హైదరాబాద్‌లో 9 శ్రీ మహా విష్ణువు & అవతారాల ఆలయాలు | Vaikunta Ekadasi 2025 Hyderabad
Vaikunta Ekadasi 2025 Hyderabad సంబంధించిన కంప్లీట్ ట్రావెల్ గైడ్, హైదరాబాద్‌లో ఉన్న ఇంపార్టెంట్ మహావిష్ణువు ఆలయాలు…దర్శనం టైమింగ్స్, క్రౌడ్ ప్లానింగ్, అడ్రెస్, ఎలా వెళ్లాలి ఈ పోస్టులో తెలుసుకోండి.
Vaikunta Ekadasi 2025 Hyderabad సంబంధించిన కంప్లీట్ ట్రావెల్ గైడ్, హైదరాబాద్‌లో ఉన్న9 ఇంపార్టెంట్ మహావిష్ణువు ఆలయాలు…దర్శనం టైమింగ్స్, క్రౌడ్ ప్లానింగ్, అడ్రెస్, ఎలా వెళ్లాలి ఈ పోస్టులో తెలుసుకోండి.
వైకుంఠ ఏకాదశి అనేది వైష్ణవ భక్తులకు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు శ్రీ మహా విష్ణువుని భక్తితో దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుంది అని భక్తుల నమ్మకం.
హైదరాబాద్ (Hyderabad) లాంటి బిజీ సిటీలో కూడా వైకుంఠ ఏకాదశి రోజు ఆలయాలు అన్నీ కూడా భక్తులతో నిండిపోతాయి. సరిగ్గా చెప్పాలి అంటే ఈ రోజు కరెక్ట్ ప్లానింగ్ చేస్తే ప్రశాంతంగా స్పెండ్ చేయొచ్చు.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
హైదరాబాద్‌లో వైకుంఠ ఏకాదశి రోజు మీరు శ్రీవారిని (Lord Vishnu) దర్శించుకోవాలి అనుకుంటే మీ కోసం 9 ఇంపార్టెంట్ శ్రీ మహా విష్ణువు ఆలయాల గురించి ఈ పోస్టులో వివరిస్తున్నాను.
వైకుంఠ ఏకాదశి తేదీలు 2025
వైకుంఠ ఏకాదశి అనేది 2025 డిసెంబర్ 30వ తేదీన వస్తుంది. ఈ రోజున హైదరాబాద్‌లో ప్రముఖ వైష్ణవ ధామాలు అన్నీ కూడా ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడుతాయి.
స్పెషల్ దర్శనాలు, వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు జరుగుతుంటాయి.
వైకుంఠ ద్వాదశి వచ్చేసి 2025 డిసెంబర్ 31 / జనవరి 1వ తేదీన జరుగుతుంది.
డిసెంబర్ 29 నుంచి జనవరి 1 వరకు భక్తులతో కిటకిటలాడే శ్రీ మహా విష్ణువు ఆలయాలు ఇవే.
ముఖ్యాంశాలు
1. చిలుకూరు బాలాజీ ఆలయం | Chilkur Balaji Temple
హైదరాబాద్ శివార ప్రాంతంలో ఉన్న చిలుకూరు ఆలయం అనేది క్రమశిక్షణకు మరో పేరు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4 గంటల నుంచి దర్శనాలు ప్రారంభం అవుతాయి.

- ఇక్కడ హుండీ ఉండదు.
- పెద్ద ఎనౌన్స్మెంట్ ఉండదు.
- ప్రశాంతమైన వాతావరణంలో స్వామి దర్శనం చేసుకోవచ్చు.
- కుటుంబంతో కలిసి వెళ్లగలిగిన ఆలయం ఇది.
Travel Tips : మెహిదీపట్నం, లింగంపల్లి నుంచి చాలా బస్సులు ఉంటాయి. సొంత వాహనంలో అయితే ఉదయానే వెళ్లండి. లేదంటే సన్‌సిటీకి వెళ్లడానికి ముందే మీరు అలసిపోవచ్చు. దారిలో ఆరామైసమ్మ ఆలయం ఉంటుంది. వీలైతే అమ్మవారిని దర్శించుకోవచ్చు.
2. ఇస్కాన్ ఆబిడ్స్ | ISKCON Abids
వాసుదేవుడి భక్తులు తప్పకుండా వెళ్లాల్సిన ఆలయం ఇది. వైకుంఠ ఏకాదశి రోజు మంగళ హారతి, భజనలు, భగవద్గీత పఠనం జరుగుతాయి.ఉదయం ఆలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక పాజిటీవ్ వైబ్ ఉంటుంది. ప్రసాదం కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి అందిస్తారు.

Travel Tips: దగ్గర్లో గాంధి భవన్ మెట్రో స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి బీజేపీ ఆఫిస్ ఎదురుగా ఉన్న రోడ్డుపై నుంచి జగదీష్ మార్కెట్ వైపునకు నడిచి వెళ్లొచ్చు. బండిపై ఉంటే ఎంజే మార్కెెట్, ఆబిడ్స్ నుంచి వెళ్లొచ్చు. కోఠి నుంచి చాలా బస్సులు ఉంటాయి.
3. బిర్లా మందిర్ | Birla Mandir | Vaikunta Ekadasi 2025 Hyderabad
నగరం మధ్యలో ఉన్న ఈ పాలరాతి ఆలయం వైకుంఠ ఏకాదశి రోజు మరింత అందంగా ముస్తాబవుతుంది. ఈ సమయంలో ఇక్కడ విష్ణు సహస్త్రనామ అర్చన, స్పెషల్ పూజలు జరుగుతాయి. ఇక్కడి నుంచి సిటీ వ్యూ చూస్తే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.

Travel Tips : దగ్గర్లోని మెట్రో వచ్చేసి లకిడీకాపూల్, ఖైరతాబాద్.. అక్కడి నుంచి ఆటో లేదా నడిచి వెళ్లొచ్చు. లకిడీకాపూల్, ట్యాంక్‌బండ్ వెళ్లే బస్సుల్లో ఎక్కవచ్చు. ఆర్బిఐ, కామత్ హోటల్‌కు చేరువలో ఉంటుంది.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? శ్రీవారు వైకుంఠం విడిచి ఎందుకు వచ్చారు?
4. శ్రీ రంగనాథ స్వామి ఆలయం | Sri Ranganatha Swamy Temple, Jiyaguda
జియాగూడ (పూరానాపూల్, ధూల్‌పేట్ దగ్గర) వద్ద ఉన్న అతి పురాతమైన శ్రీ రంగనాథుడి ఆలయం ఇది. ఇక్కడ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం విధివిధానాలు జరుగుతాయి.
అందుకే ఇక్కడికి వెళ్తే వైకుంఠ ద్వార దర్శనం కూడా అదే విధంగా జరుగుతుంది.
పెద్ద ఆలయాలతో పోల్చితే ఇక్కడ భక్తుల రద్దీ నార్మల్‌గా ఉంటుంది.
Travel Tips : జియాగూడ బస్టాండ్ నుంచి వాకబెల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మీరు అత్తాపూర్ నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. లేదా సికింద్రాబాద్ (secunderabad), అఫ్జల్ గంజ్ నుంచి 1-J, 1-J/L, 2, 3KJ బస్సలు ఎక్కి చేరుకోవచ్చు. గోషామహల్, మోజాంజాహి మార్కెట్ నుంచి కూడా వెళ్లొచ్చు.
- ఇది కూడా చదవండి : తెలంగాణలోని ఈ ఆలయానికి వెళ్తే అరుణాచలం వెళ్లినట్టే…| Chinna Arunachalam
5. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం | Sri Venkateswara Swamy Temple, Himayatnagar

హిమాయత్ నగర్లో ఉన్న ఈ ఆలయం స్థానిక భక్తులకు ఎక్కువగా సందర్శించే ఆలయం. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం నుంచే ప్రత్యేక సేవలు జరుగుతాయి. దగ్గర్లో ఆఫీసులు, షోరూమ్‌లు ఉండటం వల్ల చాలా మంది పనిలో బ్రేక్ తీసుకుని లేదా ఆఫీస్ వెళ్లే ముందు, వర్క్ టైమ్ ఫినిష్ అయ్యాక స్వామివారి దర్శనం చేసుకుంటారు.
Travel Tips : చిక్కడపల్లి, నారాయణగూడ (Narayanaguda) మెట్రో స్టేషన్ ఈ ఆలయానికి దగ్గర్లో ఉన్న స్టేషన్లు. మెహిదీపట్నం, ఉప్పల్ నుంచి చాలా బస్సులు ఉంటాయి.
- ఇది కూడా చదవండి : శ్రీ పైడితల్లి అమ్మవారు..యుద్ధాలు వద్దు, శాంతే ముఖ్యం అన్న దేవత కథ | Sri Paidithalli Ammavaru
6. శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం | Sri Lakshmi Narasimha Swamy Temple, Alwal
ఆల్వాల్‌లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున నరసింహా స్వామివారికి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. స్వామివారిని ప్రత్యేక అలంకరణలో చూసి భక్తులు తరిస్తారు.
ఇక్కడికి నార్త్ హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది భక్తులు వెళ్తుంటారు.
- Address: Alwal Hills Road, Alwal, Secunderabad, Hyderabad – 500010
Travel Tips : ఆల్వాల్‌కు చాలా ఆర్టీసి బస్సులు వెళ్తాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, బోయిన్పల్లి నుంచి డైరక్ట్ బస్సులు దొరుకుతాయి
- దగ్గర్లో ఉన్న మెట్రో స్టేషన్ వచ్చేసి JBS Parade Ground. అక్కడి నుంచి ఆటోలో 25-30 నిమిషాల్లో చేరుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : పండరిపురం ఆలయ దర్శనం కంప్లీట్ గైడ్
7. శ్రీ జగన్నాథ స్వామి ఆలయం | Sri Jagannath Swamy Temple, Banjara Hills
శ్రీ జగన్నాథ స్వామి వారిని భగవాన్ విష్ణు అవతారంగా భావించి భక్తులు దర్శించుకుంటారు. ఒడిశా స్టైల్ నిర్మాణంలో పూరి జగన్నాథుడి ఆలయం శైలిలో ఉండే ఈ ఆలయం వైకుంఠ ఏకాదశి రోజున భక్తులతో కిటకిటలాడుతుంది.

ఈ రోజున భక్తుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తారు. ఉదయం వెళ్తే రద్దీ తక్కువగా ఉంటుంది.
చాలా విశాలమైన ప్రాంగణం ఉండటంతో కుటుంబ సమేతంగా వెళ్లవచ్చు.
- Address: Road No. 12, Banjara Hills, Near Journalists Colony, Hyderabad – 500034
Travel Tips: దగ్గర్లోని మెట్రోస్టేషన్ వచ్చేసి రోడ్ నెం.5 లో జూబ్లిచెక్పోస్ట్ దగ్గర ఉంది. అక్కడి నుంచి ఆటోలు, క్యాబులు దొరుకుతాయి. 10-15 నిమిషాల్లో వెళ్లొచ్చు.
బంజారాహిల్స్, మెహిదీపట్నం, పంజాగుట్ట నుంచి ఆర్టీసి బస్సులు ఉంటాయి. 127 వస్సు ఎక్కితే గుడి ముందు నుంచి వెళ్తుంది. లేదా మీరు కేబీఆర్ పార్కు ఎంట్రాన్స్ ముందుకు వరకు వచ్చి అక్కడి నుంచి కూడా వెళ్లొచ్చు. మాసాబ్‌ట్యాంక్, పెన్షన్ ఆఫిస్, పంజాగుట్ట, టోలిచౌకి నుంచి కూడా చేరుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : బద్రినాథ్ ఆలయం సమీపంలో ఉన్న 6 సందర్శనీయ స్థలాలు
8. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం | Sri Raghavendra Swamy Mutt, Himayatnagar
మధ్వ సాంప్రదాయానికి చెందిన ఈ మఠంలో వైష్ణవ భక్తులు మంచి ఆధ్యాత్మిక అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు.
వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేక పూజలు, పారాయణం జరుగుతుంది.
ప్రశాంతమైన వాతావరణం కోసం కుటుంబంతో కలిసి వెళ్లవచ్చు.
- Address: Gagan Mahal Road, Himayatnagar, Hyderabad – 500029
Travel Tips : మెట్రో కొంచెం దూరమే. హిమాయత్ నగర్, బషీర్‌బాగ్, ఆబిడ్స్ నుంచి బస్సులు ఉంటాయి.
9. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం | Sri Seetha Ramachandra Swamy Temple, Seetharambagh
గోషామహల్‌కు చేరువలో ఉండే ఈ ఆలయం. ఇక్కడ శ్రీరామచంద్రుడిని దర్శించుకోవడంతో పాటు శ్రీ మహావిష్ణువుని కూడా దర్శించుకోవచ్చు. తమిళనాడు ఆలయాల మాదిరిగా విశాలమైన నిర్మాణం, అద్భుతమైన వాతావరణం ఉంటుంది.
వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడ అనేక ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు జరుగుతాయి.
ఉదయం సమయంలో వెళ్లడం ఉత్తమం.
- Address: Seetharambagh Road, Near Asif Nagar, Hyderabad – 500064
Travel Tip : కోఠి, మెహిదీపట్నం నుంచి 116 N బస్సు ఎక్కి సీతారాంబాగ్ చేరుకోవచ్చు. దగ్గర్లో ఉన్న మెట్రో Nampally Station. మోజాంజాహి మార్కెట్, గోషామహల్, పునాపూల్, మాసాబ్‌ట్యాంక్ నుంచి సులభంగా చేరుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : కుమార స్వామి వివాహం జరిగిన దివ్య క్షేత్రం ఏదో తెలుసా? | Thiruparankundram Travel Guide
వైకుంఠ ఏకాదశి టిప్స్ | Vaikunta Ekadasi Travel Tips (Hyderabad)
- వైకుంఠ ఏకాదశి రోజు సాయంత్రం విపరీతమైన రద్దీ ఉంటుంది. అందుకే ఉదయం ప్లాన్ చేసుకోండి.
- దర్శనానికి బెస్ట్ టైమ్ ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు.
- మెట్రో, ఆర్టీసి బస్సులను వినియోగించండి.
- లైట్ కాటన్ బట్టలు ధరించి షాల్ క్యారీ చేయండి.
- సైలెన్స్, పేషెన్స్ ఆధ్యాత్మిక సాధనలో భాగం.
- క్యూలైన్లో మీ ముందూ వెనకా భక్తులే ఉంటారు. ఓపిక పట్టండి.
- మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ ముందుకు సాగండి.
ఇక్కడ ప్రస్తావించిన ఆలయాలన్నింటికీ వెళ్లాలని చెప్పడం లేదు. మీ ఇల్లు లేదా ఆఫీస్‌కు దగ్గర ఉన్న ఆలయానికి వెళ్లండి. పొద్దున్నే వెళ్తే ప్రశాంతంగా దర్శనం చేసుకుని రోజంతా చిరునవ్వుతో గడపవచ్చు.
ఇక ఒక్కరోజులోనే అన్ని ఆలయాలు దర్శించుకోవాలని అనుకుంటే అది మీ ఇష్టం. కానీ మిగతా భక్తులకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. Just telling.
Jai Shri Krishna 🙏
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
