Anivara Asthanam : శ్రీవారి సన్నిధిలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం
Anivara Asthanam : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో శాస్త్రోక్తంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Tirumanjanam) జరిగింది. ఈ నెల 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా శాస్త్రోక్తంగా ఆలయం ప్రాంగణంలో కోయిల్ ఆల్వార్ తిరుమనంజనం నిర్వహించారు.
తిరుమలలో స్వామివారి సన్నిధిలో ప్రతీ సంవత్సరం నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమనంజనం నిర్వహిస్తారు.
- ఉగాది సందర్భంగా
- ఆణివార ఆస్థానం
- శ్రీవారి బ్రహ్మోత్సావాలు
- వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తోంది.
సుగంధ ద్రవ్యాలతో సంప్రోక్షణం

TTD Koil Alwar Tirumanjanam : కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు, తరువాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లోపలి భాగంలో ఉన్న ఉపాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పోటు, పైకప్పులు, ఇతర పూజా సామాగ్రిని మంచి నీటితో శుభ్రం చేస్తారు.
- ఈ ప్రక్రియ జరిగే సమయంలో స్వామి వారి మూలవిరాట్లును పూర్తిగా వస్త్రంతో కప్పి ఉంచుతారు.
- ఆలయం శుధ్ది అనంతరం పచ్చాకు, గడ్డ కర్పూరం, కిచిలి గడ్డ, శ్రీ చూర్ణం, నామకోపు, గంధం పొడి, కుంకుమ వంటి పలు సుగంధ ద్రవ్యాలను కలిపిన ద్రవ్యాన్ని ఆలయం అంతా ప్రోెక్షణం చేస్తారు.
- వీటితో ఆలయ ప్రాంగణం పవిత్రం అవడంతో పాటు సుగంధితం అవుతుంది.అనంతరం స్వామి వారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
- TTD Key Updates : జూలై 15, 16 లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు…ఎందుకో తెలుసా ?
ఇక అణివార ఆస్థానం (Anivara Asthanam) సందర్భంగా జూలై 15, 16వ తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.