58 Visa Free Countries : ఈ 58 దేశాలకు వెళ్లేందుకు భారతీయులకు వీసా అవసరం లేదు
58 Visa Free Countries ప్రపంచ యాత్రికులు పెరుగుతున్నారు. రోజుకో కోలంబస్, ఒక వాస్కోడా గామా పుట్టుకొస్తున్నారు. మరి ఇలాంటి ఫాస్ట్ ట్రావెల్ సమయంలో వీసాలు, పర్మిషన్లు, క్రీమ్ బన్లు, బన్ మస్కాలు అని రోడ్ బ్లాక్స్ పెడితే టూరిజంకు దెబ్బ పడుతుంది.
ఈ విషయం గమనించి ప్రపంచంలోని అనేక దేశాలు వీసాల విషయంలో అనేక సడలింపులు చేశాయి. తమకు పనికి వచ్చే దేశాలు, సేఫ్ అండ్ ఆర్థికంగా డెవెలెప్ అవుతున్న, లేదా అయిన దేశాలు, ప్రపంచంలో మంచి పేరు పలుకుబడి ఉండి తమతో ఆర్థిక ఇతర లావాదేవీలు, సత్సంబంధాలు ఉన్న దేశాల ప్రజలకు వీసా ఫ్రీ (Visa Free ) లేదా వీసా ఆన్ అరైవల్ (Visa On Arrival) సదుపాయాలు కల్పిస్తున్నాయి.
ముఖ్యాంశాలు
ఇక మన దేశం విషయానికి వస్తే ప్రపంచంలో మన దేశ పాస్‌పోర్టుకు మెల్లిమెల్లిగా పవర్ (India Passport Index) పెరుగుతోంది. అందుకే ప్రస్తుతం మనకు ఈ 58 దేశాలకు వీసా లేకుండా లేదా ఆన్ అరైవల్ వీసాతో వెళ్లగలిగే వెసులుబాటు కలిగింది.
మీరు చేయాల్సిందల్లా బ్యాగులు ప్యాక్ చేసుసుకోడం టికెట్ బుక్ చేసుకొని వెళ్లిపోవడమే. సింపుల్ కదా…మరి ఆ దేశాలేవో తెలుసుకుందామా ?
ఆసియా ఖండం | Visa Free Asian Countries For Indians
ఆసియా ఖండంలో భారత్ అంటే ఒక ఇది. ఒక అది. మనల్ని ఎవడ్రా అపేది అన్నట్టు ఉంటుంది మన లెక్క. అందుకే కొన్ని దేశాలకు మనం అత్తారింటికి , ఫ్రెండ్ ఇంటికి వెళ్లినట్టు వెళ్లిపోవచ్చు. అఫ్కోర్స్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే పాస్‌పోర్టు, డాక్యుమెంట్స్ అవసరం పడదు. కానీ ఏ దేశానికి వెళ్లాలన్నా భారతీయ పాస్‌పోర్టు, బుకింగ్ ఇతర డాక్యుమెంట్స్ ఉండాలి. అందులో డిస్కౌంట్ లేదు.
ఇక ఆసియాలో మనం భూటాన్ (Bhutan), కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మకావ్ (ఎస్ఏఆర్ చైనా), మలేషియా…
- ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

- మాల్దీవ్స్
- మయన్మార్
- నేపాల్
- శ్రీలంకా
- థాయ్‌లాండ్
- ఇది కూడా చదవండి: Thailand : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?

- టిమోర్ లెసె (Timor – Leste) వెళ్లేందుకు ముందస్తు వీసా అవసరం లేదు.
ఇక మిడిల్ ఈస్ట్ దేశాల విషయానికి వస్తే ఇరాన్, జోర్డాన్, ఖతార్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఆఫ్రికా | Visa Free African Countries For Indians
ఆఫ్రికాలో చాలా దేశాల్లో ప్రజలకు భారత్ అంటే చాలా గౌరవం. ఎందుకంటే మనం వారికి అనేక సమయాల్లో, ఇబ్బందులో అండగా నిలిచాం. ఇక వీసా ఫ్రీ లేదా ఆన్ ఎరైవల్ వీసా విషయానికి వస్తే…
కేప్ వెర్డే ఐలాండ్స్ (Cape Verde Islands), కొమోరో ఐలాండ్స్, , ఇథోపియా, గినియా బిసౌ (Guinea Bissau), కేన్యా, మడగాస్కర్, మోజాంబిక్, రవాండ (Rwanda), సెనిగల్, సీచెల్స్( Seychelles), సియారా లియోన్ (Sierra Leone), సోమాలియా, టాంజానియా, జింబాబ్వే అంగోలా (Angola), బురుండి (Burundi) , జిబౌటి (Djibouti), నమీబియా (Namibia) దేశాలు ఉన్నాయి.
టాపిక్‌కి చిన్న బ్రేక్ ఇచ్చి…ముందు ఇది చదవండి
ఇందులో సొమాలియా వాళ్లు ఫ్రీగా రమ్మన్నా వెళ్లకండి. వెళ్తే తిరిగొస్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే అది చాలా హింసాత్మక దేశంగా మారింది. సొమాలియా సముద్రపు దొంగలు (Somalian Pirates) అని వినే ఉంటారు.

ఇది నా పాండిత్యం కాదు.సోమాలియా చరిత్ర తెలిసి చెప్పాను. మీరు కూడా సోమాలియా సముద్రపు దొంగల గురించి తెలుసుకోవాలి అనుకుంటే యూకే, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ దేశ ప్రజలకు సోమాలియా దేశాల గురించి జారీ చేసిన హెచ్చరికల గురించి చదవండి (లింకులు కూడా ఇచ్చాను)
ఇలా సోమాలియాలాంటి భయంకరమైన, అసలు వెళ్లకూడని దేశాలేంటో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవండి. సో, పొరపాటున కూడా ఈ దేశాలకు వెళ్లకండి…
- ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ఒక ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే ప్రపంచ యుద్ధాలు వచ్చినా సేఫ్‌గా ఉండే కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్లండి..ఆ దేశాలు ఇవే…
- ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
వెల్కం బ్యాక్ టు టాపిక్…
ఐరోపా (Europe) విషయానికి వస్తే అక్కడ షెంజెన్ వీసా ఉంటే అనేక ఐరోపా దేశాలకు వెళ్లగలం. కానీ ట్రాన్స్‌కాంటినెంటల్ దేశమైన కజకిస్తాన్‌కు ( Kazakhstan) వెళ్లేందుకు మీకు వీసా అవసరం లేదు. ఈ దేశం ఐరోపా, ఆసియా రెండింటిలోనూ భాగం.
- ఇది కూడా చదవండి : Honeymoon : వీసా అవసరం లేకుండా ఈ ఏడు దేశాల్లో హనీమూన్‌కు వెళ్లొచ్చు.
కరేబియ్ దేశాలు Visa Free Carrabin Countries For Indians
జల్సాలకు, విలాసాలకు కరీబియన్ దీవులకు (Carrabin Countries) మంచి పేరుంది. అందుకే భారతీయులు చాలా మంది ఈ దేశాలకు వెళ్తుంటారు. వీటిలో కొన్ని దేశాలు వెళ్లేందుకు మనకు వీసా అడ్డంకి కాదు.
అవి :
బార్బడోస్ (Barbados), బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, డోమినికా, గ్రెనెడా, హైటి, జమైకా, మాంట్సెరాట్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో.
వీటితో పాటు ఓషేనియా దేశాల్లో కొన్ని దేశాలు అంటే మన ఆస్ట్రేలియా (Australia), మన న్యూజిలాండ్ (New Zealand) పక్కనే ఉన్న కొన్ని దేశాలకు వెళ్లేందుకు వీసా అవసరం లేదు. లేదంటే లేదని కాదు. కొన్ని దేశాల్లో అక్కడికి వెళ్లి తీసుకోవచ్చు.
ఆ దేశాలు వచ్చేసి కుక్ ఐలాండ్స్, ఫిజి (Fiji), కిరిబాటి, మార్షల్స్ ఐల్యాండ్స్. మేక్రోనేషియా, నియూ, పలౌ ఐలాండ్స్, సమోవా, టువాలు, వనాటు (Vanuatu)
- ఇది కూడా చదవండి : Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
మరి అమెకాస్లో (Americas) ఒకే ఒక దేశానికి మనం వీసా లేకుండా వెళ్లగలం అదే బొలివియా (Bolivia)
గుర్తుంచుకోండి…| 58 Visa Free Countries
పైన జాబితాలో ప్రస్తావించిన కొన్ని దేశాలకు మీరు వెళ్లినప్పుడు రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ లేదా బ్యాంక్ బ్యాలెన్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగే అవకాశం ఉంది. అందుకే వీటిని మీరు నిత్యం మీతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది. అందుకే వెళ్లే ముందు ఆ దేశం వీసా పాలిసి ఏంటో తెలుసుకోండి.
ఇక కొన్ని దేశాల్లో ఆరోగ్య భీమా (Health Insurance) లేదా వాక్సినేషన్ అవసరం ఉండవచ్చు. అవేంటో తెలుసుకోవాలి అంటే ఆ దేశం వీసా పాలసీ ఏంటో తెలుసుకోవడం ముఖ్యం. సో అత్తారింటికి వెళ్లినట్టే కొంచెం ప్రిపేర్డ్‌గా వెళ్లండి. ఎంట్రీ ఫ్రీ కాని కొంచెం ప్రిపర్ అవ్వడం, ఎగ్జిట్ ప్లాన్‌తో వెళ్లడం ముఖ్యం అన్నమాట.
Sources: Public news reports and official passport index data, US, UK, Australia Travel Advisories Mentioned With Sources.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.