తెప్పోత్సవం: 2వ రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి వారిని దర్శించుకున్న భక్తులు | Tirumala Teppotsavam 2025

షేర్ చేయండి

తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు (Tirumala Teppotsavam 2025) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2025 మార్చి 9వ తేదీన తెప్పోత్సవాలు ప్రారంభం అయ్యాయి.  2వ రోజు మార్చి 10వ తేదీన రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తూ ఆశీస్సులు అందించారు.

1. రెండవ రోజు

Tirumala Teppotsavam 2025
తెప్పోత్సవం సమయంలో పుష్కరిణి వైభవం

తెప్పోత్సవంలో భాగంగా రెండవ రోజు అమ్మవారిని, స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణి (Tirumala Pushkarini) వద్దకు తీసుకువచ్చారు.

2. మంత్ర ముగ్ధులైన భక్తులు

Tirumala Teppotsavam 2025
విద్యుత్ దీపాల అలంకరణలో స్వామివారి వైభవం

స్వామివారి తెప్పోత్సవం (Teppostavam) కోసం ఏర్పాటు చేసిన తెప్ప అలంకరణ, విద్యుత్ దీపాల వెలుగు, పుష్కరిణిలో కనిపిస్తున్న ప్రతిబింబం చూసి భక్తులు తరించిపోయారు.

3. మూడు సార్లు

ఇలా రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామివారు ఆశీసునులైన తెప్ప పుష్కరిణిలో మూడు సార్లు విహరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించింది.

4. మార్చి 13 వరకు | Tirumala Teppotsavam 2025

Tirumala Teppotsavam 2025

2025 మార్చి 9వ తేదీన ప్రారంభమైన తెప్పోత్సవాలు మార్చి 13 వరకు కొనసాగనున్నాయి.

5. మూడవ రోజు విశేషాలు

Tirumala Teppotsavam 2025

ఇక మూడవ రోజు అంటే మార్చి 11వ తేదీన మంగళవారం శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామి (Sri Malayappa Swamy) వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

6. తెప్పోత్సవం విశిష్టత

Tirumala Teppotsavam 2025

తెప్పోత్సవం (TTD Teppostavam History) అనేది ప్రతీ సంవత్సరం జరిగే ప్రధాన ఉత్సవాలలో ఒకటి. ప్రతీ ఏడాది ఫాల్గుణమాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు.

7. చైత్ర మాసంలో

Tirumala Teppotsavam 2025

తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాదికి (Ugadi 2025) స్వాగతం చెబుతున్నట్టుగా చైత్ర మాసంలో ప్రతీ ఏడాది తెప్పోత్సవం జరుగుతుంది.

8. మొదటి మూడు రోజుల్లో…

Tirumala Teppotsavam 2025

తెప్సోత్సవంలో భాగంగా మొదటి రోజు సీతాసమేత రామ లక్ష్మణుడిగా, రెండవ రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామిగా, మూడవ రోజు శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులను కటాక్షిస్తారు.

9 శతాబ్ధాలుగా…

1468 లో సాళువ నరసింహా రాయలవారి కాలంలో ఈ తెప్పోత్సవాలు (Tirumala Teppotsavam 2025) ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతోంది. పుష్కరిణి మధ్యలో నీరాళి మండపం ఆయనే నిర్మించారని తెలుస్తోంది. 

10. అన్నమయ్య సమయంలో

Tirumala Teppotsavam 2025

శ్రీవేంకటేశ్వరస్వామి వారి గురించి కీర్తిస్తూ ఎన్నో కీర్తనలు రాసిన తాళ్లపాక అన్నమాచార్యుల (Annamacharya) వారు ఈ ఉత్సవం ఘనతను కూడా కీర్తించారు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!