జూపార్క్‌కు వెళ్లే ముందు ఇవి తెలియకపోతే టైమ్ వేస్ట్ అవుతుంది | Hyderabad Zoo Entry Fee ,Timings
హైదరాబాద్ జూ పార్క్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ పోస్టులో మీకు లేటెస్ట్ ఎంట్రీ ఫీ, పార్కింగ్, బ్యాటరీ కారు, క్రౌడ్ టిప్స్ (Hyderabad Zoo Entry Fee & Timings 2025).. ఇలా పనికొచ్చే సమాచారం మాత్రమే అందిస్తున్నాం.
ముఖ్యాంశాలు
జూ పార్క్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? | Planning to Visit Hyderabad Zoo Park
టికెట్ ధర ఎంత, టైమింగ్ ఏంటి, పార్కింగ్ పరిస్థితి ఏంటి అని లాస్ట్ మినిట్‌లో గూగుల్ చేస్తున్నారా? అయితే ఈ పోస్టు మీ టైమ్‌తో పాటు డబ్బును కూడా సేవ్ చేస్తుంది అని బల్లగుద్ది మరీ చెప్పగలను. చరిత్ర వంటి (Hyderabad Zoopark History) డీప్ విషయాల గురించి తరువాత మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా పాయింట్ దగ్గరికి వెళ్లిపోదాం.
Quick Information
పనికొచ్చే సమాచారం | Zoo Park Quick Information
- Opening Time : జూపార్క్ ఓపెన్ అయ్యే టైమ్ : ఉదయం 8:00 గంటలకు
- Closing Time : క్లోజింగ్ టైమ్ : సాయంత్రం 5:30కి
- లాస్ట్ ఎంట్రీ : 4:30 PM
- సెలవు రోజు : సోమవారం
- పెద్దలకు టికెట్ : రూ.100
- పిల్లల టికెట్ ధర : రూ.50
- జూపార్క్ లొకేషన్ : బహాదూర్‌పురా, హైదరాబాద్
ధర, టైమింగ్స్ అనేవి సాధారణ రోజులకు మాత్రమే అని గుర్తుంచుకోండి. ప్రత్యేక దినాల్లో మారే అవకాశం ఉంటుంది.

Entry Fee Section
ఎంట్రీ ఫీజు | Hyderabad Zoo Entry Fee 2025
- పెద్దలకు (Tickets for Adults) : రూ.100
- పిల్లలకు (Tickets for Kids – 3 నుంచి 12 ఏళ్ల వయసు) : రూ.50
- స్టిల్ కెమెరా : రూ.50
- వీడియో కెమెరా : రూ.200
ఇక స్కూల్ నుంచి వెళ్లే విద్యార్థులకు వారి ఐడీ కార్డు ఆధారంగా ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది.
3 ఏళ్లలోపు చిన్నారులకు ప్రవేశం ఉచితం.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్‌లో అదిరిపోయే కొరియన్ రుచులు.. ఐటీసీ వద్ద రూ.200కే నోరూరించే స్ట్రీట్ ఫుడ్
టిప్ : జూపార్క్ వెళ్లే ముందు మీతో పాటు క్యాష్ కూడా తీసుకెళ్లండి. అలాగే UPI ఆప్షన్ కూడా ఉంటే బెటర్.
Paid Services
అదనపు పెయిడ్ సర్వీసులు | Paid Services in Hyderabad Zoo
బ్యాటరీ కార్ లేదా ఎలక్ట్రిక్ వాహనానికి (Battery Car / Electric Vehicle) ప్రతీ వ్యక్తికి రూ.50 చార్జీ చేస్తారు.
ఇది సీనియర్ సిటిజన్, చంటి పిల్లలు ఉన్న కుటుంబానికి బాగా సెట్ అవుతుంది.
- పార్కింగ్ చార్జిల (Parking Charges) విషయానికి వస్తే టూ వీలర్స్‌కు రూ.40, కారుకు రూ.80 చార్జ్ చేస్తారు.
- టాయ్ ట్రైన్ (Toy Train) చార్జీలు అనేవి అవైలబిలిటీని బట్టి మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40గా ఉంటుంది.
- ఇది కూడా చదవండి : Street Food : హైదరాబాద్‌లో ఈ స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.. తిని తీరాల్సిందే
Best Time
జూపార్క్ ఎప్పుడు వెళ్లాలి? | Best Time to Visit Hyderabad Zoo
బెస్ట్ టైమ్ : ఉదయం 8:00 నుంచి 10:30 వరకు
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో వెళ్లకపోవడం మంచిది.
శని, ఆదివారాల్లో (Weekends) రష్ ఎక్కువగా ఉంటుంది.
పండగ రోజులలో రద్దీ డబుల్ అవుతుంది.
- ఇది కూడా చదవండి : క్లీనర్ నుంచి భారత్‌లోనే అతిపెద్ద టీ కేఫ్ పెట్టేవరకు కేఫ్ నీలోఫర్ ఫౌండర్ కథ | Hitech City Cafe Niloufer
Rush Section
రద్దీ అండ్ టికెట్ కోసం పడే పాట్లు | Zoo Rush and Ticket Queue
ఉదయం 9:30 తర్వాత క్యూలైన్లో క్రౌడ్ పెరుగుతుంది.
బ్యాటరీ కార్ టికెట్లు త్వరగా అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఉదయం 8 నుంచి 9 మధ్యలో జూపార్క్‌కు వెళ్లేలా ప్లాన్ చేయండి.
- ఇది కూడా చదవండి : తెలంగాణలోని ఈ ఆలయానికి వెళ్తే అరుణాచలం వెళ్లినట్టే…| Chinna Arunachalam
Parking Tips
పార్కింగ్ ఫీజు | Zoo Park Parking & Entry Gate Tips
మెయిన్ గేట్‌కు పక్కనే పెద్ద పార్కింగ్ ఉంటుంది. పీక్ టైమ్‌లో ఫిల్ అయిపోతుంది.
కార్లో వెళ్లాలంటే 9 గంటలలోపు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి.
Rules
ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి | Important Rules
- పార్క్‌లోకి బయటి ఫుడ్ అలో లేదు.
- వాటర్ బాటిల్ తీసుకెళ్లవచ్చు.
- ప్లాస్టిక్ కవర్లు లోపలికి అనుమతి లేదు.
- జంతువులకు ఆహారం ఇవ్వడం నిషేధం.
- పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టకండి.
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు | 10 Facts About Bhakra Nangal Train
FAQs
తరచూ అడిగే ప్రశ్నలు | Zoo Park FAQs
ఈ రోజు జూపార్క్ తెరిచి ఉంటుందా? | Is Hyderabad Zoo open today?
→ సోమవారం తప్పా ప్రతీ రోజు తెరిచే ఉంటుంది.
జూ మొత్తం చూడాలంటే ఎంత టైమ్ పడుతుంది ? | How much time needed to see full zoo?
→ తక్కువలో తక్కువ 3 నుంచి 4 గంటలు పడుతుంది.
బ్యాటరీ కారు అందరికీ అవసరమా ? | Battery car worth it ?
→ లేదు. సీనియర్ సిటిజెన్లు, పిల్లలతో వెళ్లేవారికి అవసరం అయితే తీసుకోవచ్చు. మిగితా వాళ్లకు ఆప్షన్ మాత్రమే.
జూ పార్క్ వెళ్లే బెస్ట్ సీజన్ ఏంటి ? | What’s The Best Season
→ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో క్లైమేట్ బాగుంటుంది.
ఆన్లైన్లో టికెట్స్ కొనొచ్చా ? | Can We Buy Tickets Online
→ చాలా మంది ఆఫ్‌లైన్‌లో అంటే టికెట్ కౌంటర్ దగ్గరే కొంటారు. రద్దీ ఎక్కువగా ఉంటే ఆన్లైన్లో కొంటారు.
హైదరాబాద్ జూ పిల్లలకు సేఫేనా ? | Is Hyderabad Zoo Safe For Kids ?
→ ఫుల్ సేఫ్, ప్రైవేట్ సెక్యూరిటీ, నడిచేందుకు దారులు ఉంటాయి.
Food Section
దగ్గర్లో ఫుడ్ బ్రేక్ కోసం | Nearby Food & Break Tips
జూ పార్క్ బయట చిన్న ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కానీ హైజీనిక్‌గా ఉండవు.
చార్మినార్ (Charminar) లేదా షాలిబండా వైపు వెళ్లి ఫుడ్ ప్లాన్ చేసుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : Horsley Hills : ఆంధ్రా ఊటీకి క్యూ కడుతున్న తెలుగు ప్రయాణికులు
హైదరాబాద్ జూపార్క్ విజిట్ చేసే సమయంలో మీరు అస్సలు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు.
ఈ గైడ్ మీకు బాగా యూజ్ అవుతుంది. అందుకే దీన్ని సేవ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేయండి.ఇలాంటి హైదరాబాద్ పోస్టులు, గైడ్స్ కోసం బుక్‌మార్క్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్యూ.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
