ప్రయాణాలు మనను మనకు తెలియకుండానే మార్చేస్తాయి. దీనికి ఉదాహరణకే కేనడాకు చెందిన (Canadian Vlogger) విలియం రోసీ అనే ట్రావెల్ వ్లాగర్. 5 వారాల పాటు భారత్‌లోని వివిధ ప్రాంతాను సందర్శించిన విలియం ఎన్నో అవాక్కయ్యే, మరిచిపోలేని అనుభవాలను సొంతం చేసుకున్నట్టు తెలిపాడు.
ముఖ్యాంశాలు
భారత్‌లో తను ఎక్స్‌పిరియెన్స్ అయిన 5 విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. భారత్ ఎంత అందమైనదో అని చాటిచెప్పడంతో పాటు మన దేశంలో విదేశీయులకు ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా చెప్పకనే చెప్పాడు.
మీ ప్రవర్తన మారిపోతుంది | Canadian Vlogger
కెనెడాకు చెందిన రోసి (William Rossy) ఇప్పటి వరకు 37 దేశాలన సందర్శించాడు. భారత దేశం ఊహించని విధంగా ఉందన్న విలియం ఇక్కడి ఆచారాలు, అద్భుతమైన ఆలయాలు (Indian Temples), సందడిగా ఉండే మార్కెట్లతో పాటు ఇక్కడ నిత్యం ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయన్నాడు.
“ మీరు ఇక్కడ చూసేవి, వినేవి, పీల్చేవి, రుచి చూసే దాన్ని బట్టి మీ ఆలోచనా విధానం, ప్రవర్తన అన్నీ మారిపోతాయి” అంటూ పోస్ట్ చేశాడు విలియం.
ఉన్నవాటితో సంతోషంగా ఉండటం
భారత్ దేశం (India) నుంచి వెళ్లే సమయంలో విలియం నేర్చుకున్న విషయాల్లో..
- ఉన్నవాటితో సంతోషంగా ఉండటం అని
- అరకోర వసతులు ఉన్నా కూడా దానితో సంతృప్తి పడటం కూడా ఒకటి అని తెలిపాడు.
నిద్రపోవడానికి సురక్షితమైన ప్రదేశం ఉండటం, ఫ్రిడ్జి నిండా సరుకులు ఉండటం అనేవి చాలా గొప్ప విషయాలు అని…అందరికి విలాసవంతంగా జీవించడం సాధ్యం కాకపోవచ్చు అని తెలిపాడు.
- భారత్‌లో తాను ఒకే ప్రపంచాన్ని పలు రకాలుగా చూశానని ఇక్కడ కొంత మందికి పుట్టుకతోనే విభిన్నమైన పరిస్థితులు ఎదురవుతాయి అన్నాడు విలియం.
దీంతో పాటు తనకు విశ్రాంతి తీసుకోవడానికి ఒక రోజు (Rest Day) దొరకడం లక్ అని, తన దేశంలో నల్లా నీళ్లు సురక్షితంగా తాగగలను కానీ భారత్‌లో ఏదైనా తాగడానికి ముందు జాగ్రత్తగా ఉండాల అని హితవు పలికాడు.

భారతీయుల్లో స్వార్థం కన్నా స్నేహభావం ఎక్కువగా ఉంటుంది అని, అలాంటి చాలా మందిని తను కలిశానని తెలిపాడు విలయం.
- ఇది కూడా చదవండి : చైనా ట్రైన్లో టాయిలెట్ పక్కన కూర్చున్న ప్రయాణికుడు..వైరల్ వీడియో
అందమైన ఆపద | Traveling in India
భారత దేశ ఆచారాలు (Indian Culture), సంప్రదాయాలు తనకు కాస్త్ షాకింగ్‌గా అనిపించినా ఈ దేశం తనకు అందించిన అనుభవాలకు థ్యాంక్స్ చెప్పాడు విలియం. తాజ్ మహల్ అందంతో పాటు ఇక్కడ మసాలా దినుసుల సుగంధాల్ని కొనియాడాడు. అయితే ఇక్కడి కారంలో ఉండే ఘాటు నషాలనికి ఎక్కుతుంది అన్నాడు.
విలియం రోసి ఎవరు ? | Who Is William Rossy?
కెనడాకు చెందిన విలియం రోసి ఆర్థిక రంగంలో బాగా సెట్ అయిన తరువాత లైఫ్‌లో ఏదైనా కొత్తగా ఏదైనా చేద్దామని ట్రావెల్ వ్లాగ్స్ (travel vlogs) చేయడం ప్రారంభించాడు. స్ప్రౌట్ (Sprouht) అనే పేరుతో ఒక వ్యక్తిగత బ్రాండును కూడా నిర్వహిస్తున్నాడు విలయం.
- ఇది కూడా చదవండి : “లండన్‌లో కూడా పనికి రాదు” హైదరాబాద్ మెట్రోకు ఫిదా అయిన యూరోపియన్ వ్లాగర్ | Hyderabad Metro
మిగితా ట్రావెల్ వ్లాగర్స్‌లా ఒక కొత్త ప్రదేశానికి వెళ్లి వైవిధ్యాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడం కాకుండా ఒక ప్రాంతంలో ప్రజలు ఏం అనుకుంటున్నారు ? వారి ఆలోచనా విధానం ఏంటి ? ఫిలాసఫీ ఏంటి అనే విషయంపై అతను ఫోకస్ చేస్తాడు.
ప్రదేశాలు లేదా ప్రయాణాల కన్నా ఫిలాసఫీ ఫై ఎక్కువ ఫోకస్ చేసే విలియం భారత దేశంలోని నగరాలతో పాటు గ్రామాలకు వెళ్లి ఉంటే అతనికి మన దేశ విశిష్టత, మూలాలు తెలిసేవి. గ్రామాలే దేశానికి ఆయుపట్టు అని మహాత్మా గాంధి (Mahatma Gandhi) అన్నమాట విలియంకు తెలిస్తే బాగుండేది. ఎనిహౌ, అతిథి దేవో భవ :
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. | YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. | WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి. | ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.