Sampoorna Ramayanam: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం…ఆకట్టుకున్న సంపూర్ణ రామాయణం సెట్టింగ్

షేర్ చేయండి

తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ రామాయణం (Sampoorna Ramayanam) సెట్టింగ్‌ భక్తులను విశేషంగా ఆకట్టకుంటోంది.

సంపూర్ణ రామాయణం ఘట్టాలు | Sampoorna Ramayanam

Sampoorna Ramayana Pradarshana (5)
కోదండ రాముడు

రామాయణంలోని (Ramayanam) కొన్ని ప్రధాన ఘట్టాలను ఆకట్టుకునే విధంగా, పిల్లలకు కూడా సులభంగా అర్థం అయ్యేలా ఏర్పాటు చేశారు.

Sampoorna Ramayana Pradarshana (4)

శ్రీరాముడు (Lord Sri Rama), లక్ష్మణుడు, భరతుడు, శత్రఘ్నులను ఊయలలో నిద్రపుచ్చుతున్న దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి.

Sampoorna Ramayanam
శ్రీరామ పట్టాభిషేకం

ఈ ప్రదర్శనలో విశ్వామిత్ర మహర్షి చేపట్టిన యఙ్ఞాన్ని పరిరక్షించడంలో భాగంగా మారీచుడిని, సుభాహును సంహరిస్తున్న శ్రీ రామ లక్ష్మణుల ప్రతిమలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు శ్రీరాముడి పట్టాభిషేకం (Sri Rama Pattabhishekam) సన్నివేశాన్ని తలపించే ప్రతిమను కూడా ఏర్పాటు చేశారు.

Sampoorna Ramayanam
రావన సంహారం

సీతమ్మను రావణుడు (Ravana) అపహరిస్తున్న సన్నివేశంతో పాటు దశకంఠుడుని శ్రీరాముడు సంహరిస్తున్న ప్రతిమను కూడా ఏర్పాటు చేశారు.

Sampoorna Ramayana Pradarshana (5)
గుహనావికుడితో శ్రీసీతా సేమత రామచంద్రుడు

లంకకు వారధి (Ram Sethu) కడుతున్న వానరసైన్యం, శూర్పనఖ ముక్కును, చెవులను కోస్తున్న లక్ష్మణుడు, గుహా అనే నావికుడు సీతాసమేత రామలక్ష్మణులను బోటులో నదిని దాటిస్తున్న సన్నివేశాలను కూడా భక్తులు వీక్షించారు.

Sampoorna Ramayana Pradarshana (6)
సంపూర్ణ రామయణ ఘట్టాలను వీక్షిస్తున్న సందర్శకులు

బ్రహ్మోత్సవాల్లో (Vontimitta Brahmhostavam) భాగంగా ఏర్పాటు చేసిన ఈ సంపూర్ణ రామాయణంలోని ప్రధాన ఘట్టాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వీక్షించారు. చిన్న పిల్లలు కూడా సులభంగా అర్థం అయ్యేలా ఉన్న ఈ ప్రతిమలను శ్రీరాముడి వైభవం, రామాయణ విశిష్టతను చక్కగా అర్థం అయ్యేలా ఏర్పాటు చేశారు.

ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు | Vontimitta Brahmostavam

Vontimitta Brahmhostavalu Dwajarohanam
ప్రారంభమైన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో (Sri Kodanda Rama Swamy Temple) 2025 ఏప్రిల్ 6వ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య ఆగమశాస్త్రం (Agama Shastra) ప్రకారం ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు.

Vontimitta Talambralu
తలంబ్రాల తయారీ

2025 ఏప్రిల్ 11వ తేదీన శ్రీసీతారాముల కల్యాణం (Sri Sitaram Kalyanam) జరగనుంది. దీని కోసం తలంబ్రాల తయారీ శాస్త్రోక్తంగా ప్రారంభం అయింది.

నిరంతరాయ అన్నప్రసాదం

Anna Prasadam At Vontimitta
అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు

బ్రహ్మెత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన భక్తులకు నిరంతరాయగా అన్నప్రసాదాలను టిటిడి అందిస్తోంది. 

Sri Rama Navami At Vontimitta Lord Kodanda Rama Temple
భక్తులకు వడపప్పు, పానకం అందించారు

శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఆలయ ప్రాంగణలంలో వడపప్పు, పానకాన్ని పంపిణి చేశారు.

PEDDA SESHA VAHANAM 03
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేష వాహనంపై స్వామివారు.

రాత్రి 7 గంటలకు శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజున శేష వాహనంపై, భజన బృందాల కోలాటాల నడమ శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడికి ఆలయ పురవీధుల్లో వాహాన సేవ నిర్వహించారు.

HANUMANTHA VAHANAM3
హనుమాన్ వాహన సేవ

అనంతరం శ్రీ కోదండరామ స్వామిని హనుమాన్ వాహన సేవ నిర్శహించారు. స్వామి వారిని దర్శించుకుని దరించిన భక్తులు

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!