కంటెంట్ క్రియేటర్ల కోసం తెలంగాణ టూరిజం కాంటెస్ట్…గెలిస్తే రూ. 50 వేలు | 100 Weekend Wonders of Telangana
100 Weekend Wonders of Telangana : ఈ కాంటెస్టులో గెలిచిన వారికి రూ.50, 30, 20 వేలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఎం చేయాలి ? ఎలా అప్లై చేయాలి ? చివరి తేదీ వంటి పూర్తి వివరాలు…
కంటెంట్ క్రియేటర్లు, ఫోటోగ్రాఫర్లు, ప్రయాణికుల కోసం తెలంగాణ (Telangana) పర్యాటక శాఖ స్పెషల్ కాంటెస్ట్ ప్రకటించింది. ఈ కాంటెస్టులో గెలిచిన వారికి రూ.50 వేలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఎం చేయాలి ? ఎలా అప్లై చేయాలో ఈ పోస్టులో తెలుసుకుందాం.
- ఇది కూడా చదవండి : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో అతిథులకు రెండు కిట్స్..అందులో ఏమున్నాయో తెలుసా? | Telangana Rising 2025
ముఖ్యాంశాలు
తెలంగాణ రాష్ట్ర అసలు అందాలను, హిడెన్ బ్యూటీ, చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసేందుకు తెలంగాణ పర్యాటక శాఖ వినూత్నమైన క్యాంపెయిన్ ప్రకటిచింది. 100 Weekend Wonders of Telangana అనే ఈ కాంటెస్టులో భాగంగా ఫోటోగ్రాఫర్లు, కంటెంట్ క్రియేటర్లు, ప్రయాణికులు తెలంగాణ రాష్ట్ర పర్యాటకంపై కంటెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
- ఇది కూడా చదవండి : Uday Cafe: ఉదయ్ కేఫ్.. 63 ఏళ్లుగా కొత్త రుచుల మధ్య పాత రుచిని అందిస్తున్న అరుదైన రెస్టారెంట్!

ఈ కాంటెస్ట్ ఎందుకు ? | Importance Of The Contest
తెలంగాణలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇంకా తెలియని పర్యాటక ప్రదేశాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకువచ్చింది తెలంగాణ పర్యాటక శాఖ.
- ఇది కూడా చదవండి : Laknavaram : లక్నవరంలో మూడవ ద్వీపం..ఎలా ఉందో చూడండి
తెలంగాణలోని గ్రామాలు, వన్యప్రాంతాలు, జలపాతాలు, వారసత్వా కట్టడాలు, ఆలయాలు, చిన్నా పెద్ద వ్యూపాయింట్స్ వంటి ఎన్నో ఎన్నో ఇంకా పర్యాటక ప్రపంచానికి అంతగా పరిచయం కాలేదు. కంటెంట్ క్రియేటర్లు, ఫోటోగ్రాఫర్లను, ప్రయాణికుల సాయంతో వాటిని ప్రపంచం ముందుకు తీసుకువచ్చే వినూత్న ప్రయత్నమే ఇది.
ఎలా పంపాలి ? | How To Apply and What To Include
ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలి అనుకునే ఔత్సాహికులు తెలంగాణలో వీకెండ్ డెస్టినేషన్‌కు సంబంధించిన 3 ఫోటోలను, ఒక 60 సెకన్ల వీడియోతో పాటు 100 పదాల వివరణ ( Description) పంపించాలి.
ఈ డిస్క్రిప్షన్లో…
- ఆ ప్రాంతానికి చేరుకునేందుకు ఉన్న రవాణా మార్గాలు
- జిల్లా కేంద్రం లేదా ప్రధాన ప్రాంతాలు నగరాల నుంచి ఉన్న దూరం
- ఎగ్జాక్ట్ లొకేషన్‌ను గూగుల్ మ్యాప్‌లో ట్రాక్ చేసి దాని లింక్
- ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు బెస్ట్ సీజన్ లేదా సమయం ఏంటి…
- దగ్గరలో ఉన్న వసతి, హోటల్స్ వంటి వివరాలు
- బడ్జెట్ వంటి వివరాలు అందులో వివరించాల్సి ఉంటుంది.
- ఇది కూడా చదవండి : Ramappa Temple : రామప్ప ఆలయం గురించి తెలుగువారిగా తెలుసుకోవాల్సిన విషయాలు
అరే ఇది పక్కాగా మంచి టూరిస్ట్ స్పాట్ అయితది…
ఈ కాంటెస్ట్ అనేది ఒక ఫోటో లేదా వీడియో కాంటెస్ట్ కాదు. ఇది తెలంగాణలో ఒకట్రెండు రోజుల్లో చూసి వచ్చే వీలున్న వీకెండ్ పర్యాటక ప్రాంతాలు..ఏవైతే ఇంకా అంతా పాపులర్ కాలేదో…వాటిని ప్రపంచానికి పరచయం చేసే వేదిక.
ఈ కాంటెస్ట్ తరువాత వాటిని బయటి ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుంది. సో దీని లక్ష్యం ఏంటో మీకు అర్థం అయితే మీరు పుట్టి పెరిగిన ప్రాంతంలో అరే ఇది పక్కాగా మంచి టూరిస్ట్ స్పాట్ అయితది అనిపించే ప్రదేశం ఏదైనా ఉంటే ఈ కాంటెస్ట్ మీ కోసమే.
- ఇది కూడా చదవండి : Ramappa : రామప్ప ఆలయం వీకెండ్ ప్యాకేజీ తీసుకొచ్చిన తెలంగాణ టూరిజం శాఖ
ఆ ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశామన్న ఆనందంతో పాటు…కాంటెస్టులో గెలిచిన వారికి ఈ కింది బహుమతులతో సత్కరిస్తారు.
- ఫస్ట్ ప్రైజ్ : రూ.50,000 నగదు
- 2వ ప్రైజ్ : రూ.30,000 నగదు
- 3వ ప్రైజ్ : రూ.20,000 నగదు
ఒకవేళ టాప్ 3 లో చోటు లభించకపోతే…మరో 10 మందికి హరితా హోటల్స్‌లో (Haritha Hotels) 2 నైట్స్ 1 డే ఉచిత వసతి అందిస్తారు. ఛాన్సెస్ బాగున్నాయి. వస్తే రాజ్యం పోతే సైనికుడు అన్నట్టు ఒక ప్రయత్నం చేయండి.
ఎలా పంపాలి ? | How To Send Content
మీరు అనుకున్న ప్రాంతం గురించి ఫోటో, వీడియో తీసి, వివరణ రాసిన తరువాత దాని మీరు కింద ఉన్న ఫోటోలో కనిపించే క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అందులో ఉన్న లింకులో అప్లై చేయవచ్చు.

లేదంటే ఇన్స్టాగ్రామ్, ఎక్స్‌లో మీ వీడియోను, ఫోటోను అప్లోడ్ చేసి డిస్క్రిప్షన్ రాసి #100WeekendWonders #CaptureTheUnseen #HarithaHotels #TelanganaTourism అని ట్యాగ్ చేయండి.
గుర్తుంచుకోవాల్సిన తేదీలు | Important Dates
- పోటీ ప్రారంభ తేది : 2025 డిసెంబర్ 10
- ముగింపు తేది : 2026 జనవరి 5
- ఫలితాలు : సంక్రాంతి కైట్ ఫెస్టివల్ (kite Festival) సందర్భంగా ప్రకటిస్తారు.
మొత్తానికి, ఈ పోటీ అనేది తెలంగాణ పర్యాటక రంగానికి ఒక ఊతంగా, కంటెంట్ క్రియేటర్లకు ఒక అవకాశంగా చెప్పవచ్చు. అండ్ దీనిని ఒక కాంటెస్ట్‌లా మాత్రమే చూడకండి…బహుమతి విషయం అటుంచితే…తెలంగాణ ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసే అద్భుతమైన అవకాశంగా భావించండి. ఇంతకీ మీకు తెలిసిన ఆ హిడెన్ టూరిస్టు స్పాట్ ఏంటి ? కామెంట్ చేయండి,
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
