2025 Amarnath Yatra Guide : ఫస్ట్ టైమ్ అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారి కోసం – రూట్స్, రిజిస్ట్రేషన్, బడ్జెట్, హెల్త్ టిప్స్
2025 Amarnath Yatra Guide : ఫస్ట్ టైమ్ అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారి కోసం – రూట్స్, రిజిస్ట్రేషన్, బడ్జెట్, హెల్త్ టిప్స్పరమ శివుడి భక్తులు జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర ప్రదేశాల్లో అమర్నాథ్ యాత్ర కూా ఒకటి. ఇది ఒక యాత్ర మాత్రమే కాదు..ఇది ఒక మరుపురాని, మరిచిపోలేని అధ్మాత్మిక అనుభవం.
అయితే ఈ యాత్ర ముందుస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ పోస్టులో మీకు ఈ పవిత్ర యాత్రకు ఎలా సిద్ధం అవ్వాలో పూర్తి సమాచారం అందిస్తాం.
12,729 అడుగులు (సుమారు 3,888 మీటర్లు) ఎత్తులో ఉన్న ఈ గుహాలయానికి ఫస్ట్ టైమ్ వెళ్తున్న వారికి ఎలా సిద్ధం అవ్వాలో తెలియకపోతే పోస్టు వారికి చక్కగా సహాయ పడుతుంది.
ఏ దారిలో వెళ్లాలి ? Baltal Vs Pahalgam
అమర్నాథ్ మంచు లింగాన్ని ( Amarnath Ice Lingam) దర్శించుకునే భక్తులు రెండు దారుల్లో వెళ్తుంటారు. మొదటిది బాల్టాల్, రెండవది పహల్గామ్. ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక దారిని ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి ఏ దారి ఎంచుకోవాలో నిర్ణయించేందుకు రెండు మార్గాల గురించి తెలుసుకుంటే నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుంది. ముందుగా…
బాల్టాల్ | Baltal to Amarnath Caves Route Information
అమర్నాథ్ యాత్రకు ఈ సారి చాలా మంది ఎంచుకునే దారిలో ఇది కూడా ఒకటి. 14 కిమీ పొడవైన ఈ వన్‌వే మార్గంలో సుమారు ఒక ట్రెండు రోజుల్లో యాత్రను పూర్తి చేసుకోవచ్చు. ఈ దారి బాగా ఎత్తుగా, కఠినంగా ఉంటుంది. ఈ మార్గంలో వెళ్లేవారు గందర్భల్ జిల్లాలో ఉన్న బాల్టాల్‌లో బేస్ క్యాంప్‌లో వనతి కోసం ప్రయత్నించవచ్చు.
- పహల్గామ్తో పోల్చితే బాల్టాల్ నుంచి అమర్నాథ్కు గుహాలయానికి మధ్య ఉన్న దూరం చాలా తక్కువ. కానీ ప్రయాణం కూడా అంతే కష్టం. శారీరకంగా ఫిట్‌గా ఉన్న వాళ్లు ఈ దారిని ఎంచుకుంటారు.
- సో మీకు మీ ఫిట్‌నెస్‌పై నమ్మకం ఉంటే లేదా టైమ్ తక్కువగా ఉంటే ఈ దారిని ఎంచుకోవచ్చు.
- ఇక నీల్గ్రత్ నుంచి పంజ్‌తర్ని (Neelgrath to Panjtarni) మధ్యలో హెలికాప్టర్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. కావాలంటే అది కూడా ట్రై చేయవచ్చు.

పహల్గామ్ దారి | Pahalgam To Amarnath Caves Route
అనంత్‌నాగ్ జిల్లాల్లో ఉన్న పహల్గామ్ నుంచి అమర్నాథ్ గుహాలయం సుమారు 36 నుంచి 48 కిమీ దూరంలో ఉంటుంది. బాల్టాల్తో పోల్చితే దూరం ఎక్కువే అయినా వెళ్లే దారి అంత కఠినంగా ఉండదు. దూరం ఎక్కవ అవడం వల్ల ఈ దారిలో యాత్ర పూర్తి చేసేందుకు 3 నుంచి 5 రోజుల సమయం కూడా పట్టవచ్చు. భక్తుల కోసం పహల్గామ్లో బేస్‌క్యాంప్స్ అందుబాటులో ఉంటాయి.
యాత్రకు పట్టే సమయం ఎక్కువ అయినా చాలా మంది ఈ దారిలో వెళ్లేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే వెళ్లే దారిలో ఉండే పచ్చదనం, లోయల అందాలు నేచర్ లవర్స్‌ను కట్టిపడేస్తాయి. దారి పొడవునా ఉండే పైన్ వృక్షాలు చూస్తూ నడుస్తోంటే స్వర్గంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
అందుకే చాలా మంది ఈ దారిలోనే వెళ్లడానికి ఇష్టపడుంటారు. ఆధ్యాత్మిక అనుభవంతో పాటు ప్రశాంతంగా యాత్రను కూడా ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఈ రూట్ బాగా సెట్ అవుతుంది.
ముందస్తు రిజిస్ట్రేషన్ | Required Permits and Registration
ప్రతీ సంవత్సరం అమర్నాథ్ యాత్రకే వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారికి మెరుగైన సదుపాయాల కల్పన కోసం, ఆరోగ్య పరిస్థితులు వంటి వివరాలు తెలుసుకోనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ తప్పనిసరి చేశారు.
- యాత్రకు వెళ్లాలి అనుకునే భక్తులు శ్రీ అమర్నాథ్ ష్రైన్ బోర్డు పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
- మీకు దగ్గర్లో ఉన్న జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకు, పంజాబ్ నేషన్ బ్యాంక్, స్టేష్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ బ్యాంక్ వంటి ఆథరైజ్డ్ బ్యాంకులో కూడా మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
దీని కోసం మీరు కొన్ని డాక్యుమెంట్స్‌ను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్య పరిస్థితిని తెలిపే కంపల్సరీ హెల్త్ సర్టిఫికెట్ (CHC) తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఐడీ ప్రూఫ్, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అవసరం అవుతాయి.
మీ వివరాలు, దరఖాస్తును వెరిఫై చేసిన తరువాత మీకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగులు (RFID Tags) జారీ చేస్తారు. మీ భద్రత కోసం అందించే ఈ ట్యాగులను మీరు యాత్ర పూర్తి చేసేంత వరకు కూడా ధరించాల్సి ఉంటుంది.
వీరిని అనుమతించరు
ఇక ఈ యాత్రకు 13 ఏళ్ల లోపు పిల్లలను 70 ఏళ్లు పైబడిన పెద్దలను అనుమతించరు. అలాగే 6 వారాలు పైగా గర్భంతో ఉన్న మహిళలకు కూడా అనుమతి లేదు.
ఏం తీసుకెళ్లాలి ? | Amarnath Yatra Packing Tips
అందమైన కాశ్మీరు లోయల గుండా సాగే ఈ యాత్ర ఎంత అందంగా ఉంటుందో….అందే కఠినంగా (మీరు ఎంచుకున్న మార్గాన్ని బట్టి) కూడా ఉంటుంది. అందుకే ముందుస్తుగా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
- మీ లగేజీలో చలి దుస్తువులు (వులెన్ స్వెటర్స్ లాంటివి), థెర్మల్ ఇన్నర్స్, గ్లవ్స్, మఫ్లర్, వులెన్ క్యాప్ మర్చిపోకండి.
- కొండ ప్రాంతాల్లో వాతావరణం క్షణాల్లో మారిపోతుంది. వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు. అందుకే వాటర్‌ఫ్రూఫ్ జాకెట్స్ తీసుకెళ్లండి.
- ట్రెక్కింగ్ కోసం : మంచి గ్రిప్ ఉన్న ట్రెక్కింగ్ షూతో పాటు చేతికర్ర తీసుకెళ్లండి. ఇవి మీకు లోకల్‌గా కూడా లభిస్తాయి.
- ఒక మంచి బ్యాక్ ప్యాక్ ( వీపునకు వేసుకునే బ్యాగు ) తీసుకెళ్లండి. ఈ బ్యాగుకు రెయిన్ కవర్ ఉండేలా చూసుకోండి.
- వ్యక్తిగత వస్తువులు | Personal items : యాత్ర పొడవునా మీరు నీరు తాగాల్సి ఉంటుంది. అయితే మరీ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా తాగాల్సి ఉంటుంది. అందుకే మీకు ఒక మంచి బాటిల్ అవసరం అవుతుంది.
- దీంతో పాటు ఎనర్జీ కోసం ఎనర్జీ బార్స్ ( ఛాకొలెట్స్), డ్రైఫ్రూట్స్ ఉంటే చాలా యూజ్ అవుతుంది.
- 2025 Amarnath Yatra Guide : అలాగే ఈ యాత్రకు బయల్దేరే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. ఆయన సూచించిన మందులను మీతో పాటు తీసుకెళ్లండి.
- ఇక సబ్బులు, బ్రష్షు, పేస్టు, టవల్స్ వంటివి వీలైనంత తేలికగా చిన్నగా లేదా సన్నగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే వాటిని మీరో లేదా కంచెర గాడిదో ( వీటిని ఖచ్చర్ అంటారు.గాడిదకు ఎక్కువ గుర్రానికి తక్కువ అన్నట్టు ఉంటాయి) మోయాల్సి ఉంటుంది.
- మీ యాత్ర సమయంలో మీతో పాటు యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ స్లిప్, ఫోటో ఐడి, మెడికల్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు సైజు ఫోటో నిత్యం క్యారీ చేయండి.
ఆరోగ్య పరమైన జాగ్రత్తలు | Amarnath Yatra Health Tips
ఎత్తైన మహా పర్వతాలు, లోయల గుండా ఈ యాత్ర సాగుతుంది. అంత ఎత్తైన వాతావరణానికి ముందు కాస్త మనం అలవాటు పడాలి. దీనినే ఎక్లిమటైజేషన్ (Acclimatization) అంటారు. అందుకే ఒక రోజు బేస్ క్యాంపులో సమయం గడపండి. అలాగే యాత్ర సమయంలో స్మోకింగ్, లిక్కర్ ఎవాయిడ్ చేయండి.
ట్రెక్కింగ్ ఎలా చేయాలి ? | Amarnath Yatra Trekking Tips
బేస్ క్యాంప్ నుంచి ట్రెక్కింగ్ చేస్తూ 12 వేల అడుగుల ఎత్తుకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో లేదా ట్రెక్కింగ్ ఎంత ప్రశాంతంగా చేస్తే అంత మంచిది. మీ ఎనర్జీని ఒక్కసారిగా ఖర్చు చేయకుండా పొదుపుగా ఖర్చు చేస్తూ మెల్లిమెల్లిగా అడుగులు ముందుకు వేయండి.
- మధ్య మధ్యలో 20-30 సెకన్ల బ్రేక్ తీసుకుని గుక్కెడు నీళ్లు తాగవచ్చు. అయితే ఆయాసం వస్తుంటే శ్వాస ప్రక్రియ నార్మల్ అయ్యే వరకు ఆగి నీళ్లు తాగవచ్చు. కానీ ఒకేసారి ఎక్కువ నీరు తాగవద్దు.
- మీకు ఆయాసం ఎక్కువైనా, మత్తుగా, తల తిరిగినట్టు అనిపించినా ఆరోగ్యం తేడా అనిపిస్తే దగ్గరల్లో ఉన్న మెడికల్ క్యాంప్‌నకు వెళ్లండి.
- ట్రెక్కింగ్‌లో బ్రేక్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి. ప్రయాణికుడు య్యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన ఈ షార్ట్ చూడండి.
యాత్రికుల కోసం దారిపొడవునా వైద్య సదుపాయం | Amarnath Medical Camps
మహా శివుడి (Lord Shiva) మంచు లింగాన్ని దర్శించుకునే భక్తుల కోసం అన్ని మార్గాల్లో దారి పొడవునా వైద్య సదుపాయాలు కల్పించారు. అన్ని మెడికల్ క్యాంపుల్లో ఎమర్జెన్సీ సేవలు, మందులు ఉంటాయి. వైద్యులు అందుబాటులో ఉంటారు. వైద్య పరమైన అత్యవసర పరిస్థితిలో తరలించేందుకు హెలికాప్టర్ సేవలను కూడా అందిస్తారు.
ఎంత ఖర్చు అవుతుంది | Amarnath Yatra Budget and Tips
అమర్నాథ్ యాత్రకు బయల్దేరే ముందు ఖర్చు గురించి కనీస అవగాహన బాగుంటుంది. అందుకే ఒక అవగాహన కోసం అందించే బడ్జెట్ ఇది.
- రిజిస్ట్రేషన్ లేదా పర్మింట్ల కోసం రూ.200 లోపే ఖర్చు అవుతుంది.
- ఒక వేళ మీరు జమ్మూ నుంచి మీ బేస్ క్యాంప్ వెళ్లే దారిలో షేర్డ్ ట్యాక్సీలో ప్రయాణిస్తే దానికి ప్రతీ వ్యక్తికి రూ.1,000 నుంచి 2,000 వరకు ఖర్చు అవుతుంది.
- హెలికాప్టర్ సేవలు వినియోగించుకోవాలి అనుకుంటే వన్ వే కోసం రూ.4,500 నుంచి 5,500 వరకు ఖర్చు అవుతుంది.
వసతి కోసం అయ్యే ఖర్చులు | Accommodation & Budget
అమర్నాథ్ యాత్రలో వివిధ రకాల వసతి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. మీ బడ్జెట్‌ను బట్టి ఏదైనా ఎంచుకోవచ్చు.
బాల్టాల్, పహల్గామ్లో టెంటులో ఉండాలి అనుకుంటే రూ.300 నుంచి 1,200 వరకు ఖర్చు అవుతుంది. ఇందులో కామన్ షేరింగ్ బెడ్, లైట్, దుప్పట్లు, మొబైల్ చార్జ్ చేసుకునే సదుపాయం కల్పిస్తారు. కామన్ వాష్‌రూమ్స్ టెంట్ బయట అందుబాటులో ఉంటాయి.
- సౌకర్యవంతమైన వసతి కోసం ప్రైవేట్ గెస్ట్‌హౌజులు, హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు వెళ్లాలి అని నిర్ణయించుకున్న వెంటనే ముందు హోటల్ బుకింగ్ కోసం ట్రై చేయండి.
- ఇది కూడా చదవండి : చార్ ధామ్ యాత్రికుల కోసం ఐఆర్సీటీసి డీలక్స్ ప్యాకేజ్…ఎంత? ఎన్నిరోజులు ? ఎప్పుడు ? ఎలా ? | IRCTC Tourism
- ఇది కూడా చదవండి : ఛార్ ధామ్ యాత్ర కోసం ఐఆర్సీటీసి స్పెషల్ టూరిస్టు ట్రైన్ | IRCTC Char Dham Yatra 2025
ఉచిత భోజనం, సదుపాయం | Free Food & Stay
ఎలాంటి ఖర్చు చేయకుండా రెస్ట్ తీసుకోవాలి అంటే మీరు గురుద్వారాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోండది. అక్కడ మీకోసం లంగర్స్ (Langar near amarnath) అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మీరు భోజనం చేయడంతో పాటు అవకాశం ఉంటే విశ్రాంతి కూడా తీసుకోవచ్చు.
గురుద్వారలకు వెళ్తే ఎలా ప్రవర్తించాలో గతంలో ఒక షార్ట్‌లో వివరించాను. చిన్నదే కానీ మీకు బాగా ఉపయోగపడుతుంది… చూడండి
- మొత్తానికి ఈ యాత్రకు ఎంత ఖర్చు అవుతుంది అనేది మీ లైఫ్‌స్టైల్ లేదా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది.
షేరింగ్ రూమ్స్‌లో ఉంటూ షేర్డ్ ట్యాక్సీలో ప్రయాణిస్తూ లంగర్స్లో తింటూ అక్కడే విశ్రాంతి సదుపాయం లభిస్తే అది వినియోగించుకొంటే, బడ్జెట్ పద్మానాభంలో ఖర్చు చేస్తే మీకు మినిమం రూ.7 వేల నుంచి రూ.16 వేల వరకు బడ్జెట్ అవుతుంది.
అదే రాజా సాబ్లా ఖర్చు చేస్తే మాత్రం మీ బడ్జెట్ రూ.25,000 కూడా దాటొచ్చు.
ఈ విషయాలు గుర్తుంచుకోండి | Amarnath Yatra Do’s and Don’ts
అయర్నాథ్ యాత్ర అనేది అత్యంత కఠినమైన పర్వత శ్రేణుల్లో సాగే యాత్ర. అందుకే ఇక్కడ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
- మీతో పాటు తీసుకెళ్లే చెత్తను ఎక్కడ అంటే అక్కడ పడేయకండి. చెత్త బుట్టల్లో పడేయండి.
- 2025 Amarnath Yatra Guide : అధికారులు జారీ చేసే పత్రాలను, ఐడీ కార్డును నిత్యం మీ వద్ద ఉంచుకోండి.
- యాత్రా మార్గంలో అధికారులు, భద్రతా సిబ్బంది చెప్పే విషయాలను తప్పుకుండా గుర్తుంచుకోండి. వాటిన పాటించండి.
- ఎవరూ వెళ్లని మార్గాల్లో వెళ్లకండి. నలుగురితో పాటు కలిసి వెళ్లండి. షార్ట్‌కట్స్ ప్రయత్నించకండి.
- పైన చెప్పిన విషయాలను గుర్తుంచుకోండి.
- నిత్యం శివన్నామ స్మరణ చేయండి.
- ఇది కూడా చదవండి : కైలాష్ మానసరోవర యాత్ర ఎలా వెళ్లాలి ? ఎంత ఖర్చు అవుతుంది ? ఎన్ని .. | Kailash Mansarovar Yatra 2025
📢 మీకు తెలిసిన వారు ఎవరైనా ఫస్ట్ టైమ్ అమర్నాథ్ యాత్రకు వెళ్తుంటే ఈ లింకు వారితో షేర్ చేయడి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.