సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చిన శ్రీ కోదండరామ స్వామి | Surya Prabha Vahanam
తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు 2025 ఏప్రిల్ 2వ తేది బుధవారం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ (Surya Prabha Vahanam) జరిగింది. ఉదయం 8 గంటలకు స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
