Gym In Afghanistan : ఆఫ్ఘనిస్తాన్‌లో జిమ్ ఎలా ఉంటుందో చూశారా ? 

షేర్ చేయండి

Gym In Afghanistan : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఆప్ఘనిస్తాన్ ఒకటి . తల నుంచి కాలి వరకు ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఏం చేయాలి కఠినమైన నియమాలు పెట్టి వాటిని పాటించేలా చేస్తుంది అక్కడి ప్రభుత్వం. 

మహిళలు చదవుకోరాదు, బయటికి రాకూడదు, మగవాళ్లు అందరూ గెడ్డం పెంచుకోవాలి, పాశ్చాత్యం సంగీతం, సినిమా సంగీతం వినకూడదు అనే ఇంకా వెయ్యి నూటా పదహారు నియమాలు ఉన్నాయి. 

మరి ఇలాంటి కంట్రోల్డ్ కంట్రీలో లైఫ్ ఎలా ఉంటుంది ? అక్కడి ప్రజలు ఎలా ఉంటారు ? అక్కడి జిమ్ ఎలా ఉంటుంది ? జిమ్‌లో మ్యూజిక్ ఉంటుందా అనేది అక్కడికి వెళ్లి తెలుసుకుని బయటి ప్రపంచంతో షేర్ చేశాడు అమెరికాకు చెందిన నిక్ మాడోక్ అనే వ్లాగర్ (Travel Vlogger).

ఆఫ్ఘనిస్తాన్‌లోని మజార్ ఈ షరీఫ్ (Mazar-i-sharif) అనే ప్రాంతంలో ఉన్న లోకల్ జిమ్‌‌కు వెళ్లి అక్కడ తను ఏం గమనించాడో వీడియోతో  వివరించాడు.

నిషేదంలో వినోదం | Music in Afghan Gym

gym in afghanistan
Image Courtesy : nickmaddock/instagram

ఈ జిమ్‌లో నిక్‌ను (Nick Maddock) బాగా సర్‌ప్రైజ్ చేసిన విషయం సంగీతం. ఆప్ఘన్‌లో పబ్లిక్ పబ్లిక్‌లో సంగీతం బ్యాన్ చేశారు. కానీ జిమ్‌లో మాత్రం మంచి సౌండ్‌తో పాటలు ప్లే చేస్తుండటం అతనికి విచిత్రంగా అనిపించింది. 

మగాళ్లకు మాత్రమే | Gym In Afghanistan

మహిళలు జిమ్ముకు, పార్కులకు, స్కూళ్లకు వెళ్లడాన్ని ఆఫ్థనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం (Taliban Govt) బ్యాన్ చేసింది. అందుకే అతనికి జిమ్‌లో కేవలం పురుషులు మాత్రమే కనిపించారు. మహిళల మాత్రం కనపించలేదట.

తాలిబన్ల రాజ్యం | Rule of Taliban

తాలిబన్ల రాజ్యంలో బార్లు లేవు, ఆల్కహాల్ బ్యాన్ చేశారు కాబట్టి నలుగురు కలుసుకునే అరుదైన ప్రదేశాల్లో జిమ్ కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఇక్కడే చాలా మంది ప్రెండ్స్ కలిసి వర్కవుట్స్ చేస్తుంటారని తెలిపాడు నిక్. తను అందరిలో డిఫరెంట‌్‌గా కనిపిస్తున్నా స్థానికులు తనను ఆప్యాయంగా పలకరించారు అని, ప్రేమతో మాట్లాడారు అని తెలిపాడు నిక్. 

స్థానికులు తనతో ఇంగ్లిష్‌లో మాట్లాడటానికి ప్రయత్నించారని తమతో పాటు కలిసి వర్కవుట్ చేయమని ఇన్వైట్ చేశారని తెలిపాడు. దీన్ని బట్టి ఫిట్నెస్ (Fitness) అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అని తను భావిస్తున్నట్టు తెలిపాడు.

Feature Image Courtesy : nickmaddock/instagram

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!