ఛత్రపతి శివాజీ కథ చెప్పే 5 అద్భుతమైన కోటలు | Shivaji Maharaj Forts
Shivaji Maharaj Forts : సహ్యాద్రి కొండల మధ్య ప్రయాణిస్తుంటే కొన్ని ప్రదేశాల్లో చరిత్రలో మనం భాగం అయినట్టు అనిపిస్తుంది. అక్కడికి చేరుకున్న ప్రతీసారి చరిత్రలోని ఒక పేజీ మన ముందు నిలిచినట్టు అనిపిస్తుంది. మహారాష్ట్రంలో ఈ ఐదు కోటలు ఒక విభిన్నమైన అనుభూతిని అందిస్తాయి.
కోటలు కాదు..సజీవ సాక్ష్యాలు
మహారాష్ట్ర అంటే ముంబై, పుణె వంటి నగరాలు మాత్రమే కాదు… సహ్యాద్రి పర్వత శ్రేణులు కూడా గుర్తొస్తాయి. ఎన్నో శతాబ్దాల చరిత్రను మోస్తున్న కోటలు ఈ నేల కీర్తిని నిలువెత్తునా చాటుతున్నాయి. వాటిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంతో బలమైన అనుబంధం ఉన్న రాయగఢ్, శివనేరి, ప్రతాపగఢ్, సింహగఢ్, తోరణ కోటలు ఒక సజీవ సాక్ష్యంలా కనిపిస్తాయి.
ఈ ప్రయాణంలో ప్రతి కోట ఒక భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఒకచోట బాల్యం, మరోచోట పట్టాభిషేకం, ఇంకోచోట యుద్ధగాథ… ఇలా సహ్యాద్రి ప్రకృతి మధ్య ఛత్రపతి శివాజీ చరిత్ర మెల్లగా మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది.
శివనేరి…| Shivneri Fort
ఛత్రపతి శివాజీ జీవితాన్ని తెలుసుకునేందుకు చాలా మంది ఆయన కాలంలో నిర్మించిన కోటలను సందర్శిస్తారు. ఈ యాత్ర శివనేరితో మొదలు పెట్టడానికి ఇష్టపడుతుంటారు.
#Shivneri fort in Pune District (Maharashtra) is birthplace of Chhatrapati Shivaji Maharaj, also recently it was added in UNESCO World Heritage Site.
— Sunil Deodhar (@Sunil_Deodhar) September 26, 2021
Share photos of such treasures from your state…#IncredibleIndia #DekhoApnaDesh https://t.co/b6xt0sNdU0 pic.twitter.com/qqfQzKFg6M
ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించిన ప్రదేశంలో ఉన్నాం అనే ఫీలింగ్ చాలా స్పెషల్ అనిపిస్తుందికొండల మధ్య ఉన్న కోట ప్రాంగణంలో నడుస్తుంటే, బాల్యం నుంచే మొదలైన ఒక మహా చరిత్ర గుర్తుకొస్తుంది.
కోట గోడల మధ్య కనిపించే ప్రాచీన నిర్మాణాలు, కొండపై నుంచి దూరదూరం వరకు కనిపించే సీనరీస్ ఇవన్నీ కలిసి శివనేరికి ఒక ప్రత్యేక ఎక్స్‌పీరియెన్స్‌లా మిగిలిపోయేలా చేస్తాయి.
- ఇది కూడా చదవండి : Tawang Travel Guide : హిమాలయాల మధ్య ధ్యానం లాంటి ప్రదేశం తవాంగ్
తోరణలో తొలి అడుగు | Torna Fort
సహ్యాద్రిలో మరో ముఖ్యమైన పేరు తోరణ. శివాజీ మహారాజ్ స్వాధీనం చేసుకున్న తొలి కోటగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ కోటను ‘ప్రచండగఢ్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొండలపై వీచే గాలి, దూరంగా కనిపించే పచ్చని కొండలు, కోట అవశేషాలు కలిసి ఒక స్లో ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తాయి. ఒకవైపు ప్రకృతి, మరోవైపు చరిత్ర… రెండూ కలిసిన అందమైన ప్రదేశమే తోరణ.
ప్రతాపగఢ్… | Pratapgad Fort
ప్రతాపగఢ్ పేరు వినగానే 1659లో అఫ్జల్ ఖాన్‌తో జరిగిన యుద్ధం గుర్తుకొస్తుంది. కోట దగ్గరకు చేరుకున్న తర్వాత చరిత్ర అనేది పుస్తకంలో చదివే విషయంగా మాత్రమే కాకుండా, ఈ కొండల మధ్య జరిగిన సంఘటనలా అనిపిస్తుంది.
10 Nov 1659 was the day of the battle of Pratapgad.
— Dr Uday S Kulkarni (@MulaMutha) November 10, 2023
Here, Shivaji maharaj killed the powerful Bijapur General Afzal Khan in single combat. Afzal Khan had come with a large army to ‘capture or kill’ Shivaji raje .. but met his nemesis at the base of the fort. pic.twitter.com/k1z05PSNGZ
కోట చుట్టూ విస్తరించిన సహ్యాద్రి కొండల వరుసలు, మధ్యలో కనిపించే పచ్చని లోయలు, ప్రాచీన నిర్మాణాలు కలిసి నాటి గంభీరమైన పరిస్థితిని మరోసారి గుర్తు చేస్తాయి. ఇక్కడ కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడటం కూడా ఒక అనుభవమే.
సందర్శనీయ ప్రదేశాలు | Places To Visit
ఈ ఐదు కోటల్లో ఒక్కో కోటకు ఒక్కో కథ ఉంటుంది. శివనెరిలో బాల్యం, తోరణలో తొలి విజయం, ప్రతాపగఢ్‌లో మహా యుద్ధం, సింహగఢ్‌లో తానాజీ మలుసరేల వీరగాథ, రాయగఢ్‌లో మరాఠా సామ్రాజ్య రాజధాని జ్ఞాపకాలు కనిపిస్తాయి.
1674లో రాయగఢ్‌లోనే శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది. దీంతో ఈ కోట మరాఠా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
సింహగఢ్ను గతంలో కొంధాణా అని పిలిచేవారు. 1670లో జరిగిన యుద్ధం, తానాజీ మలుసరే వీరత్వం ఈ కోట చరిత్రలో ఒక ప్రత్యేక ఘటనలుగా మిగిలిపోయాయి.
ఎలా వెళ్లాలి | How To Reach
హైదరాబాద్ నుంచి సహ్యాద్రి ప్రాంతానికి వెళ్లాలి అనుకుంటే ముందు పుణే చేరుకుంటే బెటర్. దీని కోసం రైలు లేదా ఫ్లైట్‌లో మీకు వీలైన దాన్ని ఎంచుకోవచ్చు. నిజానికి ఈ జర్నీని చాలా మంది రైల్లోనే ఎంజాయ్ చేస్తారు.
పుణె చుట్టుపక్కల ఉన్న కోటలను ముందుగా చూసి, ఆ తర్వాత రాయగఢ్, ప్రతాపగఢ్, శివనేరి, తోరణ వైపు బయల్దేరవచ్చు.
THIS IS INCREDIBLE INDIA 🇮🇳
— Pattern Preacher (@chanakyaspeakss) June 11, 2026
THIS IS BEAUTIFUL INDIA
📍RAJGAD FORT – MAHARASTRA
Behold the greatness of Rajgad Fort — the undisputed **King of Forts** in the mighty Sahyadri ranges of Maharashtra!
Chhatrapati Shivaji Maharaj’s first capital for nearly 26 years, this… https://t.co/6lsL90SR0v pic.twitter.com/zpJNNvPtaq
నగర ప్రాంతాలను దాటి సహ్యాద్రి కొండల మధ్యకు ప్రవేశించే కొద్దీ సిటీ స్ట్రెస్ జోన్ నుంచి బయటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. విజయవాడ నుంచి వచ్చే వారు హైదరాబాద్ మీదుగా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.
ఎక్కడ ఉండాలి | Places To Stay
పుణె, మహాడ్, సతారా, జున్నర్ వంటి ప్రాంతాల్లో స్టే చేస్తూ ట్రావెల్‌ను స్లోగా ఎంజాయ్ చేయవచ్చు. నగరాల్లోని హోటళ్ల నుంచి సాధారణ వసతి గృహాల వరకు వివిధ రకాల వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
కోట ప్రాంతాలకు సమీపంలో ఉండే చిన్న చిన్న క్యాంపుల్లో రాత్రి వేళ సహ్యాద్రి నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం ఈ ట్రిప్‌లో మరో హైలైట్.
ఏం చూడాలి… | Sightseeing
శివనేరి కోట ప్రాంగణంలో చరిత్రను గుర్తుచేసుకుంటూ వాక్ చేయడం, తోరణలో సహ్యాద్రి అందాలను చూడటం, ప్రతాపగఢ్‌లో యుద్ధగాథలను తెలుసుకోవడం, సింహగఢ్‌లో తానాజీ మలుసరే వీరగాథను గుర్తుచేసుకోవడం, రాయగఢ్‌లో పట్టాభిషేకం జరిగిన ప్రాంతం వైబ్‌ను ఫీల్ అవ్వడం..ఈ ఐదు అనుభవాలు కలిసి ట్రిప్‌ను ఒక కంప్లీట్ మెమోరీగా మార్చేస్తాయి.
ఏం తినాలి ? | Maharastra Food
మహారాష్ట్ర రుచులనను ఆస్వాదించడం కూడా యాత్రలో భాగంగా భావించాలి. మరీ ముఖ్యంగా పుణె, సతారా ప్రాంతాల్లో పోహా, మిసల్ పావ్, భాక్రీ, పిఠ్లా వంటి స్థానిక రుచులు ఆస్వాదించవచ్చు. మనం చుడ్వా అని పిలచుకునే చివ్దా, వడాపావ్, బ్రెడ్ పకోడా వంటిమి మీకు ప్రతీ చోట లభిస్తాయి. అలాగే కోట ప్రాంతాల్లో లభించే నార్మల్ మరాఠీ థాలి ట్రై చేయవచ్చు.
యాత్ర , బడ్జెట్ వివరాలు | Budget
హైదరాబాద్ నుంచి ఐదు రోజుల ఈ చారిత్రక యాత్ర బడ్జెట్ అనేది ప్రయాణికుల లైఫ్‌స్టైల్‌ను బట్టి మారుతుంది. యావరేజ్‌గా కనీసం రూ.15,000–20,000 వరకు ప్రతీ వ్యక్తికి ఖర్చు అవుతుంది. ఇక ప్రీమియం ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయాలి.
అయితే ఈ ఖర్చులు మీరు ఎలా ట్రావెల్ చేస్తారు, ఎక్కడ ఉంటారు…ఏం తింటారు…యాక్టివిటీస్‌ను బట్టి మారుతాయి.
- ఇది కూడా చదవండి : కిన్నోర్ కైలాస పర్వతాల మధ్య ఒక ప్రశాంత ప్రపంచం | Kalpa Village Travel
ఇక హోటల్ లేదా లాడ్జి ఖర్చు విషయానికి వస్తే స్టే కోసం పర్ నైట్ వచ్చేసి రూ.1,000 నుంచి రూ.2,500 వరకు బడ్జెట్ అవ్వొచ్చు. ఫుడ్ కోసం రోజుకు సుమారు రూ.500–1,000 వరకు కేటాయించవచ్చు. ఇలాంటి ట్రిప్‌లో తక్కువ ధరకు దొరికే రూమ్స్ కన్నా అన్ని సదుపాయాలు, సెక్యూరిటీ ఉన్న హోటల్స్‌నే ఎంచుకోవడం ఉత్తమం.
ఆసక్తికరమైన విషయాలు | Interesting Facts
- శివనేరి ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది.
- తోరణను ప్రచండగఢ్ అనే పేరుతో కూడా పిలుస్తారు.
- 1659లో అఫ్జల్ ఖాన్‌తో జరిగిన యుద్ధంతో ప్రతాపగఢ్ చరిత్రలో నిలిచిపోయింది.
- సింహగఢ్ పాత పేరు కొంధాణా. తానాజీ మలుసరే వీరగాథను నేటికీ చాలా మంది గుర్తు చేస్తుంటారు.
- 1674లో రాయగఢ్‌లో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది.
ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు
గమనిక
ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు లేటెస్ట్ వివరాలను సొంతంగా రీసెర్చ్ చేసుకుని ప్లాన్ చేసుకోండి.
Feature Photo Courtesy : Neeraj Rane / Wikimedia Commons / CC BY-SA 4.0
- ఈ కథనం సాక్షి దినపత్రిక ఈ-పేపర్ లో కూడా ప్రచురితమైంది. కంటెంట్ రచయిత: ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు పాఠకుల కోసం పునఃప్రచురణ చేశారు.
- ఈపేపర్ స్క్రీన్ షాట్ చూడండి.
- మరిన్ని మీడియా పబ్లిషింగ్ రికార్డుల కోసం క్లిక్ చేయండి.

▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
