భారత్‌లో వెలిసిన మంచు స్వర్గం గుల్మార్గ్ పూర్తి ట్రావెల్ గైడ్ | Gulmarg Complete Travel Guide
Gulmarg Complete Travel Guide : కశ్మీర్ స్వర్గం అయితే దానికి గుల్మార్గ్ రాజధాని లాంటి. గుల్మార్గ్ ఎలా వెళ్లాలి ? ఎప్పుడు వెళ్లాలి ? యాక్టివిటీస్, ఫుడ్ గైడ్, రియాలిటీ చెక్ అన్ని కలిపి ఒక కంప్లీట్ గైడ్.
గుల్మార్గ్ అనేది జస్ట్ చూసి వచ్చేయాలి అనే డెస్టినేషన్ కాదు. ఇది స్లోగా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన ప్రదేశం. ఇక్కడ టైమ్ వేగంగా పరిగెత్తదు. ప్రతీ అడుగు, ప్రతీ శ్వాస, ప్రతీ చల్లగాలి టచ్ మనల్ని ఒక్క క్షణం ఆపి…మనం నిజంగా బతుకుతున్నామా ? అని అడుగుతుంది. అదే గుల్మార్గ్.
జనవరిలో కశ్మీర్ మంచు ప్రపంచంలా మారిపోతుంది. గుల్మార్గ్లో మంచు కురిసే వేళ… ప్రతీ క్షణం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. కశ్మీర్‌ను భూమిపై ఉన్న స్వర్గం అని పిలుస్తారు. గుల్మార్గ్ వెళ్తే మీరు కూడా అదే అంటారు. సముద్ర మట్టానికి సుమారు 8,800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం భువిపై వెలిసిన స్వర్గంలా ఉంటుంది.
మరీ ముఖ్యంగా చలికాలంలో ఇక్కడ ఎక్కడ చూసినా మంచు దుప్పటి పరుచుకుని ఉన్నట్టే అనిపిస్తుంది. సాహసమే జీవితంగా భావించే ప్రయాణికులకు, ప్రశాంతత కోసం వెతికే ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక అల్టిమేట్ డెస్టినేషన్.
ముఖ్యాంశాలు
గండోలా రైడ్ | Gulmarg Complete Travel Guide
గుల్మార్గ్లో గండోలా, అంటే రోప్‌వే, అనేది ప్రధాన ఆకర్షణ. ఆసియాలోనే అత్యంత ఎత్తైన గండోలా కూడా ఇదే. గండోలా ప్రయాణం రెండు దశల్లో ఉంటుంది.
Gulmarg Gandola Phase 1 : ఫేజ్ నెం.1 లో గుల్మార్గ్ నుంచి కాంగ్దూరి స్టేషన్ వరకు 8,530 అడుగుల ఎత్తులో గండోలాపై ప్రయాణం ఉంటుంది. ఇది పైన్ చెట్ల మధ్యలోంచి ఈ థ్రిల్లింగ్ రైడ్‌లా సాగుతుంది.

Gulmarg Gandola Phase 2: ఫేజ్ 2 లో కాంగ్దూరి స్టేషన్ నుంచి అఫర్వట్ పర్వతం వరకు 14,403 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తారు.12 నిమిషాల రైడ్‌లో గతంలో ఎప్పుడూ చూడనంత మంచును, మంచు పర్వతాలను వీక్షించవచ్చు.
- ఇది కూడా చదవండి : జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? భారత దేశ సంస్కృతిలో ప్రాధాన్యత ఏంటి ? | Jammu and Kashmir
ప్రతీ ఫ్రేమ్ ఒక పోస్ట్కార్డ్లా | Winters in Gulmarg
చలికాలానికి ముందు గుల్మార్గ్ ఒక అందమైన పువ్వుల లోయగా అలరిస్తుంది. చలికాలం వచ్చేసరికి మంచు ప్రపంచంలా మారిపోతుంది. చలికి డ్రంగ్ అనే జలపాతం గడ్డకట్టుకుపోవడం చూస్తే ప్రకృతి కాలాన్ని ఆపిందేమో, జలపాతాన్ని పాజ్ చేసిందేమో అనిపిస్తుంది.
Drung Frozen Falls near Tangmarg, Kashmir.Kashmir is a region located in the northern part of the Indian subcontinent. It is a land primarily characterized by mountainous terrain, situated between the Himalayas and the Pir Panjal range. pic.twitter.com/jA4TTc07Ih
— 🧚♀️Sisi 🦋🪂 (@SisiWilly_40) March 21, 2025
- తీవ్రమైన చలిలో ఇక్కడి పర్యాటక ప్రాంతాలన్నీ మంచు ప్రేమికులతో కిటకిటలాడుతాయి.
- ఇక ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి గుల్మార్గ్లో ప్రతీ ఫ్రేమ్ ఒక పోస్ట్కార్డ్లా కనిపిస్తుంది.
ఏం చూడాలి? | Places To Visit in Gulmarg
గుల్మార్గ్ వెళ్లినప్పుడు మీరు వద్దన్నా మీకు ఎన్నో అందమైన లొకేషన్లు కనిపిస్తాయి. అయితే అవకాశం ఉంటే…
- సెంట్ మేరీ చర్చ్ గోథిక్ శిల్పకళను
- అఫార్వత్ పర్వతంపై మంచు మకుటాన్ని
- చలికి మంచులా మారిన అల్ఫాథర్ సరస్సును
- ఫ్రీజ్ అయిన డ్రంగ్ జలపాతాన్ని
- దట్టమైన పైన్ చెట్ల వనాలు
స్థానిక గ్రామాలను, స్థానికుల జీవితాన్ని వెళ్లి చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
మంచు కురిసే వేళల్లో ఆకాశం నుంచి జారిపడే మల్లెపువ్వుల్లాంటి స్నో, దూరంగా పొగమంచులోంచి కనిపించి కనిపించనట్టు ఉండే పైన్ చెట్లు, పర్యాటకులు కనిపించగానే స్థానికుల కళ్లలో కనిపించే వెలుగు, కలపతో చేసిన ఇళ్లపై పలకలపై అక్షరాల్లా చేరుకున్న మంచు.. ఇవన్నీ వ్యక్తిగతంగా వెళ్లి చూసి ఫీల్ అవ్వాల్సిన అనుభవాలు.
ప్రయాణికుడు అనుభవం | Prayanikudu Experience
గుల్మార్గ్ ట్రిప్ అంటే టిక్ మార్క్ చేసుకునే చెక్ లిస్టు కాదు. గండోలా రైడ్ అయిపోయింది, ఫోటోలు తీశాము…ఇలా కాదు ఈ ట్రిప్ ఎంజాయ్ చేయడం అంటే. స్థానికులతో రెండు మాటలు, చిన్న టీ షాపుల్లో ఒక కప్ వేడి వేడి టీ తాగడం, స్నోలో అడుగుపెట్టినప్పుడు కలిగే అనుభూతి….ఇవే నిజమైన గుల్మార్గ్ వైబ్ ఇచ్చే అంశాలు. ఇవి కెమెరా కోసం బతికే క్షణాలు కావు…మెమోరీస్ సేకరణ కోసం బతికే క్షణాలు.
పొద్దున్నే కావా..మధ్యాహ్నం ఛాయ్ | Food And Drinks
కశ్మీర్ అనేది ఫుడ్ లవర్స్‌కు కూడా స్వర్గం లాంటిదే. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కశ్మీరీ కావా అనే ఫేమస్ గ్రీన్ టీని అస్సలు మిస్ అవ్వరు.
- స్థానిక కుంకుమపువ్వు
- నట్స్‌ను కలిపి సర్వ్ చేస్తారు
- రోగన్ జోష్, యాఖ్ని
- దమ్ ఆలూ ఇవి టేస్ట్ చేయకుండా పర్యాటకులు ఉండలేరు
అలాగే ఇక్కడ అడుగడుగునా చాట్, మ్యాగీ, వజ్వాన్ రుచులు అందుబాటులో ఉంటాయి. పొద్దున్నే కావా, మధ్యాహ్నం చాయ్ అనేది ఎక్కువ మంది టూరిస్టులు ట్రై చేసే కాంబినేషన్.
జీవితాంతం గుర్తుండే ట్రిప్ | Gulmarg Trip Experience

గుల్మార్గ్లో సూర్యోదయాన్ని అసలు మిస్ అవ్వొద్దు. పిర్ పంజాల్ పర్వత శ్రేణిలో ఉన్న హిమగిరులపై సూర్యకిరణాలు పడి, పర్వతాలు బంగార రంగులో మెరవడం అనేది నేది జీవితాంతం గుర్తుంటుంది.
- అలాగే కేబుల్ కార్ రైడ్ సమయంలో తనువును మీటే చలిగాలి
- పైన్ చెట్ల సువాసన
- ఆకాశంలో విన్యాసం చేసే వివిధ రంగులు
ఇవన్నీ ఎవరైనా అంత ఈజీగా మర్చిపోగలరా? మనకు తెలియకుండానే మన మనసు కోరుకునే అనుభవాలు ఇవే.
సూర్యాస్తమయం తరువాత గుల్మార్గ్లోని గ్రామాల్లో వీధిదీపాలు ఎక్కువగా, మనుషులు తక్కువగా కనిపిస్తారు. వెచ్చని దుప్పటిలో ముడుచుకుని పడుకునే సమయంలో స్వర్గం అంటే ఇదేనేమో
గుల్మార్గ్ ఎప్పుడు వెళ్లాలి? | Best Time To Visit
చలికాలంలో గుల్మార్గ్ మంచు ప్రపంచంలా మారిపోతుంది. అయితే మార్చి నుంచి జూన్ మధ్యలో పర్యటనకు బెస్ట్ టైమ్. ఈ సమయంలో ఎటు చూసినా పచ్చదనం, పువ్వులు, పర్యాటకుల చిరునవ్వులు కనిపిస్తాయి. దూరదూరం వరకు భారీ పర్వతాలను చూస్తూ చిన్నపిల్లల్లా మురిసిపోవచ్చు. చలికాలంలో స్నోఫాల్, వింటర్ స్పోర్ట్స్ కోసం వెళ్లవచ్చు.
ఎలా చేరుకోవాలి? | How To Reach
గుల్మార్గ్ చేరుకోవడానికి కశ్మీర్ సమ్మర్ క్యాపిటల్ శ్రీనగర్ చేరుకోవాలి. శ్రీనగర్‌కు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ను క్యాబ్ లేదా లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా చేరుకోవచ్చు. షేరింగ్‌లో కూడా ప్రయత్నించవచ్చు ఈ ప్రయాణం చాలా బ్యూటిఫుల్. స్నోఫాల్ సమయంలో స్థానిక పరిస్థితులను బట్టి ప్లాన్ చేసుకోవాలి.

ఎక్కడ ఉండాలి? | Accommodation
గుల్మార్గ్ అనేది ఒక హాట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇది. వర్షాకాలం మినహా సంవత్సరం మొత్తం పర్యాటకులు దేశవిదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. గుల్మార్గ్లో బడ్జెట్ హోటల్స్ నుంచి లగ్జరీ రిసార్టుల వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. పీక్ సీజన్లో అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి.
రిసార్టుల్లో ఆధునిక సదుపాయాలు, వ్యాలీ వ్యూ రూములు, ఫైన్ డైనింగ్ సదుపాయాలు ఉంటాయి. బడ్జెట్ ప్రయాణికుల కోసం గెస్ట్ హౌసులు, హోమ్‌స్టేలు ఉన్నాయి. ఇకో-ఫ్రెండ్లీ కాటేజీలను కూడా ట్రై చేయవచ్చు.
బెస్ట్ స్కీయింగ్ పాయింట్ | Adventure Activities
చలికాలంలో గుల్మార్గ్లో స్కీయింగ్, స్నోబోర్డింగ్, స్నో ట్రెక్కింగ్ యాక్టివిటీస్ కోసం భారతీయులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. ఎండాకాలంలో మౌంటెన్ బైకింగ్, ట్రెక్కింగ్ ట్రై చేయవచ్చు.

వింటర్లో ఇక్కడ స్కీయింగ్, స్నోబోర్డింగ్ చేయడం అనేది ఒక లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియెన్స్. ఇక్కడి స్నో స్పోర్ట్స్ ఎంజాయ్ చేయడానికి ప్రొఫెషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి ఇన్స్ట్రక్టర్ ఉంటే సరిపోతుంది.
- ఇది కూడా చదవండి : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడ ఉండాలి, ఏం చూడాలి | Top 10 Tips To Visit Manali
షాపింగ్ | Shopping Experience
గుల్మార్గ్లో కశ్మీరీ హ్యాండీక్రాఫ్టులు, ఇక్కడి శాలువలు, కార్పెట్లు, కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్ చాలా ఫేమస్. అలాగే స్థానిక మసాలా దినుసులను కూడా ట్రై చేయవచ్చు.
కశ్మీర్ యాపిల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే మీరు డ్రై యాపిల్ గురించి ఎప్పుడైైనా విన్నారా ? అది కూడా మీరు ఇక్కడ ట్రై చేయవచ్చు.
కశ్మీర్ టూరును ఒక యాత్రలా కాకుండా ఒక స్ట్రెస్ రిలీవింగ్ మాత్రలా భావించండి. గుల్మార్గ్కు కేవలం అందమైన లొకేషన్ల కోసం మాత్రమే కాకుండా ఇక్కడి వైబ్‌ను ఫీల్ అవ్వడానికి వెళ్లండి.
సో మనకు స్వర్గం ఎలా ఉంటుందో తెలుసు. కశ్మీర్ వెళ్తే అలాగే స్వర్గం ఎక్కడ ఉంటుందో అనే ప్రశ్నకు సమాధానం కూడా తెలిసిపోయింది.
గుల్మార్గ్ నుంచి రిటర్న్ అయ్యాక మీ ట్రావెల్ ఆల్బమ్ ఫుల్ అవుతుంది. కానీ రియల్ మార్పు అనేది ఫోటోల్లో కనిపించదు. అది మీ మైండ్, మనసులో కనిపిస్తుంది. అలా కనిపించపోతే మీరు మీ ట్రిప్‌ను కళ్లతో కాదు కెమెరాతో చూశారు అని అర్థం.
తఅదే మనసు, మైండ్‌లో గుల్మార్గ్ దిగిపోతే హడావిడి తగ్గుతుంది. చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిస్తారు. ఇదే ప్రయాణాలు నిజంగా మనకు ఇచ్చే కానుకలు.
ఈ Gulmarg Complete Travel Guide అనేది ప్లానింగ్ కోసం మాత్రమే ఇవ్వలేదు. ఫీల్ అవ్వడం కూడా ఇచ్చాము. డెస్టినేషణ్ కన్నా అనుభూతిని సొంతం చేసుకోవడం ప్రధానం అని నమ్మే వాళ్లకు ఇది ప్రయాణికుడు ఇచ్చే చిరు కానుక.
మీ ప్రయాణికుడు, ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు.కామ్
ఈ కథనం సాక్షి దినపత్రిక ఈ-పేపర్ , వెబ్సైట్లో కూడా ప్రచురితమైంది. కంటెంట్ రచయిత: ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు పాఠకుల కోసం పునఃప్రచురణ చేశారు.

“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు చిట్ చాట్
