ఇల్లు మారితే Passport Address Change చేయాలా? మార్చకపోతే ఏమవుతుంది?
కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాక Passport Address Change చేయడం మర్చిపోయారా?
ఇప్పుడు అప్డేట్ చేయకపోతే వీసా అప్లికేషన్, ఇమ్మిగ్రేషన్ సమయంలో ఇబ్బందులు రావచ్చు. అసలు రూల్స్ ఏంటి ? ప్రాసెస్ ఎంత ఈజీ? ఈ పోస్ట్‌లో క్లియర్‌గా వివరించాం.
గుడ్ న్యూస్ ఏంటంటే…
Indian Passport లో Address Change Process అనేది చాలా సింపుల్. ఈ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో మొదలై పాస్‌పోర్ట్ సేవా కేంద్రం వద్ద పూర్తి అవుతుంది.
అడ్రెస్ ఛేంజ్ ఎందుకు చేయాలి? | Why Passport Address Change Is Important
పాస్‌పోర్ట్‌లో అడ్రెస్ ఛేంజ్ అంటే అది సింపుల్ కరెక్షన్ కాదు అని తెలుసుకోండి.
ఇక్కడ భారత ప్రభుత్వం కొత్త పాస్‌పోర్ట్ (New Passport Booklet – Re-issue) ను కొత్త అడ్రెస్‌తో జారీ చేస్తుంది.
అయితే పాస్‌పోర్ట్ నెంబర్ మాత్రం పాతదే ఉంటుంది.వాలిడిటీ డేట్ కూడా అదే ఉంటుంది.జస్ట్ అడ్రెస్ మార్చినట్టు అధికారికంగా అప్డేట్ చేసి కొత్త బుక్లెట్ ఇస్తారు. తరువాత మీ ప్రయాణాన్ని కంటిన్యూ చేయవచ్చు.
సులవైన విధానం | Step-by-Step Process
ఇక చిరునామాను ఎలా మార్చాలో స్టెప్‌బై స్టెప్ వివరిస్తాను. ఫాలో అవ్వండి.
1.లాగిన్ అవ్వండి | Passport Address Change
ముందుగా మీరు పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌కు (Passport Seva Website) వెళ్లాలి.
ఆ వెబ్సైట్ వచ్చేసి https://www.passportindia.gov.in

- కొత్త యూజర్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
- పాత యూజర్ అయితే లాగిన్ అవ్వండి.
2.పాస్‌పోర్ట్ రీఇష్యూ అప్లై చేయాలి | Applying for Passport Re-issue
పైన తెలిపిన వెబ్సైట్లో లాగిన్ అయ్యాక పాస్‌పోర్ట్ రీఇష్యూ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి.
అందులో మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటి Fresh Passport, రెండవది Re-issue. మీకు కావాల్సిన ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఎందుకు రీఇష్యూ చేయాలో కారణం అడుగుతారు. అందులో Change in Existing Personal Particulars ఎంచుకోవాలి.
మీ కొత్త అడ్రెస్ వివరాలు జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని ఫిల్ చేయాలి. స్పెల్లింగ్, ఇంటి నెంబర్, పిన్ కోడ్ ఎక్కడా కూడా తప్పులు జరగకుండా చూసుకోండి.
3.అడ్రెస్ ప్రూఫ్ అప్లోడ్ చేయండి | Upload Address Proof
కొత్త అడ్రెస్లో మీరు నివసిస్తున్నట్టు తెలిపే ఒక అధికారిక అడ్రెస్ ప్రూఫ్ తప్పనిసరిగా కావాలి.
అడ్రెస్ ప్రూఫ్‌గా ఈ డాక్యుమెంట్స్ సరిపోతాయి.
- ఆధార్ కార్డు
- ఓటర్ ఐడి కార్డు
- కరెంట్ బిల్ / నీటి బిల్ / గ్యాస్ బిల్
- బ్యాంక్ పాస్‌బుక్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్
- రిజిస్టర్ అయిన రెంటల్ అగ్రిమెంట్
మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్‌పై ఉన్న వివరాలు, ఫామ్‌లో ఎంటర్ చేసిన వివరాలు తప్పకుండా మ్యాచ్ అవ్వాలి. కావాలంటే మీరు డిజిలాకర్ ఉపయోగించి ఆధార్ కార్డు అప్లోడ్ చేయవచ్చు. ఈజీ కదా.
- ఇది కూడా చదవండి: కొత్త దేశం వెళ్తున్నారా? అయితే ఈ పపులు అస్సలు చేయకండి!
4.ఫీజు చెల్లించి అపాయింట్మెంట్ బుక్ చేయాలి | Pay Fee & Book Appointment
అడ్రెస్ ప్రూఫ్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ సేవకు సంబంధించిన ఫీజును ఆన్లైన్లోనే చెల్లించాలి.తరువాత మీకు దగ్గరలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంచుకుని అపాయింట్మెంట్ బుక్ చేయాలి.
5.పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి వెళ్లాలి | Passport Office Visit
అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న రోజున ఈ డాక్యుమెంట్స్ తీసుకుని సేవా కేంద్రానికి వెళ్లాలి.
- మీ ఒరిజినల్ పాస్‌పోర్ట్
- ఒరిజినల్ అడ్రెస్ ప్రూఫ్ (ఫోటోకాపీలు కూడా)
- అపాయింట్మెంట్ రిసీప్ట్ (ప్రింట్ తీసుకోవడం బెటర్)
అక్కడ అధికారులు మీ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు.
సిటీ లేదా రాష్ట్రం మారితే పోలీస్ వెరిఫికేషన్ జరిగే అవకాశం ఉంటుంది.
6.అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయండి | Tracking Application Status
వెరిఫికేషన్ పూర్తి అయిన తరువాత ఆన్లైన్లో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయవచ్చు.
అన్నీ బాగుంటే కొత్త పాస్‌పోర్ట్ కొరియర్ ద్వారా మీ అడ్రెస్‌కు వస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు | Important Tips
ముందుగా మీ ఆధార్ కార్డులో అడ్రెస్ అప్డేట్ చేసుకుంటే బెటర్
- అడ్రెస్లో చిన్న తప్పు ఉన్నా ప్రాసెస్ ఆలస్యం అవుతుంది
- డాక్యుమెంట్స్ క్లియర్‌గా చదవగలిగే విధంగా అప్లోడ్ చేయాలి
- పోలీస్ వెరిఫికేషన్ కాల్ వస్తే వెంటనే స్పందించాలి
తరచూ అడిగే ప్రశ్నలు | FAQs About Passport Address Change
పాస్‌పోర్ట్ వాలిడ్ ఉన్నా అడ్రెస్ ఛేంజ్ చేయవచ్చా? | Passport Address Change
చేయవచ్చు. పాస్‌పోర్ట్ ఎక్స్పైర్ కాకపోయినా అడ్రెస్ ఛేంజ్ కోసం అప్లై చేయవచ్చు.
పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరా? | Is Police Verification Mandatory?
అన్ని సందర్భాల్లో కాదు. లొకేషన్ మార్పును బట్టి ఉంటుంది.
ప్రాసెస్ పూర్తవ్వడానికి ఎంత టైమ్ పడుతుంది? | Total Processing Time
డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే 2 నుంచి 4 వారాలు పడే అవకాశం ఉంటుంది.
పాస్‌పోర్టులో అడ్రెస్ ఛేంజ్ అనేది చిన్న విషయం లాగా అనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో ప్రయాణాలు, వీసా (Visa) అప్లికేషన్స్, ఇమ్మిగ్రేషన్ సమయంలో ఇది చాలా కీలకం. కరెక్ట్ డాక్యుమెంట్స్‌తో, ప్రశాంతంగా అప్లై చేస్తే ఈ ప్రాసెస్ పూర్తిగా స్మూత్‌గా పూర్తవుతుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
