Sowbhagyam : వరలక్ష్మి వ్రతం సందర్భంగా టీటీడీ ఆలయాల్లో ‘సౌభాగ్యం’ కార్యక్రమం
Sowbhagyam : వరలక్ష్మి వత్రం సందర్భంగా ఆగస్టు 8వ తేదీన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున ఆలయానికి తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టిటిడి.
వరలక్ష్మి (Varalakshmi Vratam 2025) సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి సరఫరా, అన్న ప్రసాదం వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయ ప్రాంగణం అందంగా, శోభాయమానంగా కనిపించే విధంగా విద్యుద్దీపాలతో, పువ్వులతో అలంకరిస్తున్నారు.
- ఇది కూడా చదవండి : వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఏఏ వంటలు చేయాలి ? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలు ఏవి ?
తిరుచానూరులో వరలక్ష్మి వ్రతం సందర్భంగా జరిగే కార్యక్రమాలు

2025 ఆగస్టు 8వ తేదీన తిరుచానూరులోని (Tiruchanoor Temple ) అమ్మవారి ఆలయంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య ఆస్థాన మండపంలో వ్రతం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమాన్ని సులభంగా వీక్షించేందుకు భక్తుల కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆలయానికి వెళ్లడం సాధ్యం కాకపోయినా, లేదా ఇంట్లోంచే వరలక్ష్మి వ్రతాన్ని చూడాలి అనుకుంటే SVBC ఛానెల్ ద్వారా లైవ్లో చూడవచ్చు.

ఆగస్టు 8వ తేదీన సాయంత్రం సమయంలో అమ్మవారు స్వర్ణ రథంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
టిటిడి ఆలయాల్లో సౌభాగ్యం | TTD Sowbhagyam
అమ్మవారి అనుగ్రహం మహిళా భక్తులకు అందే విధంగా ప్రత్యేకంగా సౌభాగ్యం అనే కార్యక్రమం ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం.

ఈ కార్యక్రమాన్ని తిరుచానూరు ఆలయంతోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని 51 టిటిడి (TTD) స్థానిక ఆలయాల్లో కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో…
- మహిళా భక్తులకు అక్షింతలు, పసుపు దారాలు…
- కుంకుమ, కంకణాలు, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి పుస్తకం
- గాజులు వంటి పవిత్ర సామగ్రిని అందించనున్నారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.