అరకు కాఫీకు అరుదైన ఘనత లభించింది. భారత పార్లమెంటులో జాగ్రఫికల్ ఇండికేషన్ (Geographical Indication) గుర్తింపు తెచ్చుకున్న అరకు కాఫీ స్టాల్‌ను (Araku Coffee) ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ప్రాతినిధ్యం వహించారు.
అరకు కాఫీ ఘనతను చాటడంతో పాటు గిరిజనుల జీవితంలో వెలుగు తేవడమే లక్ష్యంగా ఈ స్టాల్‌ను ప్రారంభించారు.
ముఖ్యాంశాలు
అట్టహాసంగా ప్రారంభోత్సవం ( Araku Coffee)

పార్లమెంటులో (Parliament) అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్, ట్రైబల్ ఎఫైర్ మంత్రి జువాల్ ఓరమ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ రిజిజు పాల్గొన్నారు.
సేంద్రీయ విధానంలో పండే అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. సామాస్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఈ కాఫీ రుచికి ఫిదా అయ్యేవారు చాలా మంది ఉన్నారు. ఏపీలోని అరకు వ్యాలీలో (Araku Valley) సుమారు 1,50,000 మంది గిరిజన రైతులకు ఆరకు కాఫీయే జీవాణాధారం.
ఆర్థిక స్వాలంభన దిశగా

అరుకు కాఫీలాంటి విశిష్టమైన ఉత్పత్తులను పార్లమెంట్ లాంటి అద్భుతమైన వేదికపై ప్రమోట్ చేయడం ఎంత ప్రధానమో కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు ఈ సంద్భంగా తెలిపారు.
అరకు కాఫీ అనేది గిరిజన రైతుల (Tribal Former) కష్టానికి, అంకిత భావానికి ప్రతిరూపమని, పార్లమెంటులో స్టాల్ ఏర్పాటు చేయడం అనేది అరకు కాఫీ విశిష్టతను చాటడమే కాదు, రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కూడా చేకూర్చుతుంది అని అన్నారు మంత్రి.
రెండు వారాల్లోనే అమలు…

అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంటులో ప్రారంభించడం వెనక ఇక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. 2025 మార్చి 11వ తేదీన మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లాకు ప్రస్తావించారు. భౌగోెళిక గుర్తింపు తెచ్చుకున్న ఉత్పత్తులకు పార్లమెంట్ ఆవరణలో ఒక వేదిక ఏర్పాటు చేయాలని రామ్ మోమన్ ప్రస్తావించారు. తరువాత రెండు వారాల్లోనే ఈ ఐడియా కార్యరూపం దాల్చింది.
అక్కడ కూడా తగ్గేదిలే…

ప్రారంభోత్సవం అనంతరం అరకు కాఫీ రుచి చూసేందుకు చాలా మంది పార్లమెంట్ సభ్యులు స్టాల్ వద్దకు వెళ్లారు. ఈ స్టాల్ ఏర్పాటు అనేది మంచి నాణ్యత ఉన్న కాఫీని రుచిని చూపించడం మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సంసిద్ధతను కూడా చాటే వేదిక లాంటిది కూడా.
గ్లోబల్ విజన్

స్టార్ బక్స్ (Starbucks) లాంటి అంతర్జాతీయ కాఫీ దిగ్గజాలతో పోటీ పడే స్థాయికి అరకు కాఫీ చేరాలనేది తన విజన్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. అందులో భాగంగా అంతర్జాతీయంగా 100 పైలెట్ ఔట్‌లెట్స్ ఏర్పాటు చేసే దిశలో అడుగులు ముందుకు వేస్తోంది ఏపీ ప్రభుత్వం.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.