Travel Advisories : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్…పలు విమానాశ్రయాలు మూసివేత

షేర్ చేయండి

Travel Advisories : పాకిస్తాన్‌లోని పలు ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ తరువాత వైమానిక ఆంక్షల్లో భాగంగా ఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేశారు. 

ఈ సందర్భంగా ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశా ఎయిర్ (Akasa Air), స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలు ప్రయాణికులకు అత్యవసర ప్రయాణ సూచనలు జారీ చేశాయి. ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు ఈ సూచనలు చదవాల్సిందిగా కోరాయి ఆ సంస్థలు.

ఈ విమానాశ్రయాల మూసివేత.. | North Indian Airports Closed 

ఉత్తర భారత దేశంలో ఉన్న శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, ధర్మశాల (Dharamshala), బికనేర్, జోధ్‌‌పూర్, చంఢిగడ్, హిండోన్ ( ఢిల్లీ ఎన్సీఆర్) భుజ్, జామ్‌నగర్, రాజ్ కోట్ విమానాశ్రయాలను మూసివేశారు. తదుపరి సూచనలు వెలువడే వరకు శ్రీనగర్‌లోని ఎయిర్‌‌ఫీల్డ్ నుంచి కమర్షియల్ విమానాలను ఇక నడపరు. ఇక పైన వివరించిన నగరాలకు విమానాలు పూర్తిగా కేన్సిల్ అయ్యాయి.

ఎయిర్‌లైన్స్ గైడ్‌లైన్స్ | Travel Advisories

విమానాశ్రయాలను షడ్ డౌన్ చేసిన విషయం తెలుసుకున్న వెంటనే భారత్‌కు చెందిన విమానయాన సంస్థలు (Airlines In India) వెంటనే రంగంలోకి దిగాయి.

షడ్ డౌన్ అయిన ఎయిర్‌పోర్టులకు వెళ్లే విమానాలను వెంటనే రద్దు చేసింది ఇండిగో (IndiGo) .రీబుకింగ్‌తో పాటు రీఫండ్ అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపింది.

ఏవియేషన్ ఆథారిటీ సూచనల మేరకు  2025 మే 10 వరకు వైమానిక సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా (AirIndia) కూడా తెలిపింది.

ఇక స్పైస్ జెట్ (Spice Jet) కూడా ఫ్లైట్స్ సస్పెండ్ చేయడంతో  పాటు పలు సూచనలు జారీ చేసింది. ప్రయాణికులు (Air Travelers) ఎయిర్‌పోర్టుకు కదిలే ముందు తమ ఫ్లైట్ పరిస్థితి ఏంటో చెక్ చేసుకోవాలి అని సూచించింది. విమానాలు రద్దు అయితే రీబుకింగ్‌తో పాటు రీఫండ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

ఇక వైమానిక ఆంక్షల (airspace restrictions) వల్ల డొమెస్టిక్ సర్వీసులు కూడా ఇంటర్నేషనల్ సర్వీసులు కూడా ప్రభావితం చేశాయి. ఆంక్షల నేపథ్యంలో అమృత్సర్‌కు (amritsar) వెళ్లాల్సిన రెండు విమానాలను ఢిల్లీకి మళ్లించారు. 

ఇక విమానా సర్వీసుల్లో ఆలస్యం, అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది అని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు సమాచారం అందించారు.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!