రూ.19,999 కే ఫారిన్ ట్రిప్ ! 6 రోజుల భూటాన్ బడ్జెట్ ప్యాకేజి ! Bhutan Tour 2025 Guide
Bhutan Tour 2025 Guide : భూటాన్ వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. కానీ బడ్జెట్ పరంగా ఆగిపోతారు. అలాంటి వారికోసమే రూ.19,999 సూపర్ కూల్ బడ్జెట్ ప్యాకేజీ వివరాలు ఈ పోస్టులో…
ప్రపంచంలోనే సంతోషకరమైన దేశం (Happiest Country in The World) భూటాన్. ఇక్కడ మనిషి ఆదాయం కన్నా ఆనందాన్ని ప్రామాణికంగా (Gross National Happiness) తీసుకుంటారు. డెవెలప్మెంట్ కన్నా ప్రకృతిని కాపాడేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
ముఖ్యాంశాలు

పర్యాటకులకు ఇది ఒక స్వర్గధామం లాంటి ప్రదేశం. కానీ ఈ దేశం పర్యాటకాన్ని ఒక పరిశ్రమగా కాకుండా ఒక అనుభవంగా చూస్తుంది. సివిక్ సెన్స్ ఉన్న వాళ్లు, తక్కువ మంది వచ్చేలా కొన్ని ఏర్పాట్లు చేసుకుంది.
అందుకే భూటాన్ సోలోగా వెళ్లాలి అంటే (Bhutan Travel Cost ) ఒక్కో వ్యక్తికి కనీసం రూ.80 వేల నుంచి లక్ష కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది (7 నుంచి 10 రోజులకు). అందుకే చాలా మందికి భూటాన్ (Bhutan) వెళ్లాలని ఉన్నా…వామ్మో ఇంత కాస్ట్లీయా అని వెనకా ముందు అవుతారు.
అలా ఖర్చు కోసం వెనకా ముందు అయ్యేవారి కోసం కేవలం రూ.19,900 కే 5 నైట్స్, 6 డేస్ భూటాన్ ప్లాన్ ఒకటి తీసుకువచ్చాను. పూర్తి వివరాలు చదివేయండి.
- ఇది కూడా చదవండి : భూటాన్ ఎలా వెళ్లాలి ? ప్రదేశాలు, ఫుడ్, సంప్రదాయం, కరెన్సీ, చేయకూడనివి
భూటాన్ ఒక అనుభవం | The Land Of the Thunder Dragon

భూటాన్ అనేది ఒక డెస్టినేషన్ మాత్రమే కాదు. ఒక అనుభూతి. ఇక్కడి ప్రేయర్ ఫ్లాగ్స్, మంచుతో కప్పబడి ఉన్న పర్వతాలు, ఎటు చూసినా కనిపించే పచ్చదనం, జలజల జారే జలపాతాలను, ప్రశాతంగా సాగే నదులు, చిరునవ్వు తప్పా మరో ఎమోషన్ లేదనేలా ఎదురుయ్యే ప్రజలు…ఇవన్నీ మిగితా ప్రపంచ దేశాలతో పోల్చితే ఈ దేశాన్ని పర్యాటకంగానే కాదు..దేశంగా కూడా ఒక అడుగు ముందుంచుతాయి.
ఈ పోస్టులో చాలా మంది పర్యాటకులు ప్లాన్ చేసుకునే పాపులర్ ఐటినెరీని ప్రయాణికుడు (Prayanikudu Travel Guide) స్టైల్లో ఈజీగా, ప్రాక్టికల్‌గా అందిస్తున్నాను.
కిర్రాక్ ఫాక్ట్ | Bhutan Quirky Facts : భూటాన్ వెళ్లేందుకు భారతీయులకు వీసా అవసరం లేదు. ఓటర్ ఐడి కార్డు లేదా పాస్ పోర్టు సరిపోతుంది. కొన్ని పర్మిషన్స్ తీసుకుంటే సరిపోతుంది.
అసలు భూటాన్ ఎందుకు వెళ్లాలి ? | Why to Visit Bhutan In Firsts Place
మీరు ఫస్ట్ టైమ్ విదేశీ యాత్ర చేస్తున్నా లేదా ఇది 10 దేశం అయినా భూటాన్ మిమ్మల్ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తుంది. ఇక్కడ ఎత్తైన పర్వతాల మధ్యలో ఉండే పచ్చని లోయలు, పరిశుభ్రంగా కనిపించే జనావాసాలు, ట్రాఫిక్ టెన్షన్ లేని రోడ్లు ఇవన్నీ మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి
- ఇక్కడ బౌద్ధరామాల్లో అంటే మోనాస్టరీల్లో ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది. అది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా శక్తివంతుల్ని చేస్తుంది. ఇది ఫీల్ అవ్వాలి అంటే భూటాన్ వెళ్లాల్సిందే.
- Is Bhutan Safe ?| అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే భూటాన్ చాలా సురక్షితమైన దేశం. ముఖ్యంగా సోలో ట్రావెల్ (Solo Travel) చేసినా ఎలాంటి టెన్షన్ లేకుండా నచ్చిన చోటికి వెళ్లొచ్చు.
- No Visa For Indians In Bhutan : దీంతో పాటు భూటాన్ వెళ్లాలి అంటే భారతీయులకు వీసా అవసరం లేదు. ఓటర్ ఐడీ లేదా పాస్‌పోర్టు ఉంటే చాలు.
- భూాటాన్లో (Bhutan) ఎక్కడ కూడా ట్రాఫిక్ లైట్లు కనిపించవు.
- సోలోగా వెళ్లే ఇక్కడి నియమాల ప్రకారం మీరు తప్పకుండా త్రీస్టార్ హోటల్ బుక్ చేసుకోవాల్సిందే.
- Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
మనం ఎన్ని దేశాలు తిరిగినా కనిపించని సరికొత్త భావన ఇక్కడ కనిపిస్తుంది. అదే సమయంలో మనం ఏదో వేరే లోకంలో ఉన్న భావక కలిగించకుండా మన అనే ఫీలింగ్ కలిగిస్తుంది భూటాన్.
భూటాన్ 5 నైట్స్ 6 డేస్ ప్యాకేజీ వివరాలు | Bhutan 5 Nights / 6 Days Package

భూటాన్ వెళ్లేవారిలో చాలా మంది 5 పగలు 6 రాత్రులు అక్కడ గడిపేలా ప్లాన్ చేస్తారు. భూటాన్ ట్రావెల్ సర్కిట్‌ను పూర్తి చేయాలి అనుకునే వారికి ఈ క్లాసిక్ రూట్ బాగా ఉపయోగపడుతుంది.
మొదటి రోజు | Day 1 in Bhutan : తొలి రోజు మీరు బాగ్దోర్గా ఎయిర్‌పోర్టు నుంచి ఇండో భూటానజ్ బార్డర్ టౌన్‌లోని ఫ్యూంట్ షోలింగ్ (Phuentsholing)కి చేరుకుంటారు.
రెండవ రోజు | Day 2 in Bhutan : రెండవ రోజు మీరు ఫ్యూంట్ షోలింగ్ నుంచి భూటాన్ రాజధాని థింపూ (Thimphu) చేరుకుంటారు. 150 కిమీ దూరం. 4 గంటల ప్రయాణం ఉంటుంది
3వ రోజు | Day 3 In Bhutan : మూడవ రోజు మీరు రాజధాని థింపూ నుంచి దోచులా పాస్ (Dochula Pass) వెళ్లి మళ్లీ రాజధానికి చేరుకుంటారు.
4వ రోజు | Day 4 In Bhutan : ఈ రోజు మీరు భూటాన్ క్యాపిటల్ థింపూ లోకల్ సైట్‌సీయింగ్ చేస్తారు. సాయంత్రం పారో (Paro) అనే పశ్చిమ భూటాన్‌లో ఉన్న బ్యూటిఫుల్ నగరానికి చేరుకుంటారు. భూాటాన్లో ఉన్న ఒకే ఒక విమానాశ్రయం ఇక్కడే ఉంది.
ఐదవ రోజు | Day 5 In Bhutan : పారో నగరంలో సైట్ సీయింగ్ పూర్తి రేసి ఫ్యూంట్ షోలింగ్కి తిరిగివెళ్తారు.
6వ రోజు | Day 6 In Bhutan : భూటాన్ నేలపై మీరు గడిపే చివరి రోజు ఇదే. ఈ రోజు మీరు ఫ్యూంట్ షోలింగ్ నుంచి భారత దేశంలో ఉన్న బాగ్దోగ్రా (Bagdogra) చేరుకుంటారు.ఇక్కడితో మీ ప్యాకేజీ ముగుస్తుంది.
ఈ ట్రిప్‌లో మీరు చూసే ప్రదేశాలు | Thinks Covered In Bhutan Trip Package
6 రోజుల ఈ ట్రిప్ ప్యాకేజీలో భాగంగా మీరు రాజధాని థింపూలో బుద్ధ డోర్డెన్మా (Buddha Dordenma) అనే అతిపెద్ద బుద్ధుడి విగ్రహాన్ని చూస్తారు.దీంతో పాటు తాషికో జోంగ్ (Tashichho Dzong) , క్లాక్ టవర్ స్వ్వేర్, చేనేత మార్కెట్‌ను సందర్శిస్తారు.
వీటితో పాటు మీరు దోచలా పాస్ (Dochula Pass) లో అది కూడా చలికాలం వెళ్లే అందమైన మంచు పర్వతాలను చూడచ్చు.
దారి మధ్యలో మీకు ఎన్నో అందమైన లోయలు, నదులు, చుట్టూ ఉన్న భారీ హిమాలయ పర్వతాలను వీక్షిస్తారు.
ఇక పారో అంటే భూటాన్ లో (tourist places in paro) ఏకైక ఎయిర్‌పోర్టు ఉన్న నగరంలో టైగర్ నెస్ట్ వ్యూపాయింట్ (Tiger Next View Point), పారో టౌన్ మార్కెట్, నదీతీరంలో ఉన్న మోనాస్టరీలను చూడొచ్చు.
ఇలా ఒకే ట్రిప్పులో మీరు పర్వతాలను, అందమైన నేచర్, మోనాస్టరీస్, స్థానికులు జీవితంతో పాటు వారి సాంప్రదాయాల చూసి తెలుసుకోవచ్చు.
ఈ ట్రిప్ బడ్జెట్ అండ్ కాస్ట్ ఇదే | Bhutan Tour Package Cost
భూటాన్‌కు చాలా మంది టూర్ ఆపరేటర్లు మంచి ప్యాకేజీలు అందిస్తారు. ఇందులో ఎక్కవ మంది సెలక్ట్ చేసేది 5 డేస్ 6 నైట్స్ ప్యాకేజీని. ఆఫ్ సీజన్లో ప్రతీ వ్యక్తికి అయ్యే కాస్ట్ ఇలా ఉంటుంది.
- ఇద్దరు వ్యక్తుల ప్యాకేజీలో ప్రతీ వ్యక్తికి రూ.28,000 నుంచి రూ.30,000 వరకు
- నలుగురు వెళ్తే ప్రతీ వ్యక్తికి రూ.22,000 నుంచి రూ.23,000 వరకు
- 6 నుంచి 10 మంది వెళ్తే ప్రతీ వ్యక్తికి రూ.18,000 నుంచి రూ.20,000 వరకు
- 12-20 మంది వెళ్తే ప్రతీ వ్యక్తికి రూ.16,000 నుంచి 17,500 వరకు కాస్ట్ అవుతుంది
- Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం
సో ఎంత పెద్ద గ్రూప్ ఉంటే ఒక్కో వ్యక్తికి అంత తక్కువ కాస్ట్ పడుతుంది.
అలా కాకుండా సోలోగా వెళ్తే ఖర్చు తడిసి మోపెడు అవ్వడం ఖాయం.
అందుకే మీరు ఒక గ్రూప్‌గా ఫామ్ అయితే తక్కువ ధరకు భూటాన్ వెళ్లి రావచ్చు.
ఇది భూటాన్‌కు అతి తక్కువ ప్యాకేజీలో వెళ్లేందుకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్యాకేజీ వివరాలు. ఒక వేళ మీరు సోలోగా వెళ్లాలి అనుకుంటే Prayanikudu.com ను రెగ్యులర్‌గా విజిట్ చేయండి. త్వరలో భూటా సోలో ట్రిప్ పోస్ట్ కూడా పబ్లిష్ చేస్తాను.
Prayanikudu రీడర్స్ కోసం :
ఈ ఎగ్జాక్ట్ భూటాన్ రూట్ కోసం క్యూరేటెడ్ ప్యాకేజీ వివరాలు కావాలి అంటే నాకు డైరక్టుగా వాట్సాప్ (+91 93818 84626 ) చేయండి. పబ్లిక్ ప్రమోషన్లు ఏమీ లేవు. మీకోసం పర్సనల్‌గా షేర్ చేస్తాను.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
