నియమాలను గుర్తుంచుకోవడం మంచిది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
