సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసి 8432 స్పెషల్ బస్సులు | APSRTC Sankranti 2026 Special Buses – Travel Guide
APSRTC Sankranti 2026 Special Buses – Travel Guide : సంక్రాంతి అంటే తెలుగువాళ్లు చాలా మంది సొంత ఊరికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే బస్సులో రద్దీ, టికెట్లు దొరుకుతాయా లేదా, రిటర్న్ జర్నీ గురించి ప్లానింగ్ లాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి.
సంక్రాంతి (Sankranti) అంటే తెలుగు వాళ్లు తమ ఊళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. కానీ పండగ ఆనందం కన్నా ఎక్కువగా ప్రయాణం గురించే చాలా మంది టెన్షన్ పడుతుంటారు .
- ఊరికి వెళ్లే బస్సు టికెట్ దొరుకుతుందా లేదా ?
- రిటర్న్ బస్సు ఉంటుందా ?
- పెద్దలతో, పిల్లలతో కలిసి వెళ్లాలి అంటే సౌకర్యవంతంగా ఉంటుందా ?
- ఇలా ఎన్నో ప్రశ్నలు బుర్రలో తిరుగుంటాయి
అందులో మ్యాగ్జిమం ప్రశ్నలకు సమాధానం ఈ పోస్టులో దొరుకుతుంది.
ప్రయాణికుల్లో ఉన్న ఇలాంటి కన్ఫ్యూజన్లు తగ్గించేందుకు APSRTC Sankranti 2026 స్పెషల్ బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది. ఈ పోస్టు కేవలం ఆర్టీసి చేసిన ప్రకటన మాత్రమే కాదు సంక్రాంతికి ఎలా సిద్ధం అవవ్వాలో కూడా చెప్పే Prayanikudu Travel Handbook కూడా
- ఇది కూడా చదవండి : సంక్రాంతికి TGSRTC స్పెషల్ బస్సులు | కంప్లీట్ గైడ్ | TGSRTC Sankranti Special Buses 2026
ముఖ్యాంశాలు
సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసి ప్రత్యేక బస్సులు ఎందుకు నడుపుతోంంది
Why APSRTC Operates Special Buses During Sankranti
సంక్రాంతి అంటే పట్టణాలు, నగరాలు నుంచి గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.
- హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లో ఉంటున్న తెలుగు కుటుంబాలు అందరూ తమ ఊరికి వెళ్తారు.
- సాధారణ ఆర్టీసి బస్సులు సరిపోవు.
అందుకే ఎపీఎస్‌ఆర్టీసి ముందుగానే రద్దీని ఊహించి సంక్రాంతి ముందు, సంక్రాంతి తరువాత బస్సుల ఏర్పాట్లు పూర్తి చేసింది. అదనపు సేవలను జోడించింది.
మొత్తానికి 8,432 స్పెషల్ బస్సులను నడిపేందుకు ప్లాన్ చేసింది.
సంక్రాంతికి ముందు బస్సు ప్రయాణం ఇలా
Pre-Sankranti Travel Plan
సంక్రాంతికి ముందు మొత్తం 3,857 బస్సులను నడపనున్నారు. ఇందులో మెయిన్ ఫోకస్ సిటీ నుంచి గ్రామాలకు వెళ్లడంపై ఉంచారు. రూట్ల ప్రకారం బస్సుల సంఖ్య…
- హైదరాబాద్ రూట్లో 240 బస్సులు
- బెంగళూరు రూట్లో 102 బస్సులు
- చెన్నైకు 15 బస్సులు
- Interstate (AP Villages) కోసం 3,500 బస్సులను నడపనున్నారు.
ఇలా ప్లాన్ చేయండి | Sankranti Travel planning tip
పండగకు ముందు 2-3 రోజులు రష్ బాగా ఉంటుంది. రాత్రి బస్సులు బాగా వేగంగా ఫిల్ అవుతాయి. అందుకే కుటుంబంతో, పెద్దవారితో ప్రయాణించేవారు పగటిపూట ప్రయాణిస్తే ఉత్తమం.
అడ్వాన్స్ బుక్ చేసుకుంటే ఉత్తమం.
- ఇది కూడా చదవండి : సంక్రాంతికి ట్రైన్ టికెట్ల గురించి వర్రీ అవుతున్నారా ? అదనపు స్పెషల్ ట్రైన్లు ప్రకటించిన South Central Railway
సంక్రాంతి తరువాత జర్నీ ప్లాన్
Post-Sankranti Return Journey Plan
సంక్రాంతి తరువాత రిటర్న్ జర్నీలో ప్రయాణికుల రద్దీని మేనేజ్ చేయడానికి బస్సుల సంఖ్యను పెంచారు. మొత్తం 4,575 బస్సులను నడపనున్నారు. దీని వెనక ఉన్న లాజిక్ మీరు క్యాచ్ చేయండి.
రిటర్న్ జర్నీ ప్లానింగ్‌ను అంత లైట్‌గా తీసుకోకండి. సీరియస్‌గా తీసుకోండి. చాలా పోటీ ఉంటుంది.
ఇక ఏ రూట్లో ఎన్ని బస్సులు ఉంటాయో చూద్దాం
- హైదరాబాద్ రూట్లో1,800 బస్సులు
- బెంగళూరు రూట్లో200 బస్సులు
- చెన్నైకు 75 బస్సులు
- Interstate (AP Villages) కోసం 2,500 బస్సులు
- ఇది కూడా చదవండి : గాాలిలో పతంగులు, ప్లేటులో పిండివంటలు | 7 Sankranti Destinations in Andhra Pradesh
మొత్తం బస్సుల సంఖ్య (రానూ పోనూ)
Sankranti 2026 – Bus Availability
- హైదరాబాద్ రూట్లో 2,028 బస్సులు
- బెంగళూరు రూట్లో278బస్సులు
- చెన్నైకు 90బస్సులు
- Interstate (AP Villages) కోసం 6,000 బస్సులు
APSRTC Special Buses మొత్తం సంఖ్య వచ్చేసి 8,432
సంక్రాంతిలో బస్ బెటరా ? లేక ట్రైనా ?
Train Vs Bus For Sankranti

నిజానికి సంక్రాంతి, దసరా లాంటి సీజన్లో మనకు ఛాయిస్ ఉండదు. ట్రైన్ మిస్ అయితే బస్సు, అలాగే బస్సు మిస్ అయితే ట్రైన్ క్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తాం కదా. కానీ మీకు ఛాయిస్ ఉంటే ఏది ఎంచుకోవాలో ఒకసారి చెక్ చేద్దాం.
ఏపీఎస్ఆర్టీసి ఈ పరిస్థితుల్లో బెటర్ | APSRTC Bus better when:
- మీ ఊరికి డైరక్టుగా బస్సులు ఉంటే
- పెద్దలు, తల్లిదండ్రులతో ప్రయాణిస్తుంటే
- ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకుంటే
- తక్కువ దూరం ప్రయాణించాలి అనుకునేవారికి బస్సు ప్రయాణం బెటర్.
- ఇది కూడా చదవండి : ఈ సంక్రాంతికి బర్డ్స్ & భక్తి కాంబినేషన్ ట్రై చేయండి | Flamingo Festival 2026 – TTD Combo Tour
ట్రైన్ ఎప్పుడు బెటర్ అంటే | Train better when
చాలా దూరం వెళ్లాలి అనుకున్నప్పుడు నేచురల్‌గా ట్రైనే బెటర్. పెద్ద ఫ్యామిలీ, దానికి తోడు లగేజ్ ఎక్కువ ఉంటే (అన్నట్టు ట్రైన్లో లగేజికి కూడా ఒక లిమిట్ ఉంటుదని ఈ మధ్యే రైల్వే మంత్రి ప్రకటించారు. ఆ లిమిట్ దాటితే ఏం జరుగుతుందో పోస్టు రాశాను. కింద లింక్ ఇస్తాను చదవండి.)
- మీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయితే లేదా టికెట్లు అందుబాటులో ఉంటే ట్రైన్ జర్నీ బెటర్
సంక్రాంతిలో ట్రైను, బస్సు రెండింటిలో దేనిలో సీట్లు దొరికితే అందులో వెళ్లడమే కదా తెలివైన పని. రెండూ ప్రభుత్వ మార్గదర్శకాల్లో నడిచే రవాణా సంస్థలు కాబట్టి సేఫ్టీ విషయంలో ప్రైవేటు ట్రావెల్స్ కన్నా చాలా బెటర్.
సంక్రాంతి బుకింగ్ చిట్కాలు| APSRTC Sankranti Travel
Booking and Timing Tips
సంక్రాంతికి నగరాలు ఖాళీ అవుతాయి. గ్రామలు కళకళలాడుతాయి. ఇలాంటి సమయంలో మీరు బస్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తోంటే…
- చివరి నిమిషంలో బుకింగ్ చేయడానికి ప్రయత్నించకండి.
- ముందుగానే బుక్ చేసుకునేందుకు ప్రయత్నించండి.
- ఉదయం లేదా అర్థరాత్రి బయల్దేరే బస్సుల టికెట్లు వేగంగా బుక్ అయిపోతాయి.
- RTC Official Booking Channels ద్వారా బుకింగ్ చేసుకోవడం ఉత్తమం
- సాధ్యం అయితే రిటర్న్‌లో కూడా టికెట్ ముందే బుక్ చేసుకోండి.
ఇక కుటుంబంతో కలిసి ప్రయాణించే వారు బస్సు ఎక్కే బోర్డింగ్ పాయింట్ (Boarding Point) ఎక్కడ ఉందో ముందుగా తెలుసుకుని అక్కడే నిలబడండి.
- చివరి నిమిషంలో పరుగులు తీయకండి. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకుండా ముందే ప్లాన్ చేసుకోవచ్చు.
పెద్దలకు ముందు సీటు లేదా విండో సీటు కాకుండా దారికి దగ్గర్లో ఉండే సీటు ( aisle-side) బెటర్.
- ఇది కూడా చదవండి : అడవుల మధ్య పెరిగిన రంపచోడవరం విశేషాలు | Rampachodavaram Travel Guide
సంక్రాంతి బస్సుల విషయంలో ఈ తప్పులు చేయకండి
Common Sankranti Bus Travel Mistakes
ముందు వెళ్లడం గురించి ఆలోచిద్దాం, వచ్చేటప్పుడు దాని గురించి ఆలోచిద్దాం అని చాలా మంది రిటర్న్ జర్నీ గురించి ఆలోచించరు.
- కానీ మీరు ఆలోచించండి. ప్లాన్ చేయండి.
- వీలైతే వెళ్లేది, రిటర్న్ టికెట్ రెండూ ఒకేసారి బుక్ చేసుకోండి. ఒక పని అయిపోతుంది.
- రిటర్న్ జర్నీలో రద్దీని అస్సలు తక్కువ అంచనా వేయకండి.
- పెద్దల సౌకర్యాన్ని అంతగా పట్టించుకోకుండా చాలా మంది ప్లాన్ చేస్తుంటారు.
- అలాగే బస్సు రైలు మధ్య ఏది బెటరో అనేది తేల్చుకోకుండా ఏదోకటి అని బుక్ చేసుకోవడం.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
