India New e-Passport : ఈ- పాస్‌పోర్ట్ ఎలా అప్లై చేయాలి ? ఎవరు అర్హులు? ఎలా పని చేస్తుంది?
India New e-Passport : చాలా రోజుల నుంచి ఈ-పాస్‌పోర్టు అప్డేట్ కోసం వేచి చూస్తున్న వారికి శుభావార్త. భారత దేశ ప్రభుత్వం e-passport ను అధికారికంగా ప్రారంభించింది. దీనిని ఎలా అప్లై చేయాలి ? ఎవరు అప్లై చేయవచ్చు, లాభాలేంటో తెలుసుకుందామా?
అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయుల కోసం భారత ప్రభుత్వం ఈ పాస్‌పోర్ట్ (Passport) సేవలను ప్రారంభించింది. ఇకపై విదేశీయాత్రలు చేసే భారతీయులు స్మార్టుగా, సేఫ్‌గా, పాస్ట్‌గా తమ ప్రయాణాలు పూర్తి చేసుకోవచ్చు.
నిజానికి పాస్‌పోర్ట్ సేవలో ఇది ఒక మైలురాయి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కొత్త టెక్నాలజీలో పాస్‌పోర్టులో మైక్రో చిప్ ఉంటుంది. దీని వల్ల ఇమ్మిగ్రేషన్ చెక్స్ చాలా స్పీడుగా జరిగిపోతాయి. పాస్‌పోర్ట్ మోసాలు, డూప్లికేషన్స్ వంటివి తగ్గుతాయి.
- ఇది కూడా చదవండి : వీసా లేకుండా ఈ 41 దేశాల ప్రజలు అమెరికా వెళ్లొచ్చు… ఈ లిస్టులో భారత్ పేరుందా? | Visa Free US Travel
ముఖ్యాంశాలు
E-passport ప్రత్యేకతలు ఏంటి ? | e-passport features
ఈ సరికొత్త విధానంతో భారత దేశం అంతర్జాయతీయ ట్రావెల్ స్టాండర్డ్‌కి మరింత చేరువవుతుంది . సాంకేతికంగా ఇది ఒక మైలురాయి అని కూడా చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా ఒక ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది.
- ఈ చిప్‌లో ప్రయాణికుల బయోమెట్రిక్ వివరాలు, వ్యక్తిగత వివరాలు సెక్యూర్డ్‌గా, ఎన్‌స్క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తారు.
- దీని వల్ల ప్రయాణికుడి ఐడెంటిటీ చోరీ అవదు, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది.
- భారతీయ పాస్‌పోర్టుకు అంతర్జాతీయంగా మరింత పవర్ లభిస్తుంది. గుర్తింపు లభిస్తుంది. యాక్సెప్టెన్స్ పెరుగుతుంది.
- ఇది కూడా చదవండి: కొత్త దేశం వెళ్తున్నారా? అయితే ఈ పపులు అస్సలు చేయకండి!
- ఇది కూడా చదవండి : Flight Ticket Bookings: ఫ్లైట్ టికెట్స్ చవకగా బుక్ చేసుకోవడానికి 11 టిప్స్
ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు పాస్‌పోర్టు ప్రక్రియను బాగా డెవెలెప్ చేశాయి. ఈ గేట్స్, ఆటోమేటెడ్ ఇంటిగ్రేషన్ సిస్టమ్స్‌తో పని చేస్తున్నాయి. అందుకే వాటికి తగినట్టు భారత దేశం కూడా సాంకేతికంగా అప్‌గ్రేడ్ అయింది.
e-Passport కోసం ఎవరు అప్లై చేయవచ్చు? | Who Can Apply e-passport
ఈ పాస్‌పోర్టు అధికారికంగా ప్రారంభం అయింది కాబట్టి ఇది ఎవరు అప్లై చేయవచ్చో కూడా తెలుసుకుందాం. ముందుగా కొన్ని నిర్ధిష్టమైన అర్హతలు ఉన్న ఏ భారతీయ పౌరుడు అయినా ఈ e-passport కోసం అప్లే చేయవచ్చు.
- అయితే ఇది ప్రస్తుతం కొన్ని passport seva kendra( PSKs) లతో పాటు కొన్ని పోస్టాఫిస్లోని post office passport seva kendras (POPSKs) లోనే అందుబాటులో ఉంటుంది.
- ఒక వేళ మీరు అప్లే చేయాలి అనికుంటే మీకు దగ్గరల్లో ఉన్న పాస్‌పోర్టు కార్యాలయంలో e-passport అప్లై చేసే అవకాశం ఉందో లేదో తెలుసుకోండి.
త్వరలో దేశ వ్యాప్తంగా కొత్త అప్లికేషన్స్, రిన్యూవల్స్ సమయంలో కూడా ఈ పాస్‌పోర్టును అప్లై చేసే వెసులుబాటు కల్పించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
e-Passport కోసం ఎలా అప్లై చేయాలి ? | how to apply e passport
ఇక ఈ పాస్‌పోర్టు ఎలా అప్లై చేయాలని అనే విషయానికి వస్తే మనం మామూలు పాస్‌పోర్టును అప్లై చేసే విధంగానే దీని కోసం అప్లై చేయాలి.
- ముందుగా మీరు Passport seva వెబ్‌సైట్‌కు వెళ్లి మీ ఎకౌంట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఎకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వొచ్చు.
- పాస్‌పోర్టు కోసం అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది.
- పోర్టల్‌లో ప్రస్తావించిన రుసుము (passport application fees) చెల్లించాల్సి ఉంటుంది.
- తర్వాత మీకు దగ్గర్లో ఉన్న పాస్‌పోర్టు కార్యాయంలో లేదా పోస్టాఫిస్ పాస్ పోర్టు సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
- అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫోటో, బయోమెట్రిక్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్న రోజు హాజరు అవ్వాల్సి ఉంటుంది.
- మీ అప్లికేషన్‌కు అంగీకారం లభిస్తే…చిప్ ఉన్న కొత్త ఈ పాస్‌పోర్ట్ ప్రింట్ అయ్యి మీ అడ్రెస్‌కు వస్తుంది.
- ఇది కూడా చదవండి : First time Flyers : ఫస్ట్ టైమ్ విమానం ఎక్కుతున్నారా ? ఈ 10 టిప్స్ మీ కోసమే
- ఇది కూడా చదవండి : Jet Lag Decoded : జెట్లాగ్ అంటే ఏంటి ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?
E-passport వల్ల ప్రయోజనాలు ? | Importance Of India New e-Passport
మారుతున్న కాలాన్ని బట్టి మారే సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత దేశం ఎప్పుడూ ముందుంటుంది. అదే కోవలో కొత్త పాస్‌పోర్టును భారతీయులకు అందించనుంది. ఈ పాస్ట్ పోర్టు ప్రయోజనాల విషయానికి వస్తే…
- పాస్‌పోర్టు డూప్లికేషన్, ఐటెంటిటీ థెప్ట్ ప్రమాదాలు తగ్గుతాయి.
- ఇది భవిష్యత్తు అవసరాలకు సరిపడే ఒక సరికొత్త డిజిటల్ ట్రావెల్ డాక్యుమెంట్.
- అంతర్జాతీయ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా దీనిని సిద్ధం చేశారు.
- దీంతో ఇమ్మిగ్రేషన్ చెక్స్ వేగంగా జరుగుతాయి.
- వ్యక్తిగత వివరాల చోరీ ఉండదు. ఎందుకంటే డాటా మొత్తం ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
