హైదరాబాద్ నగరవాసుల కోసం ఇటీవలే ఎక్స్‌పీరియం ఇకో పార్కు ప్రారంభమైంది. చాలా మంది ఇక్కడికి వెళ్లాక టైమ్ ఉంటే దగ్గర్లో ఇంకేం చూడొచ్చు అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికోసం ( Places Near Experium Eco Park )ఈ ఇకో పార్కుకు సమీపంలో లేదా దారిలో, కొంచెం దూరంలో ఉన్న 10 సందర్శనీయ స్థలాలేంటో మీకు సూచిస్తున్నాను.
ఈ పార్కు ప్రత్యేకతలు | Specifications of Experium Eco Park
ఇటీవలే హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియం ఎకో పార్క్ ( Experium Eco Park ) ప్రారంభమైన విషయం తెలిసిందే. 150 కోట్లతో నిర్మించిన ఈ అతిపెద్ద పార్కుకు హైదరాబాద్ ప్రజలు క్యూ కడుతున్నారు. 26,000 రకాల జాతుల మొక్కలను, ట్రీ కాఫీ షాప్ వంటి ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఇకో పార్కును సందర్శించేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు.

ఈ ఇకో పార్కుకు వెళ్తే మీరు దగ్గర్లో లేదా దారిలో ఉన్న కొన్ని ఇతర ప్రదేశాలకు కూడా వెళ్లవచ్చు. అవేంటో చూద్దాం.
ముఖ్యాంశాలు
1.చిలుకూరు బాలాజీ ఆలయం | Chilkur Balaji Temple

ఎకో పార్కు నుంచి సుమారు 6 కిమీ దూరంలో ఉంటుంది చిలుకూరు బాలాజీ ఆలయం. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏమి కోరుకున్నా ఆయన నెరవేరుస్తారని అంటారు. చాలా మంది వీసా బాలాజీ ( Visa Balaji ) అని కూడా పిలుస్తుంటారు.
వీసా అప్లికేషన్లు పెట్టిన వారు చాలా మంది తమకు వీసా రావాలని కోరుకుంటూ స్వామిని మొక్కుకుంటారు. శనీ, ఆదివారాల్లో ఇక్కడ భక్తుల రద్ది ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో ఎక్కడా హుండీ లేకపోవడం మరో విశేషం. చిలుకూరు ఆలయానికి సమీపంలోనే అందమైన చెరువు ఉంటుంది. దీంతో పాటు చిలుకూరు వెళ్లే దారి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
2. లోటస్ టెంపుల్ | Lotus Temple Chilkur
చిలుకూరు వెళ్లడానికి ముందే మీకు మెయిన్ రోడ్డులో లోటస్ టెంపుల్ కనిపిస్తుంది. ఇది గురుకుల్ పాఠశాల ప్రాంగణంలో ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా కాసేపు టైమ్ స్పెండ్ చేయవచ్చు.
3. గండిపేట్ | Gandipet
ఇప్పుడంటే గండిపేట్ పేరు అంతగా వినిపించడం లేదు కానీ ఒకప్పుడు ఈ ప్రాంతం స్థానిక పర్యాటకులతో కిటకిటలాడేది. తరువాత ఆప్షన్స్ ఎక్కువ అవడంతో వెళ్లే వారి సంఖ్య తగ్గింది. కానీ ఈ మధ్య కాలంలో ఇక్కడ రినోవేషన్ పనులు జరగడంతో చాలా మంది గండిపేట్ వెళ్తున్నారు.
గండిపేట్ వెళ్తే బయటి ప్రపంచాన్ని కాసేపు మర్చిపోయి ప్రశాంతంగా సమయాన్ని గడపవచ్చు. ఇక్కడ పెళ్లికాని జంటలు ఎక్కువ మంది వస్తుంటారు. ఫ్యామిలీతో కలిసి వెళ్తుంటే ఇది గమనించండి.
4. బొటానికల్ గార్డెన్స్ | Hyderabad Botanical Gardens
ఎక్స్‌పీరియం ఇకో పార్కుకు ఇది దగ్గర్లో ఉండదు కానీ నేచర్ లవర్స్‌కు ఇది బాగా నచ్చుతుంది. కోత్తగూడెం పారెస్ట్ రిజర్వ్‌లో ( Kothagudem Forest Reserve ) భాగంగా 120 ఎకరాల్లో విస్తరించి ఉంది బొటానికల్ గార్డెన్. ఇందులో మీరు ఎన్నో రకాల మొక్కలు, పూల జాతులను చూడవచ్చు. ఇందులో అలంకరణతో పాటు వైద్యానికి పనికి వచ్చే మొక్కలను మీరు చూడవచ్చు.
5. మృగవని నేషనల్ పార్కు | Mrugavani National Park

చిలుకూరుకు వెళ్లే దారిలో గండిపేట్ రోడ్డుకన్నా ముందే ఉంటుంది మృగవని నేషనల్ పార్కు. 850 ఎకరాల మేరా విస్తరించి ఉన్న ఈ పార్కులో మనం జింకలను, నెమళ్లను దగ్గరిగా చూడవచ్చు. ఉదయం సమయం వెళ్తే మీకు ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం బాగా నచ్చుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఇది తెరిచే ఉంటుంది.
6. ఓషన్ పార్క్ | Ocean Park
గండిపేటకు వెళ్లడానికి ముందే మధ్యలో సీబీఐటీ కాలేజికి (CBIT College ) చేరువలో ఉంటుంది ఓషన్ పార్క్. ఇది నగర కేంద్రానికి 20 కీమీ దూరంలో ఉంటుంది. ఎక్స్‌పీరియం ఎకో పార్కుకు మరీ అంత దగ్గర్లో ఉండదు కానీ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
ఇక్కడ రకరకాల వాటర్ యాక్టివిటీస్‌ను సమ్మర్‌లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో, పిల్లలతో, స్పెషల్ పర్సన్‌తో కలిసి వెళ్లడానికి ఇది మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
7. గోల్కొండ | Golconda

ప్రపంచ వారసత్వ సంపదగా ( World Heritage Site ) గుర్తింపు తెచ్చుకున్న గోల్కొండ అనేది హైదరాబద్ నగరానికి ముందు నుంచే ఉంది. ఒక లెక్కన చెప్పాలంటే ఒక నగరం పుట్టడం నుంచి పెరగడాన్ని చూసిన కోట ఇది.
నిజానికి గోల్కొండ చూడ్డానికే మీకు టైమ్ సరిపోదు. మళ్లీ ఎక్స్‌పీరీయం వైపు వెళ్లడం అనేది ప్రాక్టికల్‌గా సాధ్యం అవ్వదు. కానీ నేను పాసిబిలిటీ గురించి కాదు ఆప్షన్స్ చెప్పాలి కాబట్టి గొల్కొండ పేరు ప్రస్తావిస్తున్నాను.
8. ఆరామైసమ్మ ఆలయం | Aramaisamma Temple
మర్చిపోవడానికి ముందే చెప్పేస్తాను. ఇక్కడ ఆదివారం చాలా క్రౌడ్ ఉంటుంది. అంటే వెళ్లొద్దు అనడం లేదు. ఈ రోజు పక్కాగా వెళ్లండి అని చెబుతున్నా.ఎందుకంటే ఈ రోజున ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించేవారు, నైైవేద్యాలు చెల్లించేవారు అధిక సంఖ్యలో వస్తుంటారు.
ఇది చిల్కూరుకు వెళ్లే దారిలో ఉంటుంది. చిల్కూరు బస్సు ఎక్కినా మీరు ఇక్కడికి వెళ్లగలరు. ఈ ఆలయాన్ని ఇండియన్ ఆర్మీ నిర్వహిస్తుంది.
9. అనంతగిరి | Ananthagiri Hills
Places Near Experium Eco Park : హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న చిన్నహిల్ స్టేషన్ ఇది. ఇక్కడ మీరు నేచర్‌తో మమేకం అవ్వవచ్చు. వర్షాకాలం, వింటర్లో ఇక్కడ సీన్ మామూలుగా ఉండదు. ఇక్కడికి వెళ్లే దారిలో మీకు లెక్కలేనన్ని నెమళ్లు కనిపిస్తాయి.
ఒక్కరోజు ముఖ్యమంత్రిలాగ ఒక్కరోజు లాంగ్ డ్రైవ్ కోసం మీరు ఇక్కడికి వెళ్లవచ్చు. అనంతగిరిలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ( Anantha Padmanabha Swamy Temple Ananthagiri Hills ) ఉంటుంది. మిగితా ఆలయాల కన్నా ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. నువ్వు నేను మూవీలోని కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేశారు.
10. రిసార్టులు | Resorts In Moinabad
ఎక్స్‌పీరియా పార్కులో కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు దగ్గర్లో ప్రగతి రిసార్టు వంటి అనేేక రిసార్టులు అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వెళ్లి మీరు ఎంజాయ్ చేయవచ్చు.
టూరిస్ట్ అవ్వండి ప్రయాణికుడు కాదు
నిజానికి ఎక్స్‌పీరియం ఎకో పార్కు వెళ్తే ( Place Near Experium Eco Park) అది తిరిగి రావడానికి మీకు 5-6 గంటలు పడుతుంది. తరువాత మీరు బయటికి వచ్చి ఏం చూడాలి ఎక్కడికి వెళ్లాలి అనిపిస్తే అప్పుడు ఈ లిస్టు ఒకసారి చెక్ చేయండి.
అయితే ఒక ప్రాంతానికి అది ఎక్స్‌పిరియం కానివ్వండి పబ్లిక్ గార్డెన్ కానివ్వండి అక్కడి వెళ్తే మనసు నిండిపోయే దాకా ఎంజాయ్ చేయండి. అంతేగానీ వచ్చాం కదా అని చెప్పి 30 నిమిషాలకో ప్లేసు చూసేద్దాం అన్నీ కవర్ చేద్దాం అనుకోకండి. మీరు ఎంజాయ్ చేయలేరు.
నేను ట్రావెల్ వ్లాగ్స్ ( Prayanikudu Youtube Channel ) అండ్ ఈ వెబ్‌సైట్ కోసం చాలా చోట్లకు వెళ్తుంటాను. వెళ్లినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు వీడియోలు, ఫోటోలు రికార్డు చేస్తూనే ఉంటాను. రెండు రోజుల తరువాత నేను నిజంగా అక్కడికి వెళ్లానా అంటే ఒక్క మెమోరీ ఉండదు. నాకు తప్పదు. మీరు అయినా ఈ హడావిడి నుంచి తప్పించుకోండి. ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో రోజు అన్వేషించండి. మీరు టూరిస్టుగా ఉండేందుకు నేను ప్రయాణికుడిని అయ్యాను.
సాధారణ ప్రశ్నలు వాటి సమాధానాలు | FAQ’s About Experium Eco Park

1 ఎక్స్‌పీరియం ఇకో పార్కు ఎక్కడుంది ? | Where is Experium Eco Park
- ఎక్స్‌పీరియం ఇకో పార్కు వచ్చేసి చిల్కూరు బాలాజీ ఆలయం దారిలో ప్రగతి రిసార్టు వెళ్లేదారిలో ప్రొద్దుటూరు గ్రామంలో ఉంది.
2. ఎక్స్‌పీరియం ఇకో పార్కు ఎలా వెళ్లాలి ? | How To Reach Experium Eco Park
- బస్సులో అయితే చిల్కూరు బాలాజీ ఆలయం బస్సు ఎక్కి తరువాత కండక్టర్‌ను అడిగితే వివరాలు చెబుతారు. లేదంటే ప్రగతీ రిసార్టు, ప్రొద్దుటూరు గ్రామం వైపు వెళ్లే బస్సు ఎక్కాలి. సొంత వాహనం అయితే గూగుల్ లొకేషన్ వాడి చిల్కూరు దారిలో వెళ్తే సరిపోతుంది.
3. ఎక్స్‌పీరియం ఇకో పార్కు టికెట్ ధర ఎంత ? | Ticket Cost Of Experium Eco Park
- టికెట్ ధర వచ్చేసి ఒక్క వ్యక్తికి రూ.1600 ఉంటుంది. ఆన్‌లైన్ బుకింగ్ ప్రస్తుతం అందుబాటులో లేదు. అక్కడికి వెళ్లి కౌంటర్లో టికెట్ తీసుకోవచ్చు.
4. ఎక్స్‌పీరియం ఇకో పార్కు టైమింగ్ | Timings Of Experium Eco Park
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 6 వరకు
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.