హైదరాబాద్ ఎగ్జిబిషన్ సిద్ధం, మరి మీరు? | Numaish 2026 Complete Guide
Numaish 2026 Complete Guide : హైదారాబాద్ చలికాలం అంటే చార్మినార్, ఛాయ్ ఎలాగో నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా అలాంటిదే. దీనినే నుమాయిష్ (Numaish Hyderabad) అని కూడా అంటారు. షాపింగ్, ఫుడ్, సరదా రైడ్స్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఒక ప్లేస్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. అది నుమాయిష్‌లోనే సాధ్యం.
Numaish 2026 Complete Guide : హైదారాబాద్ చలికాలం అంటే చార్మినార్, ఛాయ్ ఎలాగో నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా అలాంటిదే. దీనినే నుమాయిష్ (Numaish Hyderabad) అని కూడా అంటారు. షాపింగ్, ఫుడ్, సరదా రైడ్స్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఒక ప్లేస్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. అది నుమాయిష్‌లోనే సాధ్యం.
ముఖ్యాంశాలు
హైలైట్స్ | Numaish 2026 Highlights
భారత దేశంలో అతిపెద్ద, అత్యంత ఎక్కువ కాలం నుంచి నడుస్తున్న ఆల్ ఇండియా ఎగ్జిబిషన్
(All India Industrial Exhibition 2026 – AIIE) హైలైట్స్ ఈ పోస్టులో.
హైదరాబాద్ ఎగ్జిబిషన్ అనేది ప్రతీ సంవత్సరం రీఫ్రెష్ అయ్యే మెమరీ లాంటిది. చిన్నప్పటి నుంచి హైదరాబాద్ ప్రజల జీవితంలో ఇది ఒక భాగంగా మారింది.
ఈసారి 85వ ఎడిషన్‌లో కూడా ప్రతీ సంవత్సరంలాగే 45 రోజుల పాటు ఈ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వర్తకులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.
- ఇదీ చదవండి : బ్యాగులు మోసేవాడు పురుషుడు సుమతి : నుమాయిష్‌లో బ్యాగులు మోసే భర్తల రీల్ వైరల్ | Men At Numaish
తేదీలు | Numaish 2026 Dates, Venue & Timings
హైదరాబాద్ ఎగ్జిబిషన్, నుమాయిష్ మీరు ఎలా పిలుచుకున్నా… ఇది జరిగేది మాత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనే
(Nampally Exhibition Grounds Hyderabad)
Dates : 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఇది జరుగుతుంది.
Timings : విషయానికి వస్తే సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు తెరిచి ఉంటుంది. శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. బాగా రష్ ఉన్నప్పుడు, పబ్లిక్ హాలిడేస్‌లో సమయం పొడగించే అవకాశం ఉంటుంది.
ఎంట్రీ ఫీజు & పార్కింగ్ | Numaish 2026 Entry Fee, Tickets & Parking
నుమాయిష్ ఎంట్రీ ఫీజు
👉 పెద్దలకు రూ.50
👉 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితం
Ticket Booking:
నుమాయిష్ ఎంట్రీ గేట్ల దగ్గరే టికెట్లు లభిస్తాయి.
అనేక ఎంట్రీ గేట్లు ఉండటంతో మీకు వీలైన గేటు నుంచి లోపలికి వెళ్లవచ్చు.
అయితే Ajanta Gate అనేది పాపులర్ ఎంట్రీ పాయింట్.
క్రౌడ్ కంట్రోల్ కోసం సెపరేట్ ఎంట్రీ & ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేశారు.
Parking:
ఎగ్జిబిషన్ గ్రౌండ్ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో పార్కింగ్ ఏరియాలు ఉన్నాయి.
వీకెండ్స్, పండగలు, సెలవు రోజులలో పార్కింగ్ వేగంగా ఫిల్ అవుతుంది.
అందుకే మీరు సాయంత్రం 4 గంటల లోపు అక్కడ చేరుకుంటే బెటర్.
సెక్యూరిటీ | Security & Crowd Management
సందర్శకుల సేఫ్టీ కోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
- పోలీసు సిబ్బంది
- CCTV కెమెరాల ఏర్పాటు
- ఆగ్నిమాపక దళం (Fire Safety Teams)
- డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్
GHMC, విద్యుత్ శాఖ, RTC, Metro కోఆర్డినేషన్ కేంద్రాలు కూడా ఉంటాయి.
నుమాయిష్ స్టాల్స్ | Numaish 2026 Stalls & Shopping Experience
నుమాయిష్‌లో ఈసారి 2200 నుంచి 2500 స్టాల్స్ ఉంటాయని కొన్ని వార్తల్లో ప్రచారం జరిగింది.
కానీ ఆధికారిక సమాచారం ప్రకారం 1000 నుంచి 1100 స్టాల్స్ మధ్యలోనే ఉంటాయి.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ నుంచి 245 కిమీ దూరంలో తెలంగాణలో ఒక జైపూర్ | Jaipur In Telangana Travel Guide 2025
ఇక్కడి వర్తకులు, కళాకారులు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. రాజస్థాన్, UP, బీహార్, హరియాణా, J&K, MP వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రేడర్స్ తమ స్టాక్స్ హైదరాబాదీల ముందు ఉంచుతారు.
దీంతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల స్టాల్స్ కూడా ఉంటాయి.
తెలంగాణ రాష్ట్ర జైలు శాఖ ఏర్పాటు చేసే ఒక ప్రత్యేక స్టాల్ కూడా ఉంటుంది.
ఏం కొనొచ్చు? | What Can You Shop at Numaish

ఎగ్జిబిషన్లో కొనడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. విండో షాపింగ్‌కే అయినా సరే ఇది ఒక ట్రీట్.
- హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కార్పెట్లు, షాలువలు
- డ్రై ఫ్రూట్స్, మసాలాలు, క్రాకరీ, కిచెన్ సామాన్లు
- రెడీమేడ్ దుస్తులు, చెప్పులు, ఫ్యాషన్ ఐటమ్స్
- ఎలక్ట్రానిక్ పరికరాలు, చిన్న హోమ్ గాడ్జెట్స్
- ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తులు
మాల్స్‌లో దొరకని, బేగంబజార్‌లో కనిపించని వెరైటీ వస్తువులను బేరమాడి కొనగలిగే అవకాశం ఉండడమే నుమాయిష్ ప్రత్యేకత.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ మొత్తాన్ని 2 రోజుల్లో పూర్తి చేయగలమా? – No | 2-Day Hyderabad Practical Tour
ఫుడ్ కోర్టులు | Food Courts, Rides & Entertainment
షాపింగ్ మాత్రమే కాదు, ఫుడ్ లవర్స్‌కు ఇది అసలైన పండగ
(Food at Numaish 2026)
- బిర్యానీ
- కబాబ్స్
- హలీమ్
- చాట్స్
- స్వీట్స్
- ఇరానీ ఛాయ్, బన్ మస్కా
ఇవే కాకుండా వివిధ రాష్ట్రాల ఫుడ్ రెసిపీస్ కూడా ఎంజాయ్ చేయవచ్చు. స్ట్రీట్ ఫుడ్ స్టైల్ స్టాల్స్‌లో వెరైటీ ఐటమ్స్ టేస్ట్ చేయొచ్చు. సాయంత్రం 6 నుంచి 9 మధ్య ఫుడ్ జోన్లలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా వీకెండ్స్‌లో ఇంకా ఎక్కువ.
- ఇది కూడా చదవండి : Hyderabad లో తప్పకుండా వెళ్లాల్సిన Top 7 Best Family Parks – Entry Fee, Timings & Complete Guide
కిడ్ జోన్ | Joy Rides & Kids Zone
నుమాయిష్‌లో
మహిళలు షాపింగ్ చేస్తారు,
పురుషులు బ్యాగులు మోస్తారు,
పిల్లలు ఆడుకుంటారు –
ఇది ఒకసారి వెళ్తే మీరే గమనిస్తారు.
పిల్లల కోసం ప్రత్యేక Amusement Zone ఉంటుంది.
- ఫెరీస్ వీల్
- కారౌసెల్
- థ్రిల్ రైడ్స్
- గేమ్ స్టాల్స్
ఇది ఒక Complete Family Entertainment Package. అప్పుడప్పుడు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మహిళలకు మాత్రమే, పిల్లలకు మాత్రమే ఎంట్రీ ఉండేలా Women’s Day, Children’s Day Special Days కూడా ఉంటాయి.
- ఇది కూడా చదవండి : Beyond Biryani: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, అంతకు మించి! ఇవి కూడా ట్రై చేయండి
ఎలా చేరుకోవాలి? | How to Reach Nampally Exhibition Grounds
నుమాయిష్‌కు పార్కింగ్ పెద్ద సమస్య.
అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే బెస్ట్.
- MMTS: నాంపల్లి రైల్వే స్టేషన్ చాలా దగ్గరలో ఉంటుంది
- Metro: Nampally Metro Station నుంచి కూతవేటు దూరం
- RTC Buses: సిటీ లో ఎక్కడి నుంచైనా MJ Market / Nampally రూట్స్
ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీలు కాకపోతే బైక్ మంచిది. కార్లు వీలైనంతవరకు ఎవాయిడ్ చేయండి.ఒక్క కారు స్థలంలో 4–5 బైకులు పార్క్ చేయొచ్చు, ట్రాఫిక్ నుంచి బయటపడటంలో కూడా బైకులే ఈజీ.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్‌లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ | Hyderabad International Kite, Sweet Festival 2026
వివిధ ప్రాంతాల నుంచి దూరం | Distance Guide
- Charminar vs Nampally Exhibition Grounds Current distance: 5 km
- Secunderabad Railway Station vs Nampally Current distance: 9.6 km
- Hitech City vs Nampally Current distance: 15.4 km
- LB Nagar vs Nampally Current distance: 13.5 km
- Kukatpally vs Nampally Current distance: 21 km
ఈ టిప్స్ పాటించండి | Important Visitor Tips
వీకెండ్స్, పండగలు కాకుండా వీక్‌డేస్‌లో వెళ్లండి. ఎందుకంటే వీకండ్, ప్రత్యేక రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
- జనవరి 1–15 మధ్యలో రద్దీ కొంచెం తక్కువగా ఉంటుంది.
- మీ వస్తువులను మీరే జాగ్రత్తగా చూసుకోండి
- రష్లో పిల్లలను ఒంటరిగా వదలకండి
- పోలీసు, అధికారుల సూచనలు పాటించండి
- కంఫర్టబుల్ షూస్ లేదా చెప్పులు వేసుకోండి
- చలిగా ఉంటుంది కాబట్టి స్వెటర్ / జాకెట్ తీసుకెళ్లండి
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
