Viral Video : కుంభమేళా వెళ్లేందుకు ట్రైన్ టాయిలె‌ట్‌ను కబ్జా చేసిన యువతులు..వీడియో వైరల్ 

షేర్ చేయండి

Viral Video: ప్రయాగ్‌రాజ్‌ వేదికగా జరుగుతున్న కుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు పడే కష్టాల గురించి మీరు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు. 45 రోజుల్లో 45 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమం, ఇతర ఘాట్లలో ( Triveni Sangam) పవిత్ర స్నానాలు చేస్తారనే అంచనాతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 

13,000 రైల్లు 132 విమానాలు..

ఇందుకోసం భారతీయ రైల్వే 13,000 ట్రైన్లను నడపాలని ముందుగానే ప్లాన్ చేసింది. ఎప్పటికప్పుడు కొత్త రైళ్లను ప్రకటిస్తూనే ఉంది. దీంతో పాటు ప్రయాగ్‌రాజ్ (Prayagraj) వెళ్లే విమానాల సంఖ్య కూడా పెరిగింది. 2024 డిసెంబర్ నాటికి కేవలం 8 నగరాల నుంచి మాత్రమే ప్రయాగ్‌రాజ్‌కు డైరక్ట్ విమానాలు నడుస్తోండగా ఉండగా నేడు అది 17 నగరాలకు చేరింది. నెలకు 132 విమానలు కుంభమేళా వెళ్తున్నాయి. 

ఇక డబ్బు విషయంలో కానీ, సౌకర్యాల విషయంలో కానీ ఏమీ పట్టించుకోవడం లేదు ప్రయాణికులు. అవసరమైతే నాలుగు రాళ్లు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు. పది సార్లు ఇబ్బంది పడినా పర్వాలేదు కానీ 144 సంవత్సరాల తరువాత వచ్చిన అరుదైన మహా కుంభమేళాకు (Maha Kumbh Mela 2025) ఎట్టి పరిస్థితిలో అయినా వెళ్లాల్సిందే అని కొంతమంది ఫిక్స్ అవుతున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 

Prayanikudu
📣| ప్రయాణికుడు వాట్సాప్ అప్డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాజాగా వైరల్ అవుతున్న వీడియో నెటిజెన్ల మధ్య చర్చకు దారి తీసింది. లక్షలాది వ్యూస్ సంపాదించిన ఈ వీడియోలో ముగ్గురు మహిళలు ఒక రైల్వే టాయిలెట్‌లో అడ్జస్ట్ అయ్యి కుంభమేళాకు వెళ్తున్నారు. ఈ వీడియో చూసి చాాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియోలో ఏముంది ? | Viral Video

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువతి ట్రెయిన్ టాయిలెట్‌లో ఉంటూ వీడియోలు తీస్తూ కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు పౌరుల బాధ్యతతో పాటు, ట్రైన్లలో ఉన్న రద్దీ గురించి చర్చిస్తున్నారు. ఈ వీడియోలో బాత్రూమ్‌లో తన ప్రయాణం గురించి బెంగాలీలో వివరించింది సదరు యువతి..

ఇది చూసిన యూజర్లు ఈ ప్రవర్తన కరెక్టు కాదు అని కొంత మంది స్పందిస్తున్నారు. ప్రయాణికుల కోసం కేటాయించిన టాయిలెట్స్‌ను ఇలా కబ్జా చేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని, ప్రయాణికులను ఇబ్బంది పెట్టడమే అని అంటున్నారు.

గుర్రుమంటున్న నెటిజెన్లు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవడంతో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతులు చేసిన పనిని విమర్శిస్తూనే అధికారులు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైల్వే శాఖ అధికారిక ఖాతాలను ట్యాగ్ చేసి ఈ విషయాన్ని గమనించడంతో పాటు ట్రైన్లలో రద్దీ విషయంలో చర్యలు తీసుకోమని కోరారు. 

Viral Video
ఎవరికైనా అర్జంట్‌గా టాయిలెట్ వెళ్లాల్సి వస్తే ఏంటి పరిస్థితి అని ఒక యూజర్ కామెంట్ చేయగా…ఇలా చేయకతప్పలేదు అని కామెంట్ చేసింది యువతి. (Photo Credit: Instagram)

నిజానికి కోట్లాది మంది భక్తుల కోసం రైల్వే శాఖ (Indian Railways) వేలాది సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఎన్నో విమానయాన సంస్థలు (Airlines In India) కొత్తగా ఫ్లైట్స్ ప్రకటించాయి. అయినా కానీ ఒకే ప్రాంతానికి భారీగా తరలి వస్తున్న భక్తులకు, కోట్లాది మంది ప్రయాణికులకు సరిపడే రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది ఏ సంస్థకు అయినా అతిపెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు.

“కామన్ సెన్స్…సివిక్ సెన్స్ లేదా”

ఈ వీడియోను చూసిన తరువాత చాలా మంది యువతులకు బాధ్యతలేదు అని, కామన్ సెన్స్ లేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా చేయడం ప్రయాణికులను (Travelers) ఇబ్బంది పెట్టడంతో పాటు యువతులకు కూడా ఆరోగ్యపరంగా మంచిది కాదు అని అంటున్నారు.

మౌలిక సదుపాయాల కల్పనపై సవాళ్లు

భారీగా జనసమూహం ఏర్పడే, రద్దీ ఎక్కువగా ఉండే మహా కుంభమేళాలాంటి ప్రదేశాలకు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడం అనేది అనేక సవాళ్లతో కూడుకున్నదిగా చెప్పవచ్చు. ఏ ట్రైను చూసినా భక్తులతో కిటకిటలాడుతోంది. ఇసుకేస్తే రాలనంత జనం ఉన్న రైళ్లలో భక్తులు కుంభ మేళా (Trains to Maha Kumbh Mela) వెళ్లేందుకు ఇలా కొత్త దారులను వెతుకుతున్నారు. ఎలాగైనా కుంభమేళా వెళ్లాలని రిస్కులు చేస్తున్నారు.

మెరుగైన రవాణా వ్యవస్థ

కుంభమేళా లాంటి వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అందుకే రద్దీ నిర్వహణ అనేది మరింత మెరుగ్గా ఉండాలని కొంత మంది చర్చించుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు (Kumbh Mela Viral Video) రద్దీ సమయంలో రవాణా వ్యవస్థల నిర్వహణతో పాటు, ప్రయాణ సమయంలో వ్యక్తిగతంగా ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో కూడా విరిస్తున్నాయి.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!