ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా (Vontimitta Brahmotsavam 2025) జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముందు ఆనవాయితీగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తుంటారు.
ముఖ్యాంశాలు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఈ బ్రహ్మోత్సవాలకు ముందు ఆనవాయితీగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తుంటారు. అందులో భాగంగాా ఒంటిమిట్టలోని ఏకశిలానగరంలోని ఆలయంలో 2025 ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
కార్యక్రమ వివరాలు | Koil Alwar Tirumanjanam

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామివారిని ( Lord Sri Rama) సుప్రభాతంతో మేల్కొలిపారు. తరువాత అర్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు.
విధిలో భాగంగా ఆలయంలోని గర్భాలయ ప్రాంతం, శ్రీ ఆంజనేయ స్వామి, గరుత్మంతుని సన్నిధి పాటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు ప్రాంతంతో పాటు పూజలకు వినియోగించే సామాగ్రి వంటి అనే వస్తువులను నీటితో శుద్ధి చేశారు.
ప్రోక్షణ కార్యక్రమం | Temple Prokshana

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా ఆలయం ప్రాంగణం, పూజా సామగ్రిని శుద్ధి చేసిన తరువాత ప్రోక్షన కార్యక్రమం చేపడతారు. అందులో భాగంగా నామకోపు, కస్తూరి పసుపు, శ్రీ చూర్ణం, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకమ కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన పవిత్ర జలంతో ఆలయ ప్రాంగణంలో ప్రోక్షణం చేశారు.
ప్రోక్షణం తరువాత ఉదయం 11 గంటల 30 నిమిషాలకు భక్తులకు దైవ దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులతో పాటు మరికొంత మంది పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలలో వాహన సేవ వివరాలు | Vontimitta Brahmotsavam 2025
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి (Vontimitta Temple) ఆలయంలో 2025 ఏప్రిల్ 6వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగే ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే వివిధ కార్యక్రమాల వివరాలు :
2025 ఏప్రిల్ 6
- ఉదయం 9.30 నుంచి 10.15 నిమిషాల వరకు ధ్వజారోహణం
- రాత్రి శేష వాహనంలో భక్తులకు అభయం ఇవ్వనున్న స్వామి
2025 ఏప్రిల్ 7:
- ఉదయం వేణుగానాలంకరణ జరుగుతుంది.
- రాత్రి హంస వాహనంపై ఊరేగించనున్న స్వామివారు.
2025 ఏప్రిల్ 8 :
- ఉదయం స్వామివారికి వటపత్రశాయి అలంకరణ ఉంటుంది.
- రాత్రి సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు ఉంటుంది.
2025 ఏప్రిల్ 9:
- ఉదయం స్వామివారికి నవనీత కృష్ణాలంకారణ కార్యక్రమం ఉంటుంది.
- రాత్రి సమయం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామి.
2025 ఏప్రిల్ 10 :
- ఉదయం మోహినీ అలంకరణ
- రాత్రి స్వామివారి గరుడసేవ కార్యక్రమం జరుగుతుంది.
2025 ఏప్రిల్ 11 :
- ఉదయం శివధనుర్భాణ అలంకరణ
- రాత్రి కళ్యాణోత్సవం/గజవాహనంపై దర్శనం ఇవ్వనున్నారు స్వామివారు
2025 ఏప్రిల్ 12 :
- ఉదయం సమయలంలో రథోత్సవం జరుగుతుంది.
2025 ఏప్రిల్ 13:
- ఉదయం స్వామివారికి కాళీయమర్థన అలంకరణ
- తరువాత రాత్రి సమయంలో అశ్వవాహన సేవలు జరుగుతాయి.
2025 ఏప్రిల్ 14 :
- ఉదయం చక్రస్నానం
- రాత్రికి ధ్వజారోహణం ఉంటుంది.
Vontimitta Brahmotsavam 2025 : ఇక ఏప్రిల్ 15న సాయత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం (Pushpayagam) నిర్వహించన్నారు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.