ఈ పోస్టులో మీరు వరంగల్ స్టేషన్ (Warangal Railway Station) అప్‌గ్రేడింగ్ పనుల గురించి తెలుసుకోవడంతో పాటు, వరంగల్ స్టేషన్‌లో జరుగుతున్న పనులు పూర్తయితే స్టేషన్ ఎలా కనిపిస్తుందో చూడవచ్చు.
ముఖ్యాంశాలు
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్

ఈ తరం ప్రయాణికులకు వరల్డ్ క్లాస్ సదుపాయాలు కల్పించే దిశలో భారతీయ రైల్వే వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో (Amrit Bharat Station Scheme) భాగంగా రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పునారాభివృద్ధి పనులు చేపట్టింది.
తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు | Telangana Railway Stations Upgrading Works

తెలంగాణ రాష్ట్రంలో రూ.2,737 కోట్లతో 40 స్టేషన్లను రినోవేట్ చేసే పనిలో నిమగ్నమై ఉంది రైల్వే శాఖ. ఇప్పటికే పలు స్టేషన్లలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ పోస్టులో మీరు వరంగల్ స్టేషన్ అప్‌గ్రేడింగ్ పనుల గురించి, వరంగల్ స్టేషన్‌లో జరుగుతున్న పనులు పూర్తయితే స్టేషన్ ఎలా కనిపిస్తుందో చూడవచ్చు.
కాకతీయుల వాస్తు శిల్పకళా ఆధారంగా | Warangal Railway Station Upgrading Theme

సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ (South Central Railways) పరిధిలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఢిల్లీ-చైన్నై ప్రధాన మార్గంలో కీలకంగా భావిస్తారు. వరంగల్ అంటే ముందుగా కాకతీయ రాజులు గుర్తుకు వస్తారు. అందుకే స్టేషన్ నిర్మాణంలో కూడా కాకతీయుల వాస్తు శిల్పకళా ఆధారంగా డిజైన్ చేస్తున్నారు. వరంగల్ స్టేషన్ నిర్మాణంలో స్థానిక వారసత్వం (Kakatiya Heritage) ప్రతిబింబించేలా డిజైన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
గతంలో జరిగిన పనులు | Facilities in Warangal Railway Station

వరంగల్ స్టేషన్‌లో గత కొన్ని సంవత్సరాలుగా కొత్త ట్రాక్‌లు, ఫెసిలిటీలు, కొత్త ప్లాట్‌ఫామ్‌లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్టేషన్లో వెయింటింగ్ హాల్స్, ఫుడ్ స్టాల్స్, రెస్ట్ రూమ్స్ వంటి సదుపాయాలు కల్పించారు. దీంతో పాటు దివ్యాంగ ప్రయాణికులకు ప్రత్యేక వాష్‌రూమ్స్, ర్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న పనులు | Warangal Railway Station

అప్‌గ్రేడింగ్ పనుల్లో భాగంగా స్టేషస్ బల్డింగ్ ఎంట్రెన్స్ డెవెలెప్ చేస్తున్నారు. దీంతో పాటు 12 మీటర్లు పొడవైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 3 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్‌ఫామ్‌పై ఫ్లోరింగ్ రినోవేట్ చేయడం, వెయిటింగ్ హాల్ డెవెలెప్ చేయడం, కొత్త టాయిలెట్ బ్లాక్స్ నిర్మాణం, ప్లాట్‌ఫామ్స్‌పై అదనపు సీలింగ్ ఏర్పాటు చేయడం చేస్తున్నారు
ఆహ్లాదంగా కనిపించేలా ..

వీటితో పాటు ప్రయాణికులు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా స్టేషన పరిసరాల్లో పచ్చదనాన్ని పెంచుతున్నారు. కొత్తగా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఇందులో 50 శాతం పనులు పూర్తయ్యాయి. పనులు అన్నీ పూర్తి అయితే పైన మీరు చూసిన చిత్రాల్లా కనిపించనుంది వరంగల్ స్టేషన్.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.