Vietnam cab viral video : వియత్నాం క్యాబ్ వివాదం… వైరల్ వీడియో వెనుక ఏం జరిగింది?
Vietnam Cab Viral Video : వియత్నాంలో జరిగిందని చెబుతున్న ఒక క్యాబ్ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
ట్విట్టర్ (X), ఇన్స్టాగ్రామ్ అండ్ ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వియత్నాం క్యాబ్ డ్రైవర్ ఒక ఇండియన్ టూరిస్ట్ క్యాబ్ ఫేర్ చెల్లించకుండా వెళ్లిపోయాడని ఆరోపించాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్ల మధ్య చర్చలు మొదలయ్యాయి.
డ్రైవర్ ఏమన్నాడు…| Vietnam Cab Viral Video
నిజానికి డ్రైవర్ ఏమన్నాడో మనకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే అతను ఆ వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. మన దేశంలో టిక్‌టాక్ బ్యాన్ అయిన విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో, అందుబాటులో ఉన్న కథనాల ప్రకారం భారతీయ ప్రయాణికుడు అయిన గౌరవ్ అగర్వాల్ (Gaurav Agarwal) తన గమ్యస్థానానికి చేరుకున్న తరువాత క్యాబ్ డ్రైవర్‌కు డబ్బు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడనేది సారాంశం.
దీని వల్ల తాను నష్టపోయానని, ఇలాంటి సంఘటనల వల్ల ఇతర ప్రయాణికులను కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆ డ్రైవర్ పేర్కొన్నట్లు వైరల్ పోస్టుల్లో కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది.
గౌరవ్ వర్షన్ | Gaurav Aggarwal Version
వీడియో వైరల్ అయిన తరువాత గౌరవ్ అగర్వాల్ కూడా తన వర్షన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన వివరణ ప్రకారం, ఎయిర్పోర్ట్ టెర్మినల్ వద్ద ఉన్న ఒక పార్సిల్ తీసుకునేందుకు తనకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఉందని, ఎయిర్పోర్ట్ బయట సుమారు 550 మీటర్ల దూరంలో ఉన్న క్యాబ్ డ్రైవర్‌ను టెర్మినల్ వరకు తీసుకెళ్లాలని సాయం కోరినట్లు తెలిపాడు.
ఈ ప్రయాణంలో తాను వియత్నాం కరెన్సీ కాకుండా కేవలం క్రెడిట్ కార్డ్ మాత్రమే ఉపయోగించానని, సదరు డ్రైవర్‌కు తన వద్ద లోకల్ క్యాష్ లేదని ముందే చెప్పి, సహాయం చేయాలని మాత్రమే కోరానని తెలిపాడు. అయితే తరువాత డ్రైవర్ క్యాష్ అడిగాడని వివరించాడు.
ఎయిర్పోర్ట్ చేరుకున్న తరువాత తన వద్ద లోకల్ క్యాష్ లేకపోవడం, ఫ్లైట్ సమయం దగ్గర పడటం వల్ల వెంటనే పేమెంట్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని వివరించాడు. డ్రైవర్‌ను మోసం చేయాలనే ఉద్దేశం తనకు లేదని, తాను కేవలం సహాయం మాత్రమే కోరానని గౌరవ్ చెప్పాడు.
సారీ చెప్పిన గౌరవ్ | Vietnam Cab Incident
వియత్నాం క్యాబ్ డ్రైవర్ వీడియో భారతీయ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. చాలా మంది భారతీయులు తమ పరువు తీశారని గౌరవ్‌ను విమర్శించారు. దీనిని గమనించిన గౌరవ్ తన వివరణ ఇవ్వడంతో పాటు, ఈ ఘటన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని కోరాడు. విషయం ఇంత పెద్ద వివాదంగా మారుతుందని తాను ఊహించలేదని చెప్పాడు.
గౌరవ్ వీడియోను చూడండి…
రెండు వైపుల వాదనలు…
ప్రస్తుతం సోషల్ మీడియాలో వియత్నాం డ్రైవర్ వర్షన్‌తో పాటు గౌరవ్ తన వీడియో ద్వారా చెప్పిన వర్షన్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ ఘటనపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదా దర్యాప్తు వివరాలు వెలువడలేదు. అందుకే సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఒక నిర్ణయానికి రావడం కంటే, పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకు వేచి చూడటం ఉత్తమం.
ఈ వివాదం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు | Rules When Visiting Another Country
విదేశాలకు వెళ్లినప్పుడు పేమెంట్స్, లోకల్ రూల్స్, కమ్యూనికేషన్ విషయాల్లో క్లారిటీ ఉండటం చాలా ముఖ్యం. అదే సమయంలో ఒక్క వ్యక్తిపై వచ్చిన ఆరోపణల ఆధారంగా మొత్తం భారతీయ ప్రయాణికులను జడ్జ్ చేయడం కూడా సరికాదు.
ప్రతి దేశంలో మంచి, చెడు అనుభవాలు రెండూ ఉంటాయి. ట్రావెల్ అంటే కేవలం కొత్త ప్రదేశాలు చూడటం మాత్రమే కాదు… మన ప్రవర్తనతో మన దేశానికి మంచి పేరు తీసుకురావడం కూడా అంతే ముఖ్యమే.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
