Ta.Ma.Sha Cafe : ఓకే కేఫ్‌లో అన్ని రకాల ఆసియా రుచులు..అదే త.మా.షా!
Ta.Ma.Sha Cafe : హైదరాబాద్ అంటే చార్మినార్‌తో పాటు ఇక్కడి బిర్యానీ గుర్తొస్తుంది, రైట్. దీంతో పాటు మనకు ఇక్కడ చైనీస్ నుంచి కొరియన్ వరకు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అందించే స్పెషల్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి.
అయితే చైనీస్ ఫుడ్ తీనేందుకు ఒక రెస్టారెంట్, కొరియన్ తినేందుకు మరో చోటికి వెళ్తుంటాం…కొన్ని రెస్టారెంట్స్‌లో ఆసియాకు సంబంధించిన కొన్నివెరైటీస్ (Asian Cuisine) మాత్రమే లభిస్తాయి. కానీ ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే రెస్టారెంట్ మరింత డిఫరెంట్‌గా ఉంటుంది. పేరు కూడా తమాషాగా ఉంటుంది. అదే తమాషా కేఫ్.

ఇది ఎక్కడ ఉంది ? Tamasha Cafe Location
హైదరాబాద్‌లో (Hyderabad Food) కొత్త ఫుడ్ వైబ్ కోసం చూసే వారికి తమాషా అనే ఏసియన్ వెజ్ కేఫ్ తెరుచుకుంది. సికింద్రాబాద్‌లోని గన్రాక్లో లాంచ్ అయిన ఈ రెస్టారెంట్ చాలా డిఫరెంట్. ఇక్కడ మొత్తం ఏషియన్ స్ట్రీట్ ఫుడ్ రుచులను రెట్రో థీమ్ కేఫేలో మీరు ఎంజాయ్ చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : Japanese Restaurant : హైదరాబాద్‌లోనే జపాన్ టేస్టీ ఫుడ్.. బేగంపేటలో ఆహారప్రియులను ఆకట్టుకుంటున్న కొత్త రెస్టారెంట్
అది కూడా ఓపెన్ ఎయిర్‌లో …చాలా యూనిక్ కాంబినేషన్ కదా ? ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కేవలం వెజిటేరియన్ డిషెస్ మాత్రమే లభిస్తాయి. కానీ రుచి మాత్రం నాన్‌వెజ్ రేంజిలో ఉంటాయి.
సియోల్ నుంచి బ్యాంకాక్ దాకా | Pan Asian Veg Dishes
తమాషా కేఫ్‌లో మెన్యూ చాలా జాగ్రత్తగా పక్కగా ప్రిపేర్ చేశారు. ఆసియాలోని వివిధ దేశాలకు చెందిన డిషెస్‌ను రుచి చూసేందుకు ఇక మీరు ఇతర దేశాలకు వెళ్లే అవసరం లేకుండా ఒక్కచోటే అందించనున్నారు.

వీటిని చూస్తే ఇన్‌స్టాలో వైరల్ అయ్యే ఐటమ్స్, సీజన్‌ను బట్టి సర్వ్ చేసే డ్రింక్స్, జైన్ స్టైల్ మెన్యూ ఇలా చాలా వెరైటీగా ప్లాన్ చేశారు.
- ఇది కూడా చదవండి : Hyderabad Food : హైదరాబాదులో అదిరిపోయే కొరియన్ రుచులు.. ఐటీసీ వద్ద రూ.200కే నోరూరించే స్ట్రీట్ ఫుడ్
ఇక వెరైటీస్ విషయానికి వస్తే | Menu
- కొరియన్ చిల్లి టోఫు | Korean Chilli Tofu : ఇది కాస్త స్పైసీగా, కాస్త స్వీట్ టచ్ ఉన్న డిష్. దీనిని ఫ్రెష్ సలాడ్స్‌తో సర్వ్ చేస్తారు.
- కొరియన్ పనీర్ | Korean Paneer : ఇండియన్ సిగ్నేచర్‌తో కొరియన్ ఫ్లేవర్ ఉన్న డిష్ ఇది. స్పైసీ కిక్ ఇచ్చే పెర్ఫెక్ట్ ఉమామీ బ్యాలెన్స్ ఉన్న వెరైటీ కాంబినేషన్ ఇది.
- గ్రీన్ థాయ్ కర్రీ విత్ రైస్ | Green Thai Curry With Rice : ఫుల్ వెజ్ ఫీల్ ఉన్న క్రీమీ, కంఫోర్టింగ్ కాంబినేషన్ ఇది.
- జపానీస్ కాటేజ్ ఛీజ్ కాసు | Japanese Cottage Cheese Katsu : జపానీస్ క్యూజన్ ఎంజాయ్ చేసేవారికి నాన్ వెజ్ కాసు రుచి గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అలాంటి ఫ్లేవరే వెజ్ట్విస్ట్తో అందిస్తున్నారు.

- కించి పీజా | Kimchi Pizza :పేరుకే పీజ్జా కానీ చాలా బోల్డ్ టేస్ట్‌తో ట్యాంగీ రుచులను అందించే కించి సిగ్నేచర్ పిజ్జా ఇది.
- రోజ్ కూలర్ అండ్ కుకుంబర్ ఫిజ్ : రిఫ్రెషింగ్ ఫీలింగ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూసే వారికి నెక్ట్స్ లెవెల్ రిలీఫ్ ఇస్తుంది ఈ డ్రింక్.
- ఐస్ క్రీమ్ బన్ శాండ్విచ్ అండ్ మ్యాంగో స్టికీ రైస్ : ఏం తిన్నాం ఎంత తిన్నాం అని కాదు లాస్ట్‌లో ఐస్ క్రీమ్ కడుపులో పడిందా లేదా అనేదే లెక్క అని మీరు ఫీల్ అయితే మీకు ఇది కరెక్ట్‌గా సరిపోతుంది.
- ఇక జైన్ ఫుడ్ కోసం ఒక సెపరేట్ సెక్షన్ ఏర్పాటు చేశారు. అందరికీ సూట్ అయ్యేలా చాలా థాట్ఫుల్గా డిజైన్ చేశారు.
- ఇది కూడా చదవండి : Haiking: 50 ఏళ్లకు పైగా హైదరాబాదీలకు చైనా టేస్టీ ఫుడ్ అందిస్తున్న హైకింగ్ రెస్టారెంట్ ఎక్కడుందో తెలుసా ?
ఓల్డ్ స్కూల్లో తాతాయ్య చిల్ ఫీలింగ్
ఈ కేఫ్‌లో అడుగుపెట్టగానే ఏదో డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది. ఎక్కడ చూసినా రెట్రో ఫీల్ ఇచ్చే ఎలిమెంట్స్ కనిపిస్తాయి.
- పాతకాలం నాటి వింటేజ్ టీవీలు
- గోడపై గిటారులు, పాతకాలం నాటి పుస్తకాలు షెల్ఫులు, కెమెరాలు
- బాంబూ లైట్స్, లైవ్ ఆకోస్టిక్ పెర్ఫార్మెన్స్ తోడు అవ్వడంతో మీరు బయటి ప్రపంచాన్నే మర్చిపోతారు మరి.
- ఎక్కడ చూసినా 80s, 90s లో ఉన్న ఫీల్ కలుగుతుంది.
ఓపెన్ ఎయిర్ సీటింగ్‌లో రిలాక్స్ అవుతూ మీరు మీ ఇన్స్టాగ్రామ్ వీడియోలు, ఫోటోలను తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి మీ పెట్స్‌ను కూడా తీసుకురావచ్చు. ఎవ్వరూ కాదనరు.
కపుల్స్ కలిసి సరదాగా హ్యాంగౌట్ అయ్యే సూపర్ ప్లేస్ ఇది. మీకు నచ్చింది తెచ్చి సదువుకోవచ్చు. రాస్తానంటే రాసుకోవచ్చు. మీ ఛానెల్‌కు కంటెంట్ తయారు చేస్తానంటే చేసుకోవచ్చు. మీ ఇష్టం సామీ. మీ ఇష్టం.
- ఇది కూడా చదవండి : Hyderabad Street Food : నోరూరించే స్ట్రీట్ ఫుడ్ కోసం చూస్తున్నారా? హైదరాబాద్‌లో ఈ 9 చోట్ల ట్రై చేయండి
తినీ తినీ బోర్ కొట్టింది అంటే పికిల్‌బాల్ కోర్టులో కాసేపు గేమ్ కూడా ఆడొచ్చు.
ఇక ఫౌండర్స్ మాటల్లో…
ఏకే సోలంకి, ఫౌండర్
తమాషా అనేది కేవలం ఒక కేఫ్ మాత్రమే కాదు. ఇది రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్, ఓల్డ్ స్కూల్ చార్మ్, సూపర్ వైబ్ ఉన్న ప్లేస్.
మహేందర్ వ్యాస్ , ఫౌండర్
సూపర్ టేస్టీ ఏసియన్ వెజ్ ఫుడ్, లైవ్ మ్యూజిక్‌తో పాటు ఈస్టెటిక్ ఫీలింగ్ కలిగించే రెట్రో థీమ్ ఇలా అన్నీ కలిపి ఒక్ సోల్‌ఫుల్ స్పేస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.