హిందూ మతంలో ఛార్ ధామ్ యాత్రకు (Char Dham Yatra 2025 Begins) ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఏడాది లక్షలాది మంది భక్తులు కేదార్‌నాథ్ (Kedarnath), బద్రినాథ్, యమునోత్రి, గంగోత్రికి తీర్థయాత్రలకు బయల్దేరుతుంటారు.
ప్రతీ సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో ఛార్ ధామ్ యాత్ర అధికారికంగా మొదలైంది. అందమైన హిమాలయ మంచు పర్వతాల (Himalayas) మధ్య సాగే ఈ యాత్రలో భక్తులు దైవన్నామ స్మరణతో ముందుకు కదులుతారు.
- ఇది కూడా చదవండి : చార్ ధామ్ యాత్రికుల కోసం ఐఆర్సీటీసి డీలక్స్ ప్యాకేజ్…ఎంత? ఎన్నిరోజులు ? ఎప్పుడు ? ఎలా ? | IRCTC Tourism
ముఖ్యాంశాలు
ప్రారంభోత్సవం | Char Dham Yatra 2025 Begins
ప్రతీ సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా యమునోత్రి (Yamunotri), గంగోత్రి ఆలయ ద్వారాలను హిందూ సంప్రదాయం ప్రకారం, స్థానికులు నిర్వహించే వేడుకలు ఆచారాల మధ్య ప్రారంభించారు. చలికాలం ఆరు నెలల పాటు ముఖ్బా గ్రామంలో పూజలు అందుకున్న గంగమ్మ విగ్రహాన్ని గంగోత్రి ధామానికి (Gangotri Dham) మేళతాళాలమధ్య, భక్తిరస సంగీతంతో ఊరేగింపుగా తీసుకువచ్చారు.
- తమ గ్రామానిక విడిచి పవిత్ర ధామానికి వెళ్తున్న గంగమ్మను చూసి గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు.
ఇక యుమునా దేవి ఊరేగింపు ఖుషీ మఠ్ నుంచి భక్తుల నినాదాలు, భక్తోత్సహాల మధ్య యమునోత్రి ధామానికి (Yamunotri Dham) చేరుకోగా ఉదయం 11.55 నిమిషాలకు ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.
- అనంతరం భక్తులకు అమ్మవార్ల దర్శనానికి అనుమతి ఇచ్చారు. మరో ఆరు నెలల పాటు ఈ ఆలయాలు భక్తుల కోసం తెరిచి ఉండనున్నాయి.
- ఇది కూడా చదవండి : కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకునే తేదీలివే ! Char Dham Yatra 2025 Dates
సెక్యూరిటీ పెంపు | Security Measure and Pilgrim Safety

పహల్గాం ఘటన (Pahalgam Attack) తరువాత ఈ ఏడాది ఛార్ ధామ్ యాత్ర భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
- 6,000 పోలిస్ సిబ్బందితో పాటు, 17 కంపెనీల ప్రోవిన్షియన్ ఆర్మడ్ కానిస్టేబ్యులరీ, 10 కంపెనీల పారామిలటరీ దళాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.
- ఛార్ ధామ్ యాత్ర (Char Dham Yatra 2025 Begins) జరిగే ప్రాంతాలను 15 సూపర్ జోన్లుగా విభజించి 2,000 కేమరాలతో నిఘా ఏర్పాటు చేశారు. వీటన్నింటిని మానిటర్ చేయడానికి ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
- ప్రమాదకరమైన 65 ప్రాంతాల్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. రద్దీ నిర్వహణ విషయంలో కూడా వీరి సాయం తీసుకోనున్నారు.
- ఇది కూడా చదవండి : కైలాష్ మానసరోవర యాత్ర ఎలా వెళ్లాలి ? ఎంత ఖర్చు అవుతుంది ? ఎన్ని .. | Kailash Mansarovar Yatra 2025
ఇక ప్రమాదాలను పసిగట్టి నియంత్రించేందుకు ఇంటెలిజెెన్స్ ఏజెన్సీలు హై ఎలర్ట్‌లో ఉండనున్నాయి. ఇలా ఛార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం అని అధికారులు తెలిపారు.
రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్ | Char Dham Yatra Registration
ఛార్ ధామ్ యాత్రకు ఇప్పటి వరకు సుమారు 22 లక్షల మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారని సమాాచారం. ఈసారి మొత్తం 60 లక్షల మంది భక్తులు తీర్థయాత్రకు వచ్చే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కేదార్‌నాథ్ (Kedarnath) ఆలయ ద్వారాలు మే 2వ తేదీన, బద్రినాథ్ (Badrinath) ఆలయ ద్వారాలు మే 4వ తేదీన తెరుచుకోనున్నాయి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.