Charlapalli to Dharmavaram : చర్లపల్లి నుంచి ధర్మవరంకు 14 స్పెషల్ ట్రైన్లు
Charlapalli to Dharmavaram : చర్లపల్లి నుంచి ధర్మవర్మం వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఈ రూట్లో వెళ్లే ప్రయాణికుల కోసం కొత్త రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railways) ప్రకటిచింది. ప్రయాణికులు రద్దీని గమనించి 14 స్పెషల్ ట్రైన్ సర్వీను నడపనున్నట్టు తెలిపింది.
ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు | Charlapalli to Dharmavaram spl Trains
ప్రయాణికుల కోసం మొత్తం రెండు రైళ్లను 14 ట్రిప్పులు తిప్పనున్నారు. ఈ రెండు రైళ్లు వచ్చేసి..
- 07003: Charlapalli to Dharmavaram : ఈ ట్రైను చర్లపల్లి నుంచి ధర్మవరం వెళ్తుంది.
- 2025 జూలై 13వ తేదీ నుంచి ఆగస్టు 24 వరకు కూడా ప్రతి ఆదివారం ఈ ట్రైను నడవనుంది.
- ఇక రెండవ ట్రైన్ వచ్చేసి 07004 : Dharmavaram to Charlapalli : ఈ ట్రైన్ ధర్మవరం నుంచి చర్లపల్లి మధ్య నడుస్తుంది.
- 2025 జూలై 14వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు కూడా ప్రయాణికులు ప్రతీ సోమవారం ఈ ట్రైన్ సర్వీసులను వినియోగించుకోవచ్చు.
- ఇందులో ఒక్కో ట్రైన్ నిర్ణీత కాల వ్యవధిలో, కేటాయించి తేదీలు, రోజుల ప్రకారం మొత్తం 7 ట్రిప్పులు తిరుగుతాయి
కోచుల విషయానికి వస్తే ఫస్ట్ ఏసి , సెకండ్ ఏసి, త్రీ టైర్ ఏసి, టూ టైర్ ఏసి, స్లీపర్ క్లాస్, జెనరల్ క్లాస్ కోచుల్లో ప్రయాణించవచ్చు ఉంటాయి.
ఇక మీ ప్రయాణం సాఫీగా సాగాలి అనుకుంటే మీరు ముందస్తుగా టికెట్లు రిజర్వ్ చేసుకునేలా చూసుకోండి. మీరు కింద తెలిపిన స్టేషన్లలో ఎక్కడి నుంచి అయినా ట్రైన్ క్యాచ్ చేయవచ్చు. లేదా తిరిగి వచ్చే సమయంలో దిగవచ్చు.
ఆ స్టేషన్లు | Charlapalli to Dharmavaram Stops
చర్లపల్లి నుంచి ధర్మవరం వెళ్లే దారిలో…
మీరు నల్గొండ, మిర్యాలగూడ, నదికుడె, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు. గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, పాకాలా, పీలేరు, కలికిరి, మదనపల్లె కదిరి రైల్వే స్టేష్లలో ట్రైన్ ఎక్కవచ్చు.
ఇక ధర్మవరం నుంచి చర్లపల్లి వచ్చే దారిలో పైన వివరించిన స్టేషన్లలోనూ ఆగుతుంది. మదనపల్లె నుంచి నల్గొండ వరకు మీరు ఎక్కడైన ట్రైన్ దిగవచ్చు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.