మంచులో ఇరుక్కున్న రెండు థార్లు..బయటికి లాగిన జిమ్నీ | Thar Jimny Snow Video
Thar Jimny Snow Video : హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలో చలికాలం పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ అయిన ఈ వీడియోలో రెండు మహింద్రా థార్ వాహనాలు మంచుతో కప్పబడిన రహదారుల్లో ఇరుక్కుపోయినట్లు కనిపిస్తున్నాయి.
అనంతరం వాటిని ఒక సుజుకీ జిమ్నీ (Jimny Rescue Spiti) వాహనం సహాయంతో బయటికి లాగుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోను “థార్ వర్సెస్ జిమ్నీ” అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వీడియోలో “వింటర్ స్పితి” (Winter Spiti Video) అని మెన్షన్ చేస్తూ, పూర్తిగా మంచుతో నిండిపోయిన రోడ్డుపై థార్ వాహనాలు కదలలేక ఇరుక్కుపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తరువాత ఒక జిమ్నీ వాహనానికి తాడు కట్టి, దాని సహాయంతో థార్‌ను సురక్షితంగా బయటికి తీస్తారు.
Jimny > Thar pic.twitter.com/dLQsTvtHLF
— ηᎥ†Ꭵղ (@nkk_123) January 27, 2026
ఈ విజువల్స్ ప్రస్తుతం ట్రావెలర్స్ మధ్య విస్తృత చర్చలకు దారి తీస్తున్నాయి.
- ఇది కూడా చదవండి : Winter Travel Tips : చలికాలంలో ప్రయాణం…ఇలా అవ్వాలి సిద్ధం
ఎక్స్పర్ట్స్ ప్రకారం, స్పితి వ్యాలీ వింటర్ సీజన్లో (Spiti Valley Snowfalls) వాతావరణం చాలా తీవ్రంగా ఉంటుంది. భారీ హిమపాతం వల్ల రహదారులపై మంచు పేరుకుపోయి, 4×4 వాహనాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి.
అందుకే ప్రయాణికులు సరైన సిద్ధతతో పాటు వాతావరణ అప్డేట్స్ను కచ్చితంగా ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు.
టూరిజం అధికారులు మరియు తరచూ ప్రయాణాలు చేసే వారు చెబుతున్నది ఏమిటంటే, వింటర్లో స్పితి ట్రిప్ ప్లాన్ చేసే వారు స్నో చైన్స్, రికవరీ ఎక్విప్మెంట్, ఎమర్జెన్సీ సపోర్ట్ లేకుండా ప్రయాణం చేయకూడదు. ఈ ఘటన, చలికాలం ప్రయాణాల్లో థ్రిల్ కన్నా భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలి అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
