ఛార్‌ ధామ్ యాత్ర కోసం ఐఆర్‌సీటీసి స్పెషల్ టూరిస్టు ట్రైన్ | IRCTC Char Dham Yatra 2025

షేర్ చేయండి

ఛార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటిసి భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్టు ట్రైను అందుబాటులోకి తీసుకవచ్చింది (IRCTC Char Dham Yatra 2025) .17 రోజుల ఈ సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఆధ్మాత్మిక యాత్ర అనేది 2025 మే 17వ తేదీన ప్రారంభం అవుతుంది. 

భారత దేశంతో అత్యంత పవిత్రమైన ఛార్ ధామ్ యాత్రలో పుణ్యక్షేత్రాలను సురక్షితంగా, సౌకర్యవంతంగా సందర్శించేందుకు ఇది ఒక అద్బుతమైన అవకాశం అని చెప్పవచ్చు.

సందర్శించే పుణ్య క్షేత్రాలు | IRCTC Char Dham Yatra 2025 Itinerary

  • బద్రినాథ్ (badrinath, mana) : శ్రీ మహా విష్ణువు పాదం మోపిన బద్రినాథ్ ఆలయం, భారత్‌లో తొలి గ్రామం మానా, జోషిమఠ్
  • జగన్నాథ్ పురి (Puri Jagannath Temple) : పూరిలోని జగన్నాథ్ ఆలయం, కోనార్క్ సూర్య దేవాలయం, చంద్రభాగా బీచ్.
  • రామేశ్వరం, ధనుష్కోడి (Dhanushkodi) : రామనాథ స్వామి వారి దర్శనం. 
  • ద్వారకా (Dwaraka) : ద్వారకాధీషుడి ఆలయ దర్శనం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, బెయిట్ ద్వారక దర్శనం,
  • మరిన్ని జ్యోతిర్లింగాలు (Jyotirlingas) : 17 రోజుల ప్యాకేజీలో భాగంగా వారణాసి, పూణె, నాసిక్‌లోని పవిత్ర క్షేత్రాలను కూడా సందర్శించే అవకాశం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : చార్ ధామ్ యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసి డీలక్స్ ప్యాకేజ్…ఎంత? ఎన్నిరోజులు ? ఎప్పుడు ? ఎలా ? | IRCTC Tourism
IRCTC Char Dham Yatra 2025
ఈ ప్యాకేజీ వల్ల ఇతర విషయాలు మర్చిపోయి కేవలం దైవచింతనలో పూర్తిగా లీనమయ్యే అవకాశం లభిస్తుంది

సదుపాయాలు | Inclusions 

ఈ ప్యాకేజీలో భాగంగా ప్రయాణికులు ఏసీ 1, ఏసీ 2, ఏసీ 3 క్లాసులో ( Bharat Gaurav Deluxe AC Tourist Train) ప్రయాణించవచ్చు.విలాసవంతమైన రైల్వే కోచుల్లో మీకు డైనింగ్ రెస్టారెంట్స్, షవర్ క్యూబికల్స్, ఎలక్ట్రానిక్ సేఫ్స్‌తో పాటు వినోదం, విఙ్ఞానం అందించే సదుపాయాలు కల్పించబడతాయి.

ప్రతీ కోచులో సీసీటీవితో పాటు భద్రతా సిబ్బంది కూడా ఉంటారు. ప్రతీ డెస్టినేషన్‌లో (Destination) 3 స్టార్ హోటల్ సౌకర్యం ఉంటుంది. శాఖహార భోజనం, ప్రయాణానికి ఏసీ వాహనాలు, ట్రావెల్ గైడ్ ఉంటారు.

ఎలా బుక్ చేసుకోవాలి ? | Booking

ఈ ప్యాకేజీని మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఐఆర్‌సీటీ‌సి టూరిజం వెబ్‌సైట్ (IRCTC Website) విజిట్ చేయాల్సి ఉంటుంది. 16 రాత్రులు/ 17 రోజుల ఈ ప్రయాణంలో భాగంగా మీకు ట్రైనులో ప్రయాణం, విడిది, భోజనం, లోకల్ ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్ గైడ్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ఈ ప్యాకేజీ వల్ల ఇతర విషయాలు మర్చిపోయి కేవలం దైవచింతనలో పూర్తిగా మునిగిపోయే అవకాశం లభిస్తుంది.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!