తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో అతిథులకు రెండు కిట్స్..అందులో ఏమున్నాయో తెలుసా? | Telangana Rising 2025
Telangana Rising 2025 సమ్మిట్‌కు వచ్చిన గెస్టులకు జీవితాంతంగా గుర్తుండేలా తెలంగాణ ఆత్మీయతకు చిహ్నంగా రెేండు ప్రత్యేక సువెనీర్ కిట్స్ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 (Telangana Rising Global Summit 2025). హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఈ సమ్మిట్‌లో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TTDC) అతిథుల కోసం ప్రత్యేక సువెనీర్ కిట్, కలినరీ కిట్ అందజేస్తోంది.
ముఖ్యాంశాలు
తెలంగాణ ఆత్మీయతను పరిచయం చేసే విధంగా
అతిథులు తమతో పాటు మెమోరీగా ఈ గిఫ్ట్ కిట్లను తీసుకెళ్తారు. తెలంగాణ రుచులను పరిచయం చేసే Culinary Kit ద్వారా తెలంగాణ ఆత్మీయతను అనుభూతి చెందుతారు.
- ఇది కూడా చదవండి : మనాలిలో చేయాల్సిన 30 పనులు | 30 Activities in Manali | With Photos
- ఇది కూడా చదవండి : Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?
ఈ కిట్లు అందుకున్న అతిథులు వస్తువులను గమనించి, వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే ప్రతి ఉత్పత్తిలో తెలంగాణ సంస్కృతి (Telangana Culture) సంప్రదాయం ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వారి కోసం ఇన్ఫర్మేషన్ కార్డులు కూడా అందించబడ్డాయి, తద్వారా అతిథులు వాటి ప్రాముఖ్యతను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇతరులతో వాటి గురించి చర్చించే అవకాశం కూడా ఉంటుంది.
సువెనీర్ కిట్: Telangana Heritage Showcase
తెలంగాణ చేనేతల (Handlooms) నైపుణ్యాన్ని ప్రతిబింబించే కళాఖండాలతో ఈ సువెనీర్ కిట్ రూపొందించారు.

కిట్‌లో ఉన్న ఉత్పత్తులు:
- ఇకత్ స్టోల్ – పోచంపల్లి సంప్రదాయాన్ని ప్రతిబింబించే వస్త్రం
- పెర్ల్ ఈరింగ్స్ – ముత్యాల నగరమైన హైదరాబాద్ ఘనతను చూపే చెవి రింగులను కానుకగా అందించారు. పర్ల్ సిటీ గురించి ఇక చెవులకున్న ముత్యాలే ప్రమోట్ చేస్తాయి.
- లాక్ చుడీలు – తెలంగాణ సంప్రదాయ లాక్ కళతో రూపొందించిన రంగురంగుల చుడీల
- హైదరాబాద్ అత్తర్ – హైదారాబాద్ ఆత్మీయతకు సువాసనను జోడిస్తే అదే అత్తర్ .
- చేరియల్ ఫ్రిజ్ మాగ్నెట్ – ప్రసిద్ధ చేరియల్ స్క్రోల్ పెయింటింగ్ కళకు గౌరవార్థం
ప్రతి వస్తువు తెలంగాణ సాంస్కృతిక (Telangana Culture) ఔన్నత్యాన్ని ప్రపంచానికి చూపిస్తుంది.
ఇది కూడా చదవండి : ఏపీ, తెలంగాణలో అతి పెద్ద మామిడిపండ్ల మార్కెట్లు ఏవో తెలుసా? | Mango Markets In Telugu States
- ఇది కూడా చదవండి : Borra Caves: బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డాయో తెలుసా ? 12 ఆసక్తికరమైన విషయాలు
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
పలు రుచులతో కలినరీ కిట్ | Telangana Food
తెలంగాణ ఇంటి వంటల రుచిని, ఆత్మీయతను తెలియజేసే పదార్థాలు ఈ Culinary Kit లో ఉన్నాయి:

- అప్పాలు (Appalu)
- సక్కినాలు (Sakinalu)
- మహువా లడ్డూ (Mahua Laddu)
- నువ్వుల లడ్డూ (Til Laddu)
- బదాం కి జాలి (Badam Ki Jali)
- మక్క పెళాలు (Murmura)
ప్రతి వంటకం తెలంగాణ ఇంటి రుచిని ప్రతిబింబిస్తుంది. అతిథులు మళ్లీ మళ్లీ రుచి చూడడానికి ఇష్టపడేలా చేస్తుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
