Tirumala Weekend Rush Guide: SSD టోకెన్లు అయిపోతే ఏం చేయాలి?
Tirumala Weekend Rush Guide లో SSD Tokens అయిపోతే ఏం చేయాలి ? దివ్య దర్శనం ఆప్షన్స్, శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్స్ అప్డేట్స్ మీ కోసం
డిసెంబర్ చివరి వారం వస్తే చాలు తిరుమల యాత్ర అనేది ఆటోమేటిక్‌గా ఓపికకు పరీక్ష పెడుతుంది. క్రిస్మస్ హాలిడేస్, వీకెండ్ కలిసి అలిపిరి భూదేవీ కాంప్లెక్స్ దగ్గర ఉదయమే దర్శన టోకెన్ క్యూస్ నిండిపోతున్నాయి. ఈ సమయంలో తిరుమలికి వెళ్లే భక్తులు ఒకటి గుర్తుంచుకోవాలి. రష్ను చూడటం కాదు, సిస్టమ్ (Darshan System)ను అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్.
- ఇది కూడా చదవండి : తిరుమలలో దర్శనాలు ఎన్ని రకాలు ? ఏ టికెట్లు బుక్ చేసుకుంటే దర్శనం వేగంగా అవుతుంది | Tirumala Darshan Guide
ముఖ్యాంశాలు
వీకెండ్ రష్లో ఏం జరుగుతోంది? (What Is Happening During Weekend Rush)
ప్రస్తుతం తిరుమలలో పరిస్థితి ఇలా ఉంది. ఉదయం ఓపెనింగ్ టైమ్‌లోనే SSD (Slotted Sarva Darshan) టోకెన్లు వేగంగా అయిపోతున్నాయి. SSD దొరకకపోతే చాలా మంది భక్తులు దివ్యదర్శనం (Divya Darshan – Alipiri Footpath) ని ప్రత్యామ్నాయంగా చేసుకుంటున్నారు.
రష్ పెరిగిన సమయంలో TTD Police, Security సిబ్బంది క్యూ లైన్లను డిసిప్లిన్‌తో మేనేజ్ చేస్తున్నారు. అందుకే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ లాస్ట్ మినిట్ ప్లాన్ చేసి వస్తే వెయిటింగ్ టైమ్ ఎక్కువ ఉండవచ్చు.
- ఇది కూడా చదవండి : వాట్సాప్‌లో టీటీడీ సేవల ఫిర్యాదు…క్యూఆర్ కోడ్ లాంచ్ చేసిన దేవస్థానం | TTD WhatsApp Feedback
శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్స్ గురించి .. (Updates on Srivani Offline Tickets)
తిరుమలలో ఉన్న భారీ రద్దిని గమనించి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో అంటే శని, ఆది, సోమ వారాల్లో ఈ మార్పులను చేసింది. శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లు ఇష్యూ చేయడం లేదు. తిరుమల శ్రీవాణి టికెట్ కౌంటర్లో కూడా జారీ చేయడం లేదు. తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ (Renigunta Airport) లో కూడా టికెట్లు జారీ చేయడం లేదు. ఈ తేదీల్లో ఆఫ్‌లైన్ శ్రీవాణి దర్శనం టికెట్లపై ఆధారపడి తిరుమలకి వస్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. అందుకే ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
సో ఇప్పుడు ఎలా ప్లాన్ చేయాలి? (How to Plan Tirumala Yatra Now)
మీరు SSD Tokens కోసం వస్తే మాత్రం చాలా అర్లీగా (Early Arrival) చేరుకోవాల్సి ఉంటుంది. వీకెండ్లో SSD టోకెన్లు లిమిటెడ్‌గా ఉంటాయి కాబట్టి బ్యాకప్ ఆప్షన్ (Backup Darshan Option) మైండ్‌లో పెట్టుకోవాలి.
SSD దొరకకపోతే ఏం చేయాలి? (If SSD Tokens Are Not Available)
ఒకవేళ మీకు SSD టోకెన్లు లభించకపోతే Divya Darshan ఆప్షన్ ఉంది. కానీ వెయిటింగ్ టైమ్ ఎక్కువ ఉండొచ్చు. అందుకే మీతో పాటు నీరు , ఆహారం తీసుకెళ్లడంతో పాటు కొంచెం ఎక్స్ట్రా ఓపిక కూడా అవసరం.
- ఇది కూడా చదవండి : తిరుమలలో రీల్స్ చేస్తున్నారా ? అయితే ఇది చదవండి!
శ్రీవాణి దర్శనం ప్లాన్ చేస్తున్నారా? (Planning Srivani Darshan)
మీరు డిసెంబర్ 27 నుంచి 29 వరకు ఆఫ్‌లైన్ టికెట్లు అందుబాటులో లేవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్ (Online Booking) ఉంటే ఓకే. లేదంటే వేరే దర్శనం ఆప్షన్ ప్లాన్ చేయాలి.
కుటుంబంతో, పెద్దలతో వస్తున్నారా? (Traveling With Family or Elders)
ప్రస్తుతం వీకెండ్స్, హాలిడేస్ అవడంతో తిరుమలలో అన్ని దర్శనాలకు రద్దీ ఉంటుంది. అందుకే మీరు వీక్ డేస్ (Weekdays) అంటే మంగళ, బుధ, గురు వారాల్లో ప్లాన్ చేసుకోవడం మంచిది. అయితే ఇయర్ ఎండింగ్ మరియు వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadasi) సందర్భంగా రష్ ఉంటుంది. అలాగే డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darshan) టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకోగలరు. అందుకే కొంచెం ఆలోచించి ప్లాన్ చేసుకోండి.
ఇయర్ ఎండింగ్ నుంచి సంక్రాంతి వరకు దర్శనం గురించి తెలుసుకోవాలి అంటే ఈ పోస్టు మీకు ఉపయోగపడుతుంది.
- ఇది కూడా చదవండి : టోకెన్ లేకపోతే అనుమతి లేదా? టీటీడీ చైర్మన్ క్లారిటీ! TTD Vaikuntha Dwara Darshan 2026
గుర్తుంచుకోండి (Important Tips for Pilgrims)
తిరుమలకు వెళ్లే ముందు భక్తులు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. తిరుమలలో రష్ అనేది కొత్త కాదు. కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్లడం అనవసరమైన ఒత్తిడికి కారణం అవుతుంది. సింగిల్ దర్శనం ఆప్షన్ తో మాత్రమే వెళ్లకండి. రూల్స్ (Rules), అవైలబిలిటీ (Availability) ముందుగానే తెలుసుకోండి. మీ టైమ్, ఆరోగ్యం, ఓపిక లెక్కలోకి తీసుకుని ప్లాన్ చేయండి.
Prayanikudu లక్ష్యం ఏంటంటే | Tirumala Weekend Rush Guide
భక్తులు తిరుమలకి వెళ్లడానికి ముందు క్లియర్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకునే సమాచారం, ఆలోచించేందుకు సరిపడా నాలెడ్జ్ అందించడం. తరువాత మీ నిర్ణయం మీ ఇష్టం. ఈ గైడ్‌ని ఫాలో అయితే మీ Tirumala Yatra కన్ఫ్యూజన్ లేకుండా ప్రశాంతంగా పూర్తి అవుతుంది.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
