జనవరి 2026లో తిరుపతి వెళ్తున్నారా? గోవిందరాజస్వామి ఆలయ విశేష ఉత్సవ తేదీలు | Govindaraja Swamy Temple special days
జనవరిలో 2026 తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే గోవిందరాజ స్వామి ఆలయంలో జరిగే వేడుకలు ( Govindaraja Swamy Temple special days), వాటి ప్రభావం భక్తులపై ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి, దర్శనం టిప్స్…
జనవరిలో 2026 తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే గోవిందరాజ స్వామి ఆలయంలో జరిగే వేడుకలు ( Govindaraja Swamy Temple special days), వాటి ప్రభావం భక్తులపై ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి, దర్శనం టిప్స్…
జనవరి నెలలో తిరుమల (Tirumala), తిరుపతిలో భక్తుల రద్దీ నార్మల్‌గా ఉండదు. మరీ ముఖ్యంగా తిరుపతి టౌన్ ఏరియాలో రద్దీ బాగా ఉంటుంది. గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో ఉత్సవాలు, వేడుకల వల్ల మూవ్మెంట్, హడావిడి ఎక్కువగా ఉంటుంది.
- ఇది కూడా చదవండి : టోకెన్ లేకపోతే అనుమతి లేదా? టీటీడీ చైర్మన్ క్లారిటీ! TTD Vaikuntha Dwara Darshan 2026
సాయంత్రం సమయంలో హఠాత్తుగా క్రౌడ్ పెరిగిపోతుంది. చాలా మందికి ఏం జరుగుతుందో తెలియదు. మీరు అలాంటి ఇబ్బంది పడకూడదు అంటే, మీరు తిరుపతి ట్రావెల్ ప్లాన్ (Tirupati Travel Plan) చేస్తుంటే…
ఈ తేదీలు తెలుసుకుంటే ఇబ్బంది పడరు. తేదీని బట్టి ఏం జరుగుతుందో మీకు సులభంగా తెలిసిపోతుంది.
జనవరి క్యాలెండర్ | Govindaraja Swamy Temple special days in January 2025
గోవిందరాజ స్వామి ఆలయంలో జనవరి నెలలో జరిగే వేడుకలు, ఉత్సవాలు ఇవే. ఈ క్యాలెండర్‌ను బట్టి మీరు తిరుపతిలో స్టే అండ్ దర్శనం ప్లాన్ చేసుకోవచ్చు.
2026 జనవరి 1 (రోహిణి నక్షత్రం): సాయంత్రం 6 గం.లకు శ్రీ పార్థసారధి స్వామి (రుక్మిణీ, సత్యభామ సమేతంగా) వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారు.
- ఇది కూడా చదవండి : వాట్సాప్‌లో టీటీడీ సేవల ఫిర్యాదు…క్యూఆర్ కోడ్ లాంచ్ చేసిన దేవస్థానం | TTD WhatsApp Feedback
- జనవరి 2 & 23 (శుక్రవారాలు): ఆండాల్ అమ్మవారు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
- జనవరి 3: పౌర్ణమి గరుడ సేవ.
- జనవరి 5: రామ చంద్ర తీర్థం వరకు ఊరేగింపు | Ramachandra Teertham.
- జనవరి 7–13: ఆండాల్ అమ్మవారి నీరాటోత్సవం.
- జనవరి 14: భోగి తేరు – ఈ రోజు రథాల మూవ్మెంట్ ఉంటుంది.
- జనవరి 15: మకర సంక్రాంతి.
- జనవరి 16: గోదా కల్యాణం.
- జనవరి 17 (కనుమ): పెరువేట ఉత్సవం.
- జనవరి 18 నుంచి ఫిబ్రవరి 10 వరకు అధ్యనోత్సవాలు కొనసాగుతాయి.
- జనవరి 20 (శ్రావణ నక్షత్రం): సాయంత్రం 6 గంటలకు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
- జనవరి 25: రథ సప్తమి | Ratha Saptami.
- జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు తెప్పోత్సవాలు కొనసాగుతాయి.
ప్రయాణికులు గమనించాల్సిన విషయాలు | Why this matters for a traveller
ఈ ఉత్సవాలు జరిగే రోజుల్లో మీరు కొన్ని విషయాలను గమనించాలి లేదా ప్లాన్ చేసుకోవాలి. ఆలయం పరిసరాల్లో మూవ్మెంట్, హడావిడి ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం సమయంలో రహదారులు మూతపడొచ్చు.
- ఇది కూడా చదవండి : తిరుమలలో రీల్స్ చేస్తున్నారా ? అయితే ఇది చదవండి!
- దర్శనం సమయం సాధారణ రోజులతో పోలిస్తే నెమ్మదిగా ఉండవచ్చు.
- సంక్రాంతి (sankranti) వీక్‌లో టైట్ షెడ్యూల్ ఉంటే ఈ సమయంలో అవాయిడ్ చేయడం ఉత్తమం, ఎందుకంటే రద్దీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వెళ్లొద్దని చెప్పే హక్కు, అధికారం ఎవరికీ లేదు. జస్ట్ సూచన మాత్రమే.
- ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే ఉత్సవాలు, వేడుకలు జరగని రోజులు ఎంచుకోవడం మంచిది.
- ఈ సమాచారం తిరుపతి (tirupati) టౌన్ సైడ్ ప్లానింగ్ కోసం మాత్రమే. తిరుమల దర్శనం రూల్స్ వేరుగా ఉంటాయి.
- ఇక 2026 జనవరిలో తిరుపతి వెళ్తే గోవిందరాజ స్వామి ఆలయం దగ్గర ఈ డేట్స్‌లో ఏదో జరుగుతుందని తెలుసుకుని వెళ్తే మీ ట్రిప్ ఫ్రస్ట్రేషన్ కాకుండా ప్లాన్డ్ ఎక్స్‌పీరియెన్స్‌గా మిగిలిపోతుంది.
- ఇది కూడా చదవండి : ఆలయ శిల్పకళలో టీటీడి శిక్షణ : భావితరాల కోసం అరుదైన అవకాశం | TTD Temple Architecture Course
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
