Tirumala Brahmotsavam 2026: సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పూర్తి షెడ్యూల్, గరుడ సేవ ఎప్పుడు?
Tirumala Brahmotsavam 2026 : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు భక్తి వైభవం, దివ్య వాహన సేవల షెడ్యూల్తో పాటు స్వామివారి భక్తులకు సూచనలు ఈ బ్లాగ్లో..
తిరుమల , హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ఈ పుణ్య క్షేత్రంలో ప్రతీ సంవత్సరం జరిగే ఈ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు లక్షలాది మంది భక్తులు చూస్తుంటారు. ఈ మహోత్సవాలలో శ్రీవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తారు.
2026లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Salakatla Brahmostavalu 2026) సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. సెప్టెంబర్ 14న సాయంత్రం అంకురార్పణతో ఉత్సవ వైభవం ప్రారంభమవుతుంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం జరిగే వాహన సేవలు ఈ ఉత్సవాల ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
- ఇది కూడా చదవండి : తిరుమలలో దర్శనాలు ఎన్ని రకాలు ? ఏ టికెట్లు బుక్ చేసుకుంటే దర్శనం వేగంగా అవుతుంది | Tirumala Darshan Guide
వాహన సేవ షెడ్యూల్ | Vahana Sevala Schedule
- సెప్టెంబర్ 15: ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహనం
- సెప్టెంబర్ 16: చిన్న శేష వాహనం, స్నపన తిరుమంజనం, హంస వాహనం
- సెప్టెంబర్ 17: సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం
- సెప్టెంబర్ 18: కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం
- సెప్టెంబర్ 19: మోహినీ అవతారం, గరుడ వాహనం (అత్యంత ప్రాముఖ్యమైన సేవ)
- సెప్టెంబర్ 20: హనుమంత వాహనం, స్వర్ణ రథం, గజ వాహనం
- సెప్టెంబర్ 21: సూర్యప్రభ వాహనం, స్నపన తిరుమంజనం, చంద్రప్రభ వాహనం
- సెప్టెంబర్ 22: రథోత్సవం, అశ్వ వాహనం
- సెప్టెంబర్ 23: చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం లాంటి సేవల్లో పాల్గొనడానికి, వీక్షించడానికి భక్తులు దూరదూరం నుంచి వస్తుంటారు. ఈ రోజుల్లో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత గంభీరంగా ఉంటుంది.
- ఇది కూడా చదవండి : ఒకే రోజులో తిరుమల దర్శనం సాధ్యమా? తాజా నియమాలు & పూర్తి గైడ్
ప్రయాణికుల కోసం చిన్న గమనిక | Tips For Tirumala Brahmostavalu
బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వసతి (Accommodation), దర్శనం టికెట్లు, ట్రాన్స్పోర్ట్ వంటి అంశాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. వాహన సేవలు ప్రారంభమయ్యే ముందే వేదిక (Venue) దగ్గరకు చేరితే ఉత్సవ వైభవాన్ని దగ్గరగా ఆస్వాదించవచ్చు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు. అది భక్తి, సంప్రదాయం, ఆలంకరణ, వైదిక సంస్కృతి, తిరుమల దివ్య మహిమను ప్రపంచానికి చూపించే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వేడుక. మీరు తిరుమల యాత్ర ప్లాన్ చేస్తుంటే ఈ మహోత్సవ కాలం మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
