రైల్వే ప్రయాణికులకు అలెర్ట్… ఈ లిమిట్ దాటితే లగేజీని కోచులోకి తీసుకెళ్లనివ్వరు | Indian Railways New Luggage Rules
మన దేశంలో రైలు ప్రయాణ వ్యవస్థ మెల్లిమెల్లిగా మారుతోంది. భారతీయ రైల్వే రూల్స్‌ను ((Indian Railways New Luggage Rules) కఠినంగా అమలు చేస్తోంది. ఫ్రీ లిమిట్, ఎక్స్ట్రా చార్జీలు, సైజ్ రూల్స్… ఇవన్నీ మీ నెక్స్ట్ ట్రైన్ జర్నీకి ముందు తెలుసుకోవాలి అని ఈ పోస్టు పబ్లిష్ చేస్తున్నాం.
రైలు ప్రయాణం (Train Journey) అనేది భారతీయుల జీవితంలో ఒక భాగం అని చెప్పవచ్చు. ఆఫీస్ పనుల్లో అయినా, ఫ్యామిలీ ట్రిప్ అయినా, లాంగ్ జర్నీ లేదా షార్ట్ జర్నీ అయినా… రైల్వే ప్రయాణం చవక, సేఫ్ అనే ఫీలింగ్ మనలో ఉంటుంది.
ముఖ్యాంశాలు
అయితే ఇకపై ట్రైన్ జర్నీలో మనతో పాటు తీసుకెళ్లే లగేజ్ (Luggage) విషయంలో కాస్త జాగ్రత్తగా, కాలిక్యులేటెడ్‌గా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇటీవలే రైల్వే శాఖ లగేజ్ రూల్స్‌ను కఠినంగా అమలు చేయడం ప్రారంభించింది. ఇది కొంతమంది ప్రయాణికులకు కన్ఫ్యూజన్ కలిగించే అవకాశం ఉంది.
- ఇది కూడా చదవండి : టికెట్ Confirm లేదా Waiting అనేది 10 గంటల ముందే తెలుస్తుంది | Railway Ticket Chart
ఈ పోస్టులో ఎయిర్పోర్ట్ స్టైల్లో లగేజ్ రూల్స్ ఎలా ఉంటాయి, ఫ్రీ లగేజ్ ఎంత, ఎక్స్ట్రా చార్జీలు ఎప్పుడు అప్లై అవుతాయి, సైజ్ లిమిట్ వంటి సింపుల్ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభిస్తాయి.
- ఇది కూడా చదవండి : ఎలుకలు, బొద్దింకలు, చిల్లర తిరిగివ్వని క్యాటరింగ్ సిబ్బంది… 46 గంటల ట్రైన్ జర్నీలో ఫ్రెంచ్ యూట్యూబర్ అనుభవాలు | Indian Train Journey
రైల్వే లగేజ్ రూల్స్ ఎందుకు మారాయి? | Why did Railways Changed Luggage Rules
రైలు బోగీల్లో పరిమితికి మించిన సామాన్ల వల్ల ఇరుకుగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని తగ్గించడానికి, ప్రయాణికుల సేఫ్టీ పెంచడానికి రూల్స్ అమలు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుల్లో ఉన్న బ్యాగేజీ డిసిప్లిన్‌ను ట్రైన్లలో కూడా తీసుకురావాలన్నదే రైల్వే (Indian Railways) లక్ష్యం.
ఫ్రీగా ఎంత లగేజ్ తీసుకెళ్లవచ్చు? | Free luggage allowance by class
రైల్వే ప్రయాణికులు ట్రావెల్ క్లాస్‌ను బట్టి ఉచిత లగేజ్ పరిమితి మారుతుంది.
- AC First Class – 70 కిలోల వరకు ఉచితం
- First Class – 50 కేజీల వరకు ఉచితం
- AC 3 Tier, Sleeper Class – 40 కేజీలు
- Second Class – 35 కేజీల వరకు ఉచితం
- ఇది కూడా చదవండి : “యూకే, భారత్ నుంచి నేర్చుకో”… ట్రైన్లో ఫుడ్ డిలివరీ..యూరోపియన్ ట్రావెల్ వ్లాగర్ | On-Train Food Delivery
ఈ లిమిట్స్ దాటనంత వరకు ఎలాంటి చార్జీలు ఉండవు.
లిమిట్ దాటితే? | Excess luggage charges explained
ఉచిత లగేజ్ లిమిట్‌ను దాటితే, ఎంత బరువు ఎక్కువగా ఉందో ఆ ఎక్స్ట్రా వెయిట్‌కు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీరు Sleeper Class లో జర్నీ చేస్తున్నారు అనుకుందాం. మీ ఫ్రీ లగేజ్ పరిమితి 40 కిలోలు. కానీ మీరు తీసుకొచ్చిన లగేజ్ 55 కిలోలు ఉంది అనుకుందాం. ఆ ఎక్స్ట్రా 15 కేజీలపై స్టాండర్డ్ లగేజ్ చార్జీకి 1.5 టైమ్స్ చెల్లించాలి.
మ్యాగ్జిమం ఎంత లగేజ్ ? | Maximum luggage limit in coaches
ఒక ట్రైన్‌లోని ప్రతి ట్రావెల్ క్లాస్‌కు ఒక అప్పర్ క్యాప్ (గరిష్ఠ పరిమితి) ఉంటుంది.
- AC First Class – 150 కేజీల వరకు
- First Class – 100 కేజీలు
- AC 3 Tier – 40 కేజీలు
- Sleeper Class – 80 కేజీలు
- Second Class – 70 కేజీలు
ఈ లిమిట్ దాటితే లగేజీని కోచులోకి తీసుకెళ్లనివ్వరు.
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు | 10 Facts About Bhakra Nangal Train
లిమిట్ క్రాస్ అయితే ? | What if luggage exceeds allowed limit?
పరిమితికి మించిన లగేజీని పార్సెల్ సర్వీస్ లేదా బ్రేక్ వాన్ (SLR) లో సెపరేట్‌గా బుక్ చేయాలి. ప్యాసెంజర్ కంపార్ట్మెంట్లోకి తీసుకెళ్తే పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది.
సైజుపై కూడా లిమిట్స్ ఉన్నాయా? | Luggage size restrictions
ట్రంక్ పెట్టెలు, సూట్‌కేసులు, బాక్సులు 100 సెం.మీ x 60 సెం.మీ x 25 సెం.మీ కన్నా పెద్దగా ఉండకూడదు. ఈ పరిమాణాన్ని మిస్తే కోచులోకి అనుమతించరు.
కమర్షియల్ గూడ్స్‌ని తీసుకెళ్లవచ్చా? | Can business goods be carried?
ఛాన్సే లేదు. బిజినెస్ లేదా కమర్షియల్ గూడ్స్‌ను పర్సనల్ లగేజ్లా క్యారీ చేయడం కుదరదు. అవి తప్పనిసరిగా పార్సెల్ సర్వీస్‌లోనే బుక్ చేయాలి.
- ఇది కూడా చదవండి : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా?
ఎప్పటి నుంచి అమలు అవుతాయి? | When do these rules apply?
నిజానికి ఈ రూల్స్ ఇప్పటికే ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటిని కఠినంగా అమలు చేయడం ప్రారంభించారు. అందుకే చెకింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.
ట్రావెలర్స్ ఏం గుర్తుంచుకోవాలి? | What should frequent travelers remember?
ఈ రూల్స్ ప్రయాణికులను భయపెట్టడానికి కాదు. లాస్ట్ మినిట్ స్ట్రెస్, కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి మళ్లీ వీటి గురించి ప్రచారం చేస్తున్నారు, అమలు చేస్తున్నారు.
- ఇది కూడా చదవండి :ఇది కూడా చదవండి : IRCTC Pay Later : ఇక జేబులో డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా ?
ప్రయాణం స్టార్ట్ చేయడానికి ముందు
- లగేజ్ వెయిట్ చెక్ చేయండి
- బ్యాగ్ సైజ్ మెజర్ చేయండి
- ఫ్రీ లిమిట్ దాటితే పార్సెల్ బుకింగ్ ముందే ప్లాన్ చేసుకోండి
ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ జర్నీల్లో లగేజ్ ఎక్కువగా ఉంటే పార్సెల్ బుకింగ్ చేయడం వల్ల జర్నీ స్మూత్‌గా ఉంటుంది.
ఇప్పటివరకు ప్రయాణికులు కేవలం టికెట్, సీట్ గురించే ఆలోచించేవారు. ఇకపై లగేజ్ బరువు (Indian Railways New Luggage Rules) గురించి కూడా ఆలోచించాల్సిందే. లిమిట్ దాటితే పర్సుపై కూడా ప్రభావం పడుతుంది.
అందుకే Be alert, be prepared, మీ నెక్స్ట్ ట్రైన్ జర్నీని ప్లాన్ చేసుకోండి
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
