Shikara Ride : పహల్గాంలో ఉగ్రదాడి (pahalgam terror attack) తరువాత వేలాది మంది పర్యాటకులు జమ్మూ కశ్మీరు నుంచి వేగంగా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. వీరి కోసం కేంద్ర, స్థానిక ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేశాయి.
విమానయాన సంస్థలు వీలైనంత తక్కువ ధరలకే టికెట్లు అమ్ముతున్నాయి. మరో వైపు ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారతీయుల్లో ఆగ్రహం అంతరిక్షం స్థాయికి వెళ్లిన ఈ సమయంలో అందరూ జమ్మూ అండ్ కశ్మీరు నుంచి వీలైనంత త్వరగా బయటపడాలి అనుకుంటారు కదా…
ముఖ్యాంశాలు
షికారా రైడ్ | Shikara Ride at Dal Lake
కానీ బెంగుళూరుకు చెందిన వినితా చైతన్య ఒక ఇంటీరియర్ డిజైనర్ మాత్రం తన కశ్మీరు టూరును కొనగించింది. శ్రీనగర్‌లోని డాల్ సరస్సులో (Dal Lake) సూర్యోదయ సమయానా షికారా (ఒకరకమైన చిన్న బోటు) పై షికారు చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
- ఇది కూడా చదవండి : “ భారత్ లాంటి దేశం ఎక్కడా లేదు” …5 వారాలు భారత్‌లో గడిపిన Canadian Vlogger అభిప్రాయం
భయం….బాధ్యత
2025 ఏప్రిల్ 22 మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడి గురించి తెలిసినా భయపడలేదు వినితా. షికారా రైడ్‌ను క్యాన్సిల్ చేసుకోలేదు. ఇక తన వీడియోలో తన షికాారాలో ప్రయాణిస్తూ స్థానిక కశ్మీరీ వెండర్స్‌తో ముచ్చటించడం, వారి వద్ద నుంచి పవ్వులు, రింగులను ట్రై చేసింది. సూర్యోదయ సమయంలో ఇక్కడి అందాలను చూసేందుకు చాలా మంది దూరదూరం నుంచి వస్తుంటారు. అయితే ఈ వీడియోలో మాత్రం టూరిస్టులు (Tourists In jammu and Kashmir) బాగా తగ్గారని మీరు గమనించవచ్చు.
అంతా నిశ్చబ్దం | Aftermath Pagalgam Attack
పహల్గాం దాడి తరువాత శ్రీనగర్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది అని వినితా (Vinitha Chaitanya) డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసే సమయానానికి ఎక్కడ చూసినా తనుకు దుఖం, బాధ, దిగులుతో పాటు ఏదో కోల్పోయాం అనే వెలతి స్థానికుల ముఖాల్లో గమనించినట్టు తెలిపింది.
స్థానిక ఒక డ్రైవర్‌తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వారిలో నిస్సహాయత, నిర్లిప్తత, ఒకరకమైన కోపం చూశానని తెలిపారు.
ఇలాంటి పరిస్థితిలో కూడా వినితా ఆమె ప్రయాణిస్తున్నగ్రూప్ టూరును ఆపలేదు. విషయం తెలిసిన తరువాత తను షికారాను (Shikara Ride) క్యాన్సిల్ చేయలేదు. ఉదయాన్నే తన ప్రయాణంలో అందమైన సూర్యోదయాన్ని చూశానని, తనతో పాటు కొంత మంది పర్యాటకులు కూడా సరస్సులో షికారా రైడ్‌లో ఉన్నారని తెలిపింది వినితా.
ఈ విషయం తెలుసుకున్న కొంత మంది వ్యాపారులు ధైర్యం కూడగట్టుకుని తమ బోటులతో సహా తమ షికారా వద్దుకు వచ్చారన్నారామె.
కొన్నది కొంచెమే కానీ…| Shikara Ride
షికారా రైడ్‌లో ఉన్న సమయంలో తను ఖర్చు పెట్టిన డబ్బు చాలా తక్కువే అని తెలిపింది వినితా. కానీ స్థానిక వ్యాపారులతో మాట్లాడటం వల్ల వారి జీవితాల్లో కాస్త ఆశను తిరిగి తీసుకురాగలిగాను అని తెలిపింది.
- ఇది కూడా చదవండి : “లండన్‌లో కూడా పనికి రాదు” హైదరాబాద్ మెట్రోకు ఫిదా అయిన యూరోపియన్ వ్లాగర్ | Hyderabad Metro
ఇలాంటి విషాధకరమైన పరిస్థితిలో వినితా తన ప్రయాణాన్ని కొనసాగించడాన్ని చాలామంది నెటిజెన్లు సమర్థించారు. మరికొంత మంది ఈ పోస్టును పెట్టే సరైన సమయం ఇది కాదేమో అని స్పందించారు. మరి మీరేం అంటారు ?
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.