Numaish 2026 : నుమాయిష్ కోసం సిద్ధం అవుతున్న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్
Numaish 2026 : హైదరాబాద్‌లో కొత్త సంవత్సరం వేడుకలతో పాటు ప్రారంభమయ్యే నుమాయిష్ కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్ధం అవుతోంది. దీనిని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (AIIE) అని కూడా పిలుస్తారు.
భాగ్యనగరానికి తలమాణికంగా భావించే ఈ ప్రదర్శన అనేది 2026 లో జనవరి 1వ తేదీన ప్రారంభం అవుతుంది. 45 వరకు కొనసాగే ఈ ప్రదర్శన 2026 ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది.
ముఖ్యాంశాలు
Numaish 2026 Timings : నుమాయిష్ టైమింగ్ విషయానికి వస్తే
వీక్ డేస్‌లో (Weekdays) అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు నుమాయిష్ నడుస్తుంది.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ నుమాయిష్ చరిత్ర, ఎప్పుడు వెళ్లాలి ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ఇంఫర్మేషన్ | Hyderabad Numaish 2025
వీకెండ్స్ (Weekends), హాలిడేస్‌లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ తెరిచే ఉంటుంది.
ఇక పరిస్థితిని బట్టి టైమింగ్స్‌లో మార్పు చేసే అధికారం మేనేజింగ్ కమిటీ దగ్గర ఉంటుంది.
షాపింగ్ , స్టాల్స్ హైలైట్ | Shopping & Stalls Highlights
ప్రతీ సంవత్సరంలాగే ఈసారి కూడా వేల సంఖ్యలో స్టాల్స్ కోసం అప్లికేషన్స్ వస్తన్నాయి. ఇందులో..
- క్రాకరీ, కిచెన్ సామగ్రి
- రెడిమేడ్ గార్మెంట్స్
- షాలువలు, హ్యాండీ క్రాఫ్ట్స్
- ఎలక్ట్రానిక్ అండ్ టాయ్స్
ఇక నుమాయిష్‌లో షాపింగ్‌తో పాటు వ్యాపారం, ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్ ఇలా అన్నీ కలిసి ఉంటాయి. అందుకే చాలా మంది ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని వేచి చూస్తుంటారు.
ఫుడ్ లవర్స్‌కు స్పెషల్ ట్రీట్ | Special Treat To Food Lovers
ఎగ్జిబిషన్ అంటే కేవలం షాపింగ్ మాత్రమే కాదు..ఫుడ్ ఫెస్టివల్ కూడా. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన ఆహార పదార్థాలను ఎంజాయ్ చేసే అవకాశం లభిస్తుంది.
- ఎన్నో వెరైటీ స్వీట్స్
- పిస్తా హౌజ్ హలీమ్
- ఛాట్ స్ట్రీట్ ఫుడ్ వంటివి అందుబాటులో ఉంటాయి.
- ఇది కూడా చదవండి : బ్యాగులు మోసేవాడు పురుషుడు సుమతి : నుమాయిష్‌లో బ్యాగులు మోసే భర్తల రీల్ వైరల్ | Men At Numaish
కుటుంబంతో వెళ్లిన వాళ్లు ఇక్కడి ఫుడ్‌ను ట్రై చేయకుండా గ్రౌండ్ నుంచి బయటికి రావడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు.
పిల్లల ప్రపంచం కూడా | Kids ki Joyrides & Fun

ఎగ్జిబిషన్లో లేడీస్ షాపింగ్ చేస్తారు. జెంట్స్ బ్యాగులు మోస్తారు. కానీ కిడ్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు.
- ఇక్కడ పిల్లల కోసం జాయ్ రైడ్స్ అందుబాటులో ఉంటాయి.
- గేమ్స్ అండ్ ఫన్ యాక్టివిట్ చేసే అవకాశం ఉంటుంది.
దీంతో పాటు ఇక్కడ ఒక రోజు చిల్డ్రన్స్ డే (Numaish Children’s Day) కూడా ఉంటుంది. అంతే కాకుండా మహిళా దినోత్సవాన్ని కూడా సెలబ్రేట్ చేస్తారు.
ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
- శిక్షణ పొందిన రక్షణ సిబ్బందిని నియమిస్తారు.
- ఆన్ సైట్ పోలిస్ స్టేషన్ కూడా అందుబాటులో ఉంటుంది.
- ఫైర్ సేఫ్టీ కోసం ఏర్పాట్లు చేశారు.
మొత్తానికి షాపింగ్, ఫుడ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం అన్ని వర్గాల ప్రజలు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్లు వెళ్లగలిగే ప్రదేశమే నుమాయిష్. మరి మీరు ఎప్పుడైనా నుమాయిష్ వెళ్లారా? కామెంట్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
