కేదార్నాథ్కు హెలికాప్టర్ సేవలు ప్రారంభం | Sonprayag
ఛార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. సోన్ ప్రయాగ్ (Sonprayag) నుంచి కేదార్నాథ్ వరకు హెలికాప్టర్ సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి నడక మార్గంలో , గుర్రం, పల్లకిలో చేరుకుంటారు.
ఛార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. సోన్ ప్రయాగ్ (Sonprayag) నుంచి కేదార్నాథ్ వరకు హెలికాప్టర్ సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి నడక మార్గంలో , గుర్రం, పల్లకిలో చేరుకుంటారు.
హెలికాప్టర్ సేవలు ప్రారంభం అవ్వడం వల్ల ఇకపై శ్రమ లేకుండా తక్కువ సమయంలోనే కేదారనాథుడిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది.
ముఖ్యాంశాలు
ఎలా బుక్ చేసుకోవాలి ? | How to Book Kedarnath Helicopter Service
కేదార్నాథ్కు హెలికాప్టర్లో వెళ్లాలి అనుకునే భక్తులు ఐర్సీటీసిలో (IRCTC) బుక్ చేసుకోవచ్చు. లేదంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లేదా సెక్టార్ మెజిస్ట్రేట్ వద్ద కూడా టికెట్లు పొందవచ్చు. మార్గంలో ప్రతీ రోజు 20 నుంచి 30 షటిల్ ఫ్లైట్స్ నడవనున్నాయి.
దీంతో 150 మంది ప్రయాణికులకు (Travel) వాయుమార్గంలో కేదార్నాథ్ చేరుకునే అవకాశం లభిస్తుంది. ఈ సదుపాయం వల్ల సమయం ఆదా అవుతుంది. శారీరక శ్రమ కూడా తగ్గుతుంది.
ప్రయాణికుల భద్రతే ముఖ్యం | Sonprayag
హెలికాప్టర్ సేవలు అనేవి వాతావరణం ఆధారంగా నడుస్తాయి. ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణం బాగున్నప్పుడే వీటిని నడుపుతారు. ప్రతీ రోజు 30 వరకు హెలికాప్టర్లను నడపాలని భావిస్తోన్నా…వాతావరణం అనుకూలించకపోతే టికెట్లను కేన్సిల్ చేసి ప్రయాణికులకు ఆ వివరాలు అందిస్తారు.
- ఇది కూడా చదవండి : చార్ ధామ్ యాత్రికుల కోసం ఐఆర్సీటీసి డీలక్స్ ప్యాకేజ్…ఎంత? ఎన్నిరోజులు ? ఎప్పుడు ? ఎలా ? | IRCTC Tourism
రికార్డు స్థాయిలో రిజిష్ట్రేషన్లు | Char Dham Yatra 2025 Registration
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఛార్ ధామ్ యాత్రకు వెళ్లే ముందు రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2025 సంవత్సారానికి గాను ఇప్పటి వరకు సుమారు 22 లక్షల మంది తమ పేర్లను రిషికేష్ (Rishikesh) ట్రాన్సిట్ క్యాంపులో నమోదు చేయించుకున్నారని సమాచారం.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
