విజయవాడకు దగ్గర్లో టాప్ 7 కుటుంబ సమేతంగా వెళ్లదగిన ప్రాంతాలు | Vijayawada Near By
Vijayawada Near By : ఫ్యామిలీతో కలిసి ఒకట్రెండ్ రోజులు టూర్ వేద్దాం అనుకుంటున్నారా? విజయవాడకు సమీపంలో ఉన్న టాప్ టూరిస్టు స్పాట్స్ ఎంపిక చేసి ఈ ఆర్టికల్ సిద్ధం చేశాను. రెండ్రోజుల్లో ప్రశాంతంగా వెళ్లి వచ్చే టాప్ 7 డెస్టినేషన్స్ ఇవే !
Vijayawada Near By : ఫ్యామిలీతో కలిసి ఒకట్రెండ్ రోజులు టూర్ వేద్దాం అనుకుంటున్నారా? విజయవాడకు సమీపంలో ఉన్న టాప్ టూరిస్టు స్పాట్స్ ఎంపిక చేసి ఈ ఆర్టికల్ సిద్ధం చేశాను. ఇందులో బీచులు, హిల్ స్టేషన్లు, ఆలయాలు, నేచురల్ స్పాట్స్ అన్నీ మిక్స్, బడ్జెట్లో ఎలా వెళ్లాలో మీ కోసం డిజైన్ చేశాను. చేశాను. అన్ని వివరాలు చదివి ఎక్కడికి వెళ్లా మీరు నిర్ణయించుకోండి. ఇంకో విషయం కంప్లీట్ ఫ్యామిలీ కలిసి వెళ్లే అనువైన ప్రదేశాలు ఇవి. సో మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు.
ముఖ్యాంశాలు
ఇక విజయవాడకు దగ్గర్లో కుటుంబ సమేతంగా వెళ్లదగిన టాప్ 7 ప్రాంతాలు !
1. అరకు లోయ | Araku Valley
విజయవాడ నుంచి అరకు లోయ సుమారు 350 కీమీ దూరంలో ఉంటుంది. చాలా మంది ఇక్కడి చల్లిన వాతావరణాన్ని ఎంజయ్ చేసేందుకు, జలపాతాలను చూసేందుకు, కాఫీ తోటల్లో విహరించేందుకు వెళ్తుంటారు.
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
- ఇది కూడా చదవండి : వంజంగి ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి? ఏం చూడాలి ?
ఇక్కడ కవర్ చేయాల్సిన ప్రదేశాలు (Places To Visit In Araku Valley)
- బొర్రా గుహలు ( Borra Caves)
- గాలికొండ వ్యూ పాయింట్
- ట్రైబల్ మ్యూజియం
- వంజంగి వ్యూ పాయింట్ (Vanjangi)
- లంబసింగి (Lambasingi)
- అనంతగిరి
- కటికి జలపాతం
- కాఫీ మ్యూజియం (Coffee Museum)
ఇవన్నీ రెండు రోజుల్లో కవర్ చేయడం కష్టమే.నా సలహా ఏంటంటే ఇందులో కొన్నింటిని మాత్రమే కవర్ చేయండి. ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నట్టు అన్నీ కవర్ చేయాలని ప్రయత్నించకండి. టూరిజం అంటే మారథాన్ కాదు. అదొక అనుభూతి.
2. సూర్య లంక బీచ్ | Surya Lanka Beach
విజయవాడ నుంచి సుమారు 90 కిమీ దూరంలో ఉండే సూర్య లంక బీచు బాపట్లకు (Bapatla Beach) దగ్గర్లో ఉంటుంది. రోజూవవారి టెన్షన్స్ నుంచి రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఇది మంచి ఛాయిస్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకు కూడా బాగుంటుంది.
- ఈ బీచు నీట్‌గా ఉంటుంది.
- పిల్లలు ఇసుకలో ఆడుకోవచ్చు.
- పెద్దలేమో ప్రశాంతంగా సముద్ర గాలిని ఎంజాయ్ చేయవచ్చు.
- పిల్లలతో వెళ్తే వారిని ఒక కంటకనిపెడుతూ ఉండండి.
- ఇది కూడా చూడండి : బొర్రా గుహలు ఎక్కడున్నాయి ? ఎలా వెళ్లాయి ?కంప్లీట్ ట్రావెల్ గైడ్ | Borra Caves Travel Guide
యాక్టివిటీస్
- ఇక్కడ మీరు ఇసుక తిన్నెలపై చెప్పుల్లేకుండా నడవొచ్చు.
- సూర్యోదయం సూర్యస్థయం సమయంలో ప్రశాంతంగా సేదదీరవచ్చు.
- కుటుంబంతో కలిసి ఫోటోలు దిగవచ్చు.
- సీఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు.
3. హార్స్లీ హిల్స్ | Horsley Hills, Chittoor
విజయవాడ నుంచి సుమారు 380 కీమీ దూరంలో ఉన్న అందమైన ప్రదేశమే హార్స్లీ హిల్స్. చల్లని వాతావరణంతో పాటు చుట్టూ అడవులు, అద్భుతమైన వ్యూ పాయిట్స్ ఇవన్నీ హార్స్లీ హిల్స్‌ను తెలుగువారి ఫేవరిట్ హిల్ స్టేషన్‌గా మార్చేశాయి.
- ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లినా భారీ రద్దీ కనిపిస్తుంది కదా. హార్స్లీ హిల్స్‌లో మాత్రం రద్దీ తక్కువగా ఉంటుంది.
- పిల్లలతో కలిసి వెళ్లేందుకు ఇది చాలా అనువైన ప్రదేశం.
- వ్యూ పాయింట్ నుంచి ఎటు చూసినా అందమే అందం కనిపిస్తుంది. పైసా వసూల్ అయినట్టు అనిపిస్తుంది వెళ్తే.
- ఇక్కడ మినీ జూ, అడ్వంచర్ పార్కు, ఇకో పార్కు కూడా ఉంది.
- ఇది కూడా చదవండి : Horsley Hills : ఆంధ్రా ఊటీకి క్యూ కడుతున్న తెలుగు ప్రయాణికులు
4. తిరుపతి | Tirupati 2 Day Trip
విజయవాడ నుంచి తిరుపతి 370 కిమీ దూరంలో ఉంటుంది. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న తరువాత తిరుమల కొండపై ఉన్న ఇతర ఆలయాలను, పవిత్ర ప్రదేశాలను, వారసత్వ నిర్మాణాలను దర్శించుకోవచ్చు.

దగ్గర్లో కవర్ చేయాల్సినవి
- కపిల తీర్థం
- శ్రీవారి మ్యూజియం
- చంద్రగిరి రాజ మహల్
- ఇది కూడా చదవండి : రూ.19,999 కే ఫారిన్ ట్రిప్…కుటుంబ సమేతంగా భూటాన్ వెళ్లొచ్చే చవక ప్లాన్
5. పాపికొండలు | Papikondalu | Vijayawada Near By
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇది. విజయవాడకు సుమారు 200 కిమీ దూరంలో ఉంటుంది. ఇక్కడి నేచర్, నదిలో కొన్ని గంటలపాటు బోటు ప్రయాణం, నదికి రెండువైపులా ఉండే కొండలు ఇవన్నీ పాపికొండలు బోటింగ్‌లో హైలైట్ అని చెప్పవచ్చు.
- ఇది కూడా చదవండి : Travel Tips 38 : డిసెంబర్లో సౌత్ ఇండియాలో బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే | Hill Stations In South India
ఈ ట్రిప్‌లో హైలైల్స్
- గోదావరిలో క్రూజింగ్
- హడావిడీ లేకుండా కదిలే బోటులు
- మధ్యలో పేరంటపల్లిలో ఆలయం
- మధ్యలో ఒక ఐలాండ్‌లో ఆపి ట్రైబల్ ఫుడ్ ఆరగించే అవకాశం
6. అమరావతి, ఉండవల్లి గుహలు | One Night Trips near Vijayawada
విజయవాడకు కేవలం 10-25 కిమీ దూరంలో ఉండే మిడ్ షార్ట్ జర్నీ ఇది. ఈ ట్రిప్‌లో పిల్లలను తీసుకెళ్తే చరిత్ర, సంస్కృతి గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
హైలైట్స్
- అమరావతితో బుద్ధుడి విగ్రహం (Amaravati Buddha Statue)
- ఉండవల్లి గుహలు (Undavalli Caves)
- కృష్ణా నదిలో బోటింగ్
- ధ్యాన బుద్ధ పార్కు
7. కొల్లేరు లేక్ , ఆటపాక బర్డ్ సాంక్చువరి
ఇది కూడా విజయవాడ నుంచి షార్ట్ ట్రిప్ అనుకోండి. ఈ ట్రిప్‌లో పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ భారత దేశంలోనే అతిపెద్ద స్వీట్ వాటర్ పాండ్ కొల్లేరు ఉంటుంది.
- ఇక్కడ ఆటపాక పక్షుల అభయారణ్యంలో వందలాది వలస పక్షులను చూడొచ్చు.
- వాటి గురించి పెద్దలు తెలుసుకోవడంతో పాటు పిల్లలకు కూడా వివరించవచ్చు.
- స్థానికంగా దొరికే లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు
- సరస్సు ఒడ్డున లాంగ్ వాక్ చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : ఏపీ, తెలంగాణలో అతి పెద్ద మామిడిపండ్ల మార్కెట్లు ఏవో తెలుసా? | Mango Markets In Telugu States
ఫ్యామిలీ ట్రిప్ టిప్స్ | Family Tour Tips
Vijayawada Near By : ఒక వ్యక్తి సోలోగా (solo traveller) ఒక టూరుకు వెళ్లడం వేరు కుటుంబంతో వెళ్లడం వేరు. ఇలాంటి సమయంలో మీరు ఈ విషయాలు గుర్తుంచుకోండి.
- పిల్లలు, పెద్దవాళ్లకు సంబంధించిన మెడిసిన్/మందులను (Medicine During Travel) మీ వెంట ఉంచుకోండి.
- హోటల్స్ ఇతర ప్యాకేజీలు ముందే బుక్ చేసుకోండి.
- తెల్లవారక ముందే బయల్దేరితే ట్రాఫిక్ అవ్వడానికి ముందే సిటీ దాటేస్తారు.
- టూరును ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. కాంట్రాక్ట్ తీసుకున్నట్టు అన్ని ప్రదేశాలు కవర్ చేయడానికి ప్రయత్నింకండి.
- అందమైన లొకేషన్స్ కనిపిస్తే మొబైలును పక్కన పెట్టి కళ్లతో రికార్డు చేసి గుండెల్లో దాచుకోండి. ఒక ట్రెండు మంచి ఫోటోలు, ఒక మంచి వీడియో సరిపోదా…
- వీలైనంత తక్కువ సామాన్లు తీసుకెళ్లండి. గుర్తుంచుకోండి. బరువు ఎక్కువైతే లగేజే మనకన్నా బాగా టూరును ఎంజాయ్ చేస్తుంది.
- ఇది కూడా చదవండి : Solo Female Travelers : మహిళలు ఒంటిరి ప్రయాణాలు ఎలా ప్లాన్ చేసుకోవాాలి ? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి?
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
