తిరుమలలో ఉగ్రదాడి జరిగితే ? ఆక్టోపస్ ఫోర్స్ ఎలా ఎదుర్కొంటుందో చూడండి.. | Tirumala Security Forces
కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తిరుమలలో ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ (Tirumala Security Forces) నిర్వహించింది. తిరుమల కొండపై ఏవైనా అవాంఛనీయ ఘటనలు, ఉగ్రదాడుల్లాంటివి జరిగినా అక్టోపస్ భక్తులను ఎలా కాపాడుతుందో ఈ మాక్ డ్రిల్‌లో చేసి చూపించారు.
ముఖ్యాంశాలు
మాక్ డ్రిల్ లక్ష్యం | Tirumala Security Forces

తిరుమలేశుడిని (Lord Venkateshwara) దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సురక్షితంగా ఉంచేందుకు తిరుమల సెక్యూరిటీ ఫోర్స్ ఏ మేరకు సిద్ధంగా ఉందో ఈ మాక్ డ్రిల్‌లో చేసి చూపించారు. ఒకవైపు ఉగ్రవాదులపై కాల్పులు చేస్తూ మరోవైపు భక్తులను రక్షిస్తూ సాగిన ఈ మాక్ డ్రిల్ లేపాక్షి సర్కిల్ (Lepakshi Circle) వద్ద అడిషన్ ఎస్పీ శ్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది.

- ఇది కూడా చదవండి : జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? భారత దేశ సంస్కృతిలో ప్రాధాన్యత ఏంటి ? | Jammu and Kashmir
ఈ మాక్ డ్రిల్‌లో భాగంగా అసాల్ట్ డాగ్ ఆఫరేషన్స్, ఎనిమీ ఎటాక్ రెస్పాన్స్, రూమ్ ఇంటర్వెన్షన్ టెక్నిక్స్‌ను ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. సిబ్బంది మధ్య ఉన్న సమన్వయం, వారి సమర్థతను రియల్‌టైమ్‌లో ఇలా చెక్ చేశారు.

మాక్ డ్రిల్ ఎందుకంటే | Octopus Mock Drill In Tirumala
ఈ మాక్ డ్రిల్‌లో మొత్తం 28 మంది ఆక్టోపస్ కమాండోస్ (Octopus Force), 25 మంది టిటిడి విజిలెంట్ సిబ్బంది, 15 మంది పోలిస్ అధికారులు,10 మంది ఏపీ పోలీసు (AP Police) సిబ్బంది పాల్గొన్నారు. ఈ మాక్ డ్రిల్ అనేది తిరుమల (Tirumala) సెక్యూరిటీ సిబ్బంది సంసిద్ధతను చెక్ చేసేందుకు ఒక మంచి వికల్పంగా భావించవచ్చు.

రోజురోజుకు పెరుగుతున్న దాడుల ముప్పును తట్టుకుని సరైన టైమ్‌లో ప్రతిదాడులు నిర్వహించి భక్తులను రక్షించే విధంగా ఈ డ్రిల్స్ నిర్వహించారు. సిబ్బంది పని తీరు, సమన్వయం, రెస్పాన్స్ టైమ్ వంటి విషయాలను నోట్ చేసుకుని పనితీరును మెరుగు పరిచే అవకాశం ఉంటే మెరుగుపరుస్తారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.