Hill Stations In Telugu States : సమ్మర్‌లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే !

షేర్ చేయండి

ఈ ఎండాకాలం ఏదైనా హిల్ స్టేషన్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా ? ఊటి, మున్నార్, మనాలి వంటి ప్రదేశాలకు కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న హిల్‌ స్టేషన్స్ (Hill Stations In Telugu States) అయితే బెటర్ అనుకుంటున్నారా? అయితే ఈ పోస్టు చదవండి. మీ సమ్మర్ ట్రావెల్ ప్లాన్‌కు బాగా ఉపయోగపడుతుంది.

అసలే ఎండాకాలం, దీనికి తోడు ఎగ్జామ్స్ పూర్తి అయ్యాక ఎక్కడికైనా వెళ్దాం అని పిల్లలు అనడం కామన్. మీరు కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తుంటే ఈ పోస్టు మీకు బాగా ఉపయోగపడుతుంది. సమ్మర్ వెకేషన్ (Summer Vacation) కోసం ఊటి, మనాలి వెళ్లే అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సమ్మర్ గెటేవెస్, డెస్టినేషన్స్ , హిల్ స్టేషన్స్ ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని ఇవే…

అరకు లోయ

అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్

Araku Valley : విశాఖా జిల్లా నుంచి 120 కిమీ దూరంలో ఉన్న అరకు‌ లోయ అనేది తెలుగువారికి నేచర్ ఇచ్చిన గిఫ్ట్. ఇక్కడ పచ్చని కొండలు, కాఫీ తోటలు హైలైట్ అని చెప్పవచ్చు. 

Prayanikudu
బొర్రా కేవ్స్‌ రైల్వే స్టేషన్

అంతేనా అరకు వెళ్తే మీరు బొర్రా గుహలను అన్వేషించవచ్చు. దీంతో పాటు బాహుబలి జలిపాతంలాంటి కటిక జలపాతం కూడా వెళ్లవచ్చు.

ముందు వైజాగ్ చేరుకుని అక్కడి నుంచి ట్రైన్లో (Vizag To Araku Train) లేదా బస్సు, కారుల్లో అరకు వెళ్లవచ్చు.

Vizag To Araku Train
వైజాగ్ నుంచి అరకు వెళ్లే ట్రైన్

టికెట్ల ధరలు వచ్చేసి రూ.300 నుంచి రూ.700 వరకు ఉంటాయి. ఆఫ్ సీజన్ కాబట్టి వసతి కూడా తక్కువకే అందుబాటులో ఉంటుంది. 

Hill Stations In Telugu States
బొర్రా గుహలకు వెళ్లే దారిలో కనిపించే అందమైన సీన్స్

రూ.700 నుంచి రూ.1500 రేంజిలో మీకు రూమ్స్ లభించే అవకాశం ఉంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే రూ.90 నుంచి రూ.350 వరకు మీరు ఎంచుకున్న హోటల్, రెస్టారెంట్‌ను బట్టి చార్జిలు ఉంటాయి.

లంబసింగి | Lambasingi

చింతపల్లి మండలం, అల్లూరి సీతారామ రాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌

activities in lambasingi by prayanikudu
Photo Source: Shiva Reddy

ఆంధ్రా కాశ్మీర్‌గా (Andhra Kashmir) పాపులర్ అయిన లంబసింగి వైజాగ్‌కు 100 కిమీ దూరంలో ఉంటుంది. ఎండాకాలం కూడా ఇక్కడ టెంపరేచర్ 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు ఉంటుందంటారు.

మీరు వైజాగ్ నుంచి బస్సు లేదా క్యాబులో, మీ పర్సనల్ కారులో వెళ్లవచ్చు. రూమ్స్ వచ్చేసి మీకు రూ. 800 నుంచి రూ.1300 రేంజిలో లభిస్తాయి. భోజనానికి పూటకు రూ.75 నుంచి రూ.120 వరకు పెట్టుకోగలిగితే చాలు.

హార్స్‌లీ హిల్స్ | Horsley Hills

మదనపల్లె , అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్.

తిరుపతి నుంచి 150 కిమీ దూరంలో మదనపల్లికి (Madanapalle) చేరువలో ఉంటుంది హార్స్‌లీ హిల్స్. ఇక్కడి అందాలను మీరు మీ బడ్జెట్‌లో కూడా ఎంజాయ్ చేయగలరు. బస్ టికెట్ మీకు రూ.300 నుంచి రూ.500 వరకు పడుతుంది. రూమ్ కోసం రూ. 1200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 

ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం చూసేందుకు చాలా మంది ఇష్టపడతారు. మీల్స్ కోసం రూ. 90 నుంచి రూ.180 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 

https://twitter.com/Tourism_AP/status/1226748826238648325

అనంతగిరి హిల్స్ | Ananthagiri Hills

అనంతగిరి హిల్స్ హైదరాబాద్‌కు అతి దగ్గర్లో ఉండే ఒక అందమైన హిల్ స్టేషన్. దట్టమైన అడవిలో ఉండే ఈ హిల్ స్టేషన్‌ మీకు వేసనిలో ఒక మంచి డెస్టినేషన్‌ అవుతుంది. ట్రెక్కింగ్ ఇష్టపడే వారు ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. 

హైదరాబాద్ నుంచి మీరు (Places Near Hyderabad) బస్సు, బైక్ లేదా కారులో వెళ్లవచ్చు. టికెట్‌కు మీకు రూ.150 నుంచి రూ.300 వరకు పడుతుంది. క్యాబ్‌లో వెళ్లాలి అనుకుంటే రూ.1000 వరకు చార్జీలు అవుతాయి.

రూ.700 నుంచి రూ.1500 వరకు రేంజిలో మీకు మంచి రూమ్స్ లభిస్తాయి. మీల్స్ కోసం రూ.100 నుంచి రూ.150 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఈ డెస్టినేషన్స్ ఏపీ (Andhra Pradesh), తెలంగాణ (Telangana)ప్రజలకు మాత్రమే కాదు చుట్టుపక్కన ఉన్న రాష్ట్ర ప్రజలకు కూడా ఇష్టమైన ప్రదేశాలుగా మారాయి.

2-3 రోజుల్లో రూ.3000 నుంచి రూ.6000 వరకు బడ్జెట్‌తో చక్కగా ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి ఎండాకాలాన్ని జాయ్‌గా ఎంజాయ్ చేయవచ్చు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!