జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? | Jammu and Kashmir

షేర్ చేయండి

జమ్మూ అండ్ కశ్మీర్ (Jammu and Kashmir) భారత్‌లో ఉత్తరాన ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. ప్రపంచంలోని అందం అంత కలిపి ప్రకృతి వేసిన చిత్రంలా ఉంటుంది ఈ ప్రాంతం. భూమిపై స్వర్గం ఉంటే అది ఇదేనని కవులు అన్నారంటే దానికి కారణం ఇక్కడి సౌందర్యం. ఈ ప్రాంత చరిత్ర, భానుడి ప్రకాశంతో సమానమైన సంస్కృతి, ఆచారాలు అనేవి భారతీయ చరిత్రలో కీలకమైన అంశాలుగా చెప్పవచ్చు. 

జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయం గురించి తెలుసుకుంటే ఈ ప్రాంతం హిందూ మతానికి (Hinduism in Jammu and Kashmir), భారత దేశానికి ఎంత కీలకమో అర్థం అవుతుంది. భవిష్యత్ తరాలకు ఈ విషయాలు తెలియజేయాలి అంటే ముందు మనకు తెలియాలి.

కశ్మీర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది ? How Kashmir Got Its Name

కశ్మీర్ అనే పేరు సంస్కృతం (Sanskrit) నుంచి వచ్చింది అని చెబుతారు. ఒకప్పుడు కాశ్మీరు లోయలో (Kashmir Valley) సతీసర్ (Satisar Lake) అనే ఒక భారీ సరస్సు ఉండేదట. అయితే ఈ ప్రాంతాన్ని నివాసయోగ్యంగా మార్చేందుకు కశ్యమ మహర్షి (sage kashyap) ఈ సరస్సులోని నీటిని తొలగించారట. 

దీంతో ఈ ప్రాంతం మనుషులు, ఇతర జీవాలను నివసించేందుకు వీలుగా మారిందంటారు. లోక కళ్యాణం కోసం ఆయన చేసిన ప్రయత్నానికి ప్రతిఫలంగా ఈ ప్రాంతాన్ని కశ్యప ముని పేరు మీదుగా కశ్మీర్ అని పిలవడం మొదలుపెట్టాంటారు.

కశ్మీర్‌కు ఈ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని బ్రేక్ అప్ చేస్తే …

పై రెండు సందర్భాల్లోనూ కశ్యపుడి పేరు మాత్రం కామన్ అని గమనించగలరు.

కాశ్మీరీకులు | చరిత్ర | విశిష్టత | Kashmir History and Spiritual References

కశ్మీర్ గురించి భారతదేశంలోని అనేక పౌరాణిక గ్రంథాలతో పాటు మహా భారతంలో (Mahabharat), అనేక పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. ఈ పేరును సంస్కృత వ్యాకరణవేత్త పాణిని (Panini) తన అష్టాధ్యాయి అనే గ్రంథంలో ప్రస్తావించారు.

సో, ఆన్ రికార్డ్ ఇదే కశ్మీర్ పేరుకు సంబంధించిన అత్యంత పురాతనమైన ప్రస్తావన అని చెప్పవచ్చు. బట్ఈ గ్రంథంలో స్థానిక ప్రజలను ఆయన “కాశ్మీరీకులు ” (Kashmirikas) అని సంబోధించారు. 

జమ్మూకు ఆ పేరు ఎలా వచ్చింది ? | How Jammu Got Its Name ?

how jammu and kashmir got its name
వేట, వేటగాడు కలిని నదీ నీరు తాగిన ప్రాతం
రాజా జంబులోచనుడి కథ | Jammu and Kashmir

జమ్మూ అనే పేరు ఒకప్పటి రాజు రాజా జంబులోచనుడు (Raja Jambu Lochan) వల్ల వచ్చింది. స్థానికుల ప్రకారం ఒకసారి ఈ రాజు తవి అనే నది (tawi river) వద్ద ఒక సింహం, మేక పక్కపక్కనే నిలబడి నీళ్లు తాగడం గమనించాడట. 

వేట అంటే మేక, వేటగాడు అంటే సింహం ఒకచోట ఉండటం (predator and prey drank together in peace) అనేది ఇక్కడ శాంతియుత వాతావరణానికి ప్రతీకగా భావించాడట. ఆయనే ఈ ప్రాంతాన్ని జంబుపురం (Jambu Pura) లేదా జంబు నగరం (Jambu Nagar) అని పేరు పెట్టాడు అని చెబుతారు. తరువాత కాలంలో అది జమ్మూగా మారిందంటారు.

గమనిక : ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ విషయాలను అందించడం జరిగింది. మీ తరపున ఏమైనా చెప్పాలి అంటే Feel Free To Comment Below. Thank You

Latest Vlog : హరిద్వార్‌లోని అతిపవిత్రమైన మా చండి దేవి ఆలయం | Maa Chandi Devi Temple

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. 

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!