Adani Airports : చైనా డ్రాగన్ పాస్‌తో భాగస్వామ్యం రద్దు చేసుకున్న అదానీ ఎయిర్పోర్ట్
చైనాకు చెందిన డ్రాగన్ పాస్‌తో అదానీ ఎయిర్‌పోర్టు (Adani Airports) భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది. డ్రాగన్ పాస్ అనేది అంతర్జాతీయంగా వివిధ ఎయిర్‌పోర్టుల్లో లాంజ్ (Airport Lounge) సదుపాయం కల్పిస్తుంది. అయితే ఈ సంస్థతో భాగస్వామ్యంలోకి ప్రవేశించి వారంలోపే పార్టనర్షిప్ రద్దు చేసినట్టు తెలిపింది అదానీ.
ఈ ప్రభావంతో దేశ వ్యాప్తంగా అదానీ నిర్వహించే ఎయిర్‌పోర్టు సేవలపై, ప్రయాణికులపై కాస్త ప్రభావం పడే అవకాశం ఉంది.
ముఖ్యాంశాలు
- ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
హఠాత్తుగా ఎందుకంటే ? | Adani Airports
దేశ వ్యాప్తంగా అదానీ సంస్థ కొన్ని ఎయిర్‌పోర్టులను (Adani Airport Holdings) నిర్వహిస్తుంది. ఇందులో ముంబై, అహ్మదాబాద్, లఖ్‌నవూ వంటి ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. డ్రాగన్ పాస్ ఉన్న వినియోగదారులు ఇకపై ఈ ఎయిర్‌పోర్టులతో పాటు అదానీ నిర్వహించే ఏ ఎయిర్పోర్టుల్లోనూ ఈ పాస్‌ను వినియోగించి లాంజ్ సర్వీసులను వాడుకోలేరు.
కేవలం డ్రాగన్ పాస్ ఉన్న వారిని మాత్రమే ఈ నిర్ణయం ప్రభావితం చేస్తుందని ఇతర ప్రోగ్రామ్స్ లేదా సభ్యత్వం ఉన్న వారిపై దీని ప్రభావం ఉండదని తెలిపింది సంస్థ.
ప్రయాణికులపై ప్రభావం
ఈ భాగస్వామ్యం వల్ల డ్రాగన్ పాస్ (Dragan Pass) ఉన్న ప్రయాణికులు అదాని ఎయిర్‌పోర్టుల్లోని లాంజ్‌లో విశ్రాంతి తీసుకునే అవకాశం లభిస్తుంది అని చాలా మంది భావించారు. పార్ట్నర్షిప్ రద్దు అవడంతో ఈ పాస్ ఉన్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ యాక్సెస్ ఆప్షన్స్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. డ్రాగన్ పాస్ లేనివారికి అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
డ్రాగన్ పాస్ గురించి | About DragonPass
డ్రాగన్ పాస్ అనేది చైనాకు (china) చెందిన అంతర్జాతీయ సంస్థ. 2005 లో ఏర్పాటైన ఈ సంస్థ వివిధ ఎయిర్‌పోర్టుల్లో లాంజ్ సర్వీస్‌తో పాటు ఇతర ట్రావెల్ సేవలు అందిస్తుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.