సమ్మర్‌ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? తెలుగు రాష్ట్రాల్లో టాప్ 16 డెస్టినేషన్స్… Summer Destinations In Telugu States

షేర్ చేయండి

సమ్మర్‌లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా ? అయితే ఎక్కడికి వెళ్లాలి అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటే మీ కోసం తెలుగు రాష్ట్రాల్లో అందమైన 14 ప్రదేశాల జాబితాను (Summer Destinations In Telugu States) సిద్ధం చేశాం. 

ఏ ప్రాంతంలో ఎన్ని రోజులు టూర్ ప్లాన్ చేయాలి ? ఏం చేయాలి ? ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అనే విషయాన్ని సింపుల్‌గా చిన్న పారగ్రాఫ్‌లో మీకు అందిస్తున్నాం. చకచక చదివి టకటక ప్లాన్ చేసి రయ్ రయ్ అని బయల్దేరండి మరి.

1.అరుకు లోయ 

Summer Destinations In Telugu States
అరకులో ప్రయాణికుడు

Araku Valley : అరకు లోయ అనగానే కనుచూపుమేరా పచ్చదనం, అందమైన కొండలు, దట్టమైన వనాలు, కాఫీతోటలు, ట్రైబల్ కల్చర్‌తో పాటు మనసును హత్తుకునే లొకేషన్స్ కళ్ల ముందు కదలాడుతాయి. 

  • అయితే చాలా మంది అరకు లోయ అంటే చలికాలంలోనే (Araku In Winter) వెళ్లాల్సిన ప్రదేశం అని అనుకుంటారు. 
  • కానీ ఎండా కాలం కూడా ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ నుంచి 28 వరకు ఉంటుంది. 
  • సో, మీరు 2-3 రోజుల కోసం అరకు వెళ్లాలి అనుకుంటే బొర్రా గుహలు (borra caves), కటిక జలపాతం వంటి ప్రాంతాలను ఎక్స్‌ప్లోర్ చేయవచ్చు.
బొర్రా గుహలపై ప్రయాణికుడి వీడియో ఒకసారి చూడండి

2.లంబసింగి 

Lambasingi, Andhra Pradesh : ఆంధ్రా కశ్మీరుగా గుర్తింపు తెచ్చుకున్న లంబసింగి సముద్ర మట్టానికి 1,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ నుంచి 20 డిగ్రీల వరకు ఉంటుంది. మే నెలలో మధ్యాహ్న సమయంలో 35 డిగ్రీల వరకు కూడా చేరుకుంటుంది.

Lambasingi Complete Travel and tour information in telugu by prayanikudu (5)
లంబసింగి

3.హార్స్‌లి హిల్స్ 

Horsley Hills, Andhra Pradesh : ఈ అందమైన హిల్ స్టేషన్‌ను ఆంధ్రా ఊటి అని పిలుస్తుంటారు. సందర్శకులకు ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం బాగా నచ్చుతుంది. ఎండాకాలం ఇక్కడ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ నుంచి 36 వరకు ఉంటుంది. 

  • ఒకటి రెండు రోజుల టూరు కోసం ఈ ప్రాంతం మీకు బాగా సెట్ అవుతుంది. 
  • ఇక్కడ మీరు ట్రెక్కింగ్ (trekking), బర్డ్ వాచింగ్, అడ్వంచర్ స్పోర్ట్స్‌తో పాటు బొటానికల్ గార్డెన్‌‌ను కూడా సందర్శించవచ్చు.

4. అనంతగిరి హిల్స్

Ananthagiri Hills, Telangana : హైదరాబాద్‌కు అత్యంత సమీపంలోనే ఉన్న హిల్ స్టేషన్ ఇది. పచ్చదనంతో కళకళలాడే ఈ హిల్ స్టేషన్‌లో ఎండాకాలం ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 వరకు ఉంటుంది. 

  • 1-2 రోజుల కోసం లేదా వీకెండ్‌లో ఎక్కడికైనా వెళ్లాలి అనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది.

5.పాడేరు

Paderu , Andhra Pradesh : అరకు లోయకు చేరువలో వెస్ట్రన్ ఘాట్స్‌కి చేరువలో ఉంటుంది పాడేరు. చలికాలంలో చాలా మంది ఇక్కడి నుంచే వంజంగి (Vanjangi), లంబసింగి వైపు వెళ్తుంటారు. 

vanjangi
పాడేరు వెళ్లే దారిలో కనిపించే బ్యూాటి
  • ఈ ప్రాంతంలో ఉండే పచ్చదనం, ప్రశాంతతను చాలా మంది ఇష్టపడుతుంటారు.
  • ఎండాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత 28 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉంటుంది. 
వంజంగిపై ప్రయాణికుడి వీడియో చూడండి

6.మారేడు మిల్లి

Maredumilli, Andhra Pradesh : చిక్కటి అడవులు, అక్కడక్కడ జలపాతాలతో ఉండే ఈ ప్రాంతం ఇకో టూరిస్టుల కోసం ఈ ప్రాంతం స్వర్గంలాంటిది. ఎండాకాలం ఇక్కడ టెంపరేచర్ 28 డిగ్రీల నుంచి 39 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్తుంది. 

  • ట్రెక్కింగ్ చేసేవారికి, వన్యప్రాణులను చూసేందుకు ఇష్టపడేవారికి, ఫోటోగ్రఫీ చేయాలనుకునేవారికి ఈ ప్రాంతం బాగా నచ్చుతుంది. 

7.పాపికొండలు 

Papikondalu, Andhra Pradesh : తెలుగువారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని ప్రాంతం పాపికొండలు. కొండల మధ్యలోంచి సాగే గోదావరిలో చాలా మంది బోటు ప్రయాణం (boating) చేయడానికి ఇష్టపడుతుంటారు. 

8.చింతపల్లి

Chintapalli, Andhra Pradesh : పేరులో చింత ఉంటుంది కానీ ఈ ప్రాంతానికి వెళ్తే ఉన్న చింతలు అన్నీ కూడా దూరం అవుతాయి. 

  • అందమైన ల్యాండ్‌స్కేప్, ఎండా కాలం కూడా సాధారణంగా ఉండే ఉష్ణోగ్రతలు ఉండే గిరిజన గ్రామం ప్రశాంతతకు నెలవులాంటిది. 

9. నల్లమల కొండలు 

Nallamala Hills, AP and Telangana : శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న నల్లమల ప్రాంతంలో వైల్డ్‌లైఫ్ సఫారీతో పాటు ట్రెక్కింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శిచుకునే భక్తులు చాలా మంది చుట్టుపక్కన ఉన్న ఇతర యాక్టివిటీస్ చేయడానికి కూడా ఇష్టపడుతుంటారు. 

10.కోనసీమ 

Konaseema, Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది కోనసీమే. అందమైన బ్యాక్ వాటర్స్‌, ఉక్కపోతతో పాటు ఉత్సాహాన్సి పెంచే వాతావరణం ఇవన్నీ సమ్మర్‌లో చాలా మందిని కోనసీమ వెళ్లేలా చేస్తాయి. 

11.ఒంగోలు 

Ongole, Andhra Pradesh : ఒంగోలులోని బీచులు, చారిత్రాత్మక ఆలయాలను సందర్శించేందుకు మీకు 1-2 సరిపోతాయి. ఎండాకాలం ఇక్కడ వేడిగానే ఉంటుంది. 

  • అయితే కొత్తపట్నం బీచు (Kothapatnam Beach), స్థానికంగా ఇంకా ఎన్నో ప్రదేశాలు చూసే సమయంలో కాసేపు మీరు ఆ వేడిని పక్కన పెట్టేసి ఎంజాయ్ చేస్తారు. 

12.చిత్తూరు 

Chittoor, Andhra Pradesh : చిత్తూరు జిల్లాలో ఉన్న ఆలయాలు, జలపాతాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. సమ్మర్‌లో ఇక్కడ వేడి ఎక్కువే ఉంటుంది. 

  • అయితే ఎండాకాలంలో స్థానికంగా లభించే మామిడిపండ్లను (andhra mangoes) రుచి చూస్తే ఇది సమ్మర్ డెస్టినేషన్ జాబితాలో ఎందుకు చేరిందో మీకే అర్థం అవుతుంది. 

13.అహోబిలం

Ahobilam, Andhra Pradesh : అహోబిలం అనేది ఒక పవిత్రమైన క్షేత్రం. దీంతో పాటు ఈ ప్రాంతం చాలా అందంగా ప్రకృతి రమణీయతతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. 

  • ప్లస్, మిగితా ప్రాంతాలతో పోల్చితే వేడి తక్కువగా ఉండటంతో చాలా మంది ఎండాకాలం కూడా ఇక్కడికి వస్తుంటారు.

14.నగరి హిల్స్ 

Nagari Hills, Andhra Pradesh : నగరి హిల్స్‌లో ఉండే వినూత్నమైన రాక్ ఫార్మేషన్‌తో పాటు ఇక్కడి పచ్చదనం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతాన్ని చుట్టేయడానికి మీకు 24 నుంచి 48 గంటలు సరిపోతుంది. 

  • ఎండాకాలం ఇక్కడ 28 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. 

కొన్ని చిట్కాలు : Tips For Travelers

  • ఉష్ణోగ్రత చెక్ చేయండి : ఇది ఎండాకాలం ఉష్ణోగ్రత ఉదయం ఒకలా ఉంటుంది. మధ్యాహ్నం ఒకలా ఉంటుంది. అందుకే ఏ ప్రదేశానికి వెళ్లినా ఉదయం త్వరగా మీ ట్రిప్‌ను స్టార్ట్ చేయండి. 
  • ప్యాకింగ్ : వీలైనంత తక్కువ వస్తువులను ప్యాక్ చేసుకోండి. అందులో తేలికగా ఉండే దుస్తువులు, సన్‌స్క్రీన్‌లోషన్, క్యాప్స్, వాటర్ బాటిల్, ఓఆర్‌ఎస్ వంటివి ఉండేలా చూసుకోండి.
  • బుకింగ్ : పాఠశాలలకు సెలవులు కాబట్టి ఈ సమయంలో హిల్ స్టేషన్స్‌కు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి.
  • ఆంధ్రప్రదేశ్ వెళ్తే మామడిపండ్లు, తెలంగాణ వెళ్తే బిర్యానీ ట్రై చేయండి.అలాగే స్థానికంగా పాపులర్ అయిన ఫుడ్‌ను కూడా మీరు ట్రై చేయవచ్చు.
Latest Vlog : హరిద్వార్‌లోని అతిపవిత్రమైన మా చండి దేవి ఆలయం | Maa Chandi Devi Temple

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. 

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!