టోకెన్ లేకపోతే అనుమతి లేదా? టీటీడీ చైర్మన్ క్లారిటీ! TTD Vaikuntha Dwara Darshan 2026
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వైకుంఠ ద్వార దర్శనానికి (TTD Vaikuntha Dwara Darshan 2026) సంబంధించిన రూల్స్‌పై క్లారిటీ ఇచ్చారు. టోకెన్స్ లేని భక్తులను రానివ్వరు అనే అసత్య ప్రచారాలను నమ్మకండి. 2026 గ్రౌండ్ రియాలిటీ మీకోసం.
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం (TTD Vaikuntha Dwara Darshan 2026) టికెట్స్ దొరకలేదా? No Ticket No Entry అనే ఫేక్ న్యూస్‌ను నమ్మకండి. 2026 జనవరి 2వ తేదీ నుంచి టోకెన్స్ లేని వాళ్లకి ఛాన్స్ ఉంది. ఈ అఫీషియల్ జర్నలిస్ట్ రిపోర్ట్‌ను చదవండి.
ముఖ్యాంశాలు
The Journalist’s Reality Check | జర్నలిస్టుగా క్రాస్ చక్ చేద్దాం
ఆన్లైన్ టికెట్స్ దొరకలేదు అని తిరుమల (Tirumala) యాత్రను రద్దు చేసుకుంటే మీరు తప్పు చేస్తున్నట్టే. ఎందుకంటే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ తప్పుడు ప్రచారం (False Propaganda) పై క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో టికెట్స్ లేకపోతే తిరుమల రానివ్వరు అనే వార్త ఒకటి హల్చల్ చేస్తోంది.
నిజం ఏంటంటే… భక్తులను తిరుమలకు రానివ్వొద్దు అని చెప్పే అధికారం ఎవరికీ లేదు.
అందుకే Check Prayanikudu before you go anywhere!
సర్వదర్శనం క్యూలైన్లు సాధారణ భక్తులకు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి.
- ఇది కూడా చదవండి : వాట్సాప్‌లో టీటీడీ సేవల ఫిర్యాదు…క్యూఆర్ కోడ్ లాంచ్ చేసిన దేవస్థానం | TTD WhatsApp Feedback
అధికారిక దర్శన వివరాలు | TTD Vaikuntha Dwara Darshan 2026 Schedule (2025-2026)
| తేదీలు (Dates) | దర్శనం రూల్స్ (Darshan Rules) | ఎవరు రావచ్చు? (Who Can Visit?) |
| Dec 30 – Jan 1 | టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే | తిరుమలకు అందరూ రావచ్చు. కానీ టోకెన్లు లేకపోతే దర్శనం ఉండదు. |
| Jan 2 – Jan 8 | భక్తులు అందరూ రావచ్చు | సర్వదర్శనం లైన్లు తెరిచే ఉంటాయి. అందరూ రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. |
| ఎవరు చెప్పారు (Source) | టీటీడీ అధికారిక రిపోర్టు | వెరిఫై చేసిన వార్త ఇది |
5 Key Highlights: The Reality Check | 5 ముఖ్యమైన విషయాలు

శ్రీవారి దర్శనం విషయంలో కొన్ని అసత్య ప్రచారాలు వ్యాప్తిలో ఉన్నాయి. వాటిని క్రాస్ చెక్ చేసి నిజాలు మీ ముందుకు తీసుకొచ్చాము. టీటీడీ (Tirmala Tiruapati Devasthanams) అధికారిక రిపోర్టు ఆధారంగా తెలిసిన విషయాలు:
1. Fake News About TTD and Clarity | ఫేక్ న్యూస్ మరియు వివరణ
No Ticket No Darshan అనే వాట్సాప్ మెసేజెస్ను చైర్మన్ ఖండించారు. టికెట్స్ లేని వాళ్లని కొండపైకి రానివ్వరు అనేది కేవలం అబద్ధం అని చెప్పారు.
- ఇది కూడా చదవండి : తిరుమలలో రీల్స్ చేస్తున్నారా ? అయితే ఇది చదవండి!
2. The e-Dip Logic | మొదటి 3 రోజులు
డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీకి కేవలం ఆన్లైన్లో ఈ-డిప్ టోకెన్స్ ఉన్న వాళ్లకు మాత్రమే దర్శనం కోసం అనుమతిస్తారు.
ప్రయాణికుడు టిప్: ఈ సమయంలో దర్శనం కోసం టోకెన్ ఉన్నవాళ్లే వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ తిరుమలకు అందరూ వెళ్లవచ్చు. టోకెన్ లేకపోతే ఈ మూడు రోజులు దర్శనం ఆశించకండి. ఎందుకంటే…
3. Sarva Darshan Opportunity | సర్వదర్శనం అవకాశం ఉంది
టోకెన్లు లేని భక్తుల కోసం జనవరి 2వ తేదీ నుంచి జనవరి 8 వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 తెరిచే ఉంటుంది. మీరు డైరెక్ట్ గా వెళ్లి లైన్లో నిలబడవచ్చు.
- ఇది కూడా చదవండి : ఆలయ శిల్పకళలో టీటీడి శిక్షణ : భావితరాల కోసం అరుదైన అవకాశం | TTD Temple Architecture Course
4. RTC Awareness | ఆర్టీసీ ద్వారా ప్రచారం
ఈ విషయంపై APSRTC బస్సులపై బ్యానర్లు, తిరుపతిలో ఫ్లెక్సీల ద్వారా టీటీడీ అవగాహన కల్పిస్తోంది. మీరు అధికారికంగా కూడా చెక్ చేయండి.
- Official Link: news.tirumala.org
5. High-Level Monitoring | ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ
వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సెక్యూరిటీ, రద్దీ నిర్వహణ పకడ్బందీగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
TTD FAQs | కొన్ని డౌట్స్ అండ్ క్లారిటీ
టోకెన్స్ లేకుండా తిరుమలకు వెళ్లవచ్చా? | Can We Go To Tirumala Without Tokens?
- 100 శాతం వెళ్లవచ్చు. ఎంట్రీకి టికెట్‌తో సంబంధం లేదు.
సర్వ దర్శనం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? | When Will Sarva Darshan Will Start
- 2026 జనవరి 2 నుంచి జనవరి 8వ తేదీ వరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనం ఛాన్స్ ఉంది.
ఫేక్ న్యూస్‌ను ఎలా గుర్తించాలి? | Where To Check TTD Official Updates
- కేవలం SVBC Channel లేదా టీటీడీ అధికారిక సోషల్ మీడియా పేజెస్‌లో మాత్రమే చెక్ చేసి వాటినే నమ్మండి.
తిరుమల యాత్ర అంటే ఒక ఎమోషన్. దానిని తప్పుడు వార్తలతో కన్ఫ్యూజ్ చేసుకోకండి. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మండి. స్వామివారిని దర్శనం చేసుకోండి. అండ్
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
