హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువైన హేంకుండ్ సాహిబ్ గురుద్వార ( Hemkund Sahib Gurudwara ) సిక్కు మతస్థులకు అత్యంత పవిత్రమైన గురుద్వారలలో ఒకటి. ఏడాదిలో కొంత కాలం మాత్రమే తెరిచి ఉండే ఈ గురుద్వారకు నేను 2024 సెప్టెంబర్ నెలలో వెళ్లాను. ఈ ప్రయాణ విశేషాలు, మీరు వెళ్లాలి అనుకుంటే ఏం చేయాలి ? ఎలా వెళ్లాలి ? ఇంకా చాలా విషయాలు ఈ పోస్టులో మీ కోసం…
హేంకుండ్ సాహిబ్ గురుద్వార అనేది చాలా అందమైన, పవిత్ర క్షేత్రం. అందుకే ఈ ప్రాంతానికి వేలాది మంది ట్రెక్కింగ్ చేసి వస్తుంటారు. చిన్న పిల్లల నుంచి 80 ఏళ్ల వయసులో ఉన్న వారి వరకు హేంకుండ్ సాహిబ్‌ను చాలా మంది సందర్శిస్తూ ఉంటారు.
ముఖ్యాంశాలు
ఆధ్మాత్మిక సాహసయాత్ర
ఈ ప్రయాణం కొంచెం కష్టమే కానీ దారి మధ్యలో కనిపించే వ్యూస్, హిమాలయ పర్వతాల సోయగాలు, సత్నాం వాహెగురు ( satnam waheguru ) అని జపిస్తూ ట్రెక్కింగ్ చేసే భక్తులు, ఇక్కడి చరిత్ర ఇవన్నీ కష్టాన్ని ఇష్టంగా మారుస్తాయి. ఈ పోస్టు మీ హేంకుండ్ సాహిబ్ ప్రయాణానికి ఒక సూపర్ ట్రావెల్ గైడ్‌లా ( Telugu Travel Guide ) పని చేస్తుంది. అధ్యాత్మికత, సాహసం కలబోతల ఈ జర్నీని మొదలు పెట్టేద్దాం రండి.
Read Also: Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?
హేంకుండ్ సాహిబ్ ఎత్తు, లొకేషన్
Location and Elevation of Hemkund Sahib: హేంకుండ్ సాహిబ్ గురుద్వార ఉత్తరాఖండ్‌లోని ఛమోలి ( Chamoli ) ఉంది. గ్రేటర్ హిమాలయన్ రేంజ్‌లో 4,632 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ గురుద్వార. నిజానికి ఇది ఆధ్మాత్మిక యాత్ర మాత్రకే కాదు సాహసయాత్ర కూడా.
హేంకుండ్ సాహిబ్ చరిత్ర
History Of Shri Hemkunt Sahib : హేంకుండ్ సాహిబ్ చరిత్ర అనేది సిక్కు మతస్థుల విశ్వాసానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఈ గురుద్వార సిక్కుల 10వ గురువు, గురు గోబింద్ సింగ్ గారు ( Guru Gobind Singh Ji ) తపస్సు చేసిన స్థలంగా చెబుతారు. గత జన్మలో శ్రీరాముడిగా ఇక్కడ ఆయన తపస్సు చేసినట్టు చెబుతారు.
హేంకుండ్ అనే పదానికి మంచు సరస్సు ( meaning of hemkund ) అని అర్థం వస్తుంది. ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో మొత్తం మంచుతో నిండి ఉన్న గ్లేషియర్స్ ఉంటాయి. వాటి మధ్యలో ఒక సరస్సు ఉంటుంది. దాని పేరు మీదుగానే ఈ గురుద్వారకు హేంకుండ్ అనే పేరు వచ్చింది.
గురుద్వార నిర్మాణం
Hemkund sahib Gurudwara Foundation: హేంకుండ్ సాహిబ్ గురుద్వార నిర్మాణానికి 20వ శతాబ్దంలో సిక్కు మతస్థులు పునాదులు వేసినట్టు చెబుతారు. నాటి నుంచి ఇది ఒక పుణ్యస్థలంగా అవతరించింది. 1934 లో ఈ క్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా గుర్తించారు. గురు గోబింద్ గారి గౌరవార్థం ఇక్కడ ఒక చిన్న గురుద్వారను నిర్మించారు. ఈ గురుద్వార పక్కనే ఉన్న హేంకుండ్ అనే సరస్సు ( Hemkund Lake ) ఈ ప్రాంతాన్ని ఆధ్మాత్మిక ప్రాధాన్యతను తీసుకొస్తుంది.
హేంకుండ్ సాహిబ్ ట్రెక్కింగ్
Shri Hemkund Sahib Trekking : ఈ గురుద్వారకు ప్రస్తుతానికి ట్రెక్కింగ్ చేసి లేదా గుర్రం, పల్లకి, బుట్టలో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. హెలికాప్టర్ సర్వీసు ఈ కంటెంట్ రాసే సమయానికి అయితే అందుబాటులో లేదు. అయితే నేను వెళ్లినప్పడు అక్కడ ఒక హెలిపాడ్ నిర్మాణ ( Hemkund Sahib Helicopter ) పనులు జరగడం చూశాను. దీన్ని బట్టి త్వరలో ఒక హెలిపాడ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అని మాత్రం చెప్పగలను.
ట్రెక్కింగ్ విషయానికి వస్తే ఈ ట్రెక్ అనేది ఎంత కష్టమో అంత అందంగా కూడా ఉంటుంది. మార్గ మధ్యలో మీకు అద్భుతమైన వ్యూస్ కనిపిస్తాయి. మంచుతో నిండిన హిమాలయ పర్వతాలు, ఎటు చూసినా పచ్చదనంతో నిండిన లోయలు కనిపిస్తాయి. హేంకుండ్ సాహిబ్ ట్రెక్కింగ్ గోవింద్ ఘాట్ ( Govindghat ) అనే కొండ ప్రాంతం నుంచి నుంచి ప్రారంభం అవుతుంది. ఇది రిషికేష్ నుంచి సుమారు 270 కిమీ దూరంలో, ఢిల్లీ నుంచి 520 కిమీ దూరంలో ఉంటుంది.
Read Also: Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
ఈ ట్రెక్కింగ్ కొంచెం కష్టంగా, కొంత మందిని ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఈజీ అని మాత్రం చెప్పను. ఎక్కడం ఎంత కష్టమో దిగడం అనేది అంతకు మించిన ఛాలెంజింగ్‌గా అనిపించింది నాకు. గోవింద్‌ఘాట్ నుంచి సుమారు 19 కిమీ దూరం ట్రెక్ చేయాల్సి ఉంటుంది.
- గోవింద్ ఘాట్ నుంచి ఘాంగరియా ( 13 కిమీ )
Govindghat To Hemkund Sahib Trek : హేంకుండ్ సాహిబ్ ట్రెక్కింగ్ వెళ్లాలి అనుకుంటే ముందు మీరు రిషికేష్, హరిద్వార్ లేదా డెహ్రాడూన్ నుంచి గోవింద్ ఘాట్ అనే ప్రాంతానికి రావాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉత్తరాఖండ్ ( Uttarakhand ) రాష్ట్రంలోనే ఉంటాయి. అక్కడి నుంచి 13 కిమీ దూరంలో ఉన్న ఘాంగరియా అనే గ్రామానికి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
ఘాంగరియాకు మీరు నడుచుకుంటూ వెళ్లోచ్చు లేదా కంచెరగాడిదపై ( Khachar ) వెళ్లొచ్చు, పల్లకి, బుట్టలో, హెలికాప్టర్‌లో వెళ్లొచ్చు. నేను నడుచుకుంటూ వెళ్లాను. నాకు 7 గంటలు పట్టింది 13 కిమీ ట్రెక్ చేయడానికి. ఘాంగరియా గ్రామం అనేది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ( Valley Of Flowers ) , హేంకుండ్ సాహిబ్‌కు గేట్‌వే లాంటిది.
2. ఘాంగరియా నుంచి హేంకుండ్ సాహిబ్ (6 కిమీ )
Ghangaria To Hemkund Sahib Trek : ఘాంగరియా గ్రామం నుంచి హేంకుండ్ సాహిబ్ మధ్య దూరం 6 కిమీ ఉంటుంది. ఈ దారి కఠినంగా ఉంటుంది. మోకాళ్ల గుట్ట అని కూడా చెప్పవచ్చు. అయితే అంతెత్తు పర్వతాల మధ్య ఉన్న గురుద్వార ( Gurudwara ), హేంకుండ్ అనే సరస్సు అందాలు చూసి మీ కష్టం ఇట్టే మర్చిపోతారు.
ఫుడ్ అండ్ వసతి
Accommodation and Food In Hemkund Sahib Gurudwara : హేంకుండ్ సాహిబ్ గురుద్వార అనేది ఒక ఆధ్మాత్మిక కేంద్రం అయినా..ఇక్కడ లభించే ఫుడ్ చాలా పౌష్టికంగా, టేస్టీగా ఉంటుంది. ఇక్కడ సిక్కు సంప్రదాయం ప్రకారం లంగర్ ( Langar At Hemkund Sahib ) అంటే అన్నదాన సత్రం ఉంటుంది. దీనిని కమ్యూనిటీ కిచెన్ అని కూడా పిలుస్తుంటారు.
ఈ ఉచిత అన్నదాన పథకంలో మీరు కూడా భోజనం చేయవచ్చు. కిచెన్‌కు ముందు ప్లేట్లు గ్లాసులు, స్పూన్లు తీసుకుని లోపలికి వెళ్లి ఫుడ్ తీసుకోవచ్చు. అక్కడే ఉన్న టేబుల్స్ దగ్గర కూర్చొని ఆరగించవచ్చు. ఇందులో పప్పు, అన్నం, రోటీ దాంతో పాటు కూరగాయలతో చేసిన కర్రీ కూడా ఉంటుంది. అయితే నేను వెళ్లినప్పుడు మాత్రం ఆ రోజు కిచిడీ సర్వ్ చేశారు.
అందరూ సమానమే…
జాాతి మతం, కులం వర్గం ఇవన్నీ ఏవీ పట్టించుకోకుండా అందరినీ సమానం చూస్తారు. అందరికీ ప్రేమతో భోజనం వడ్డిస్తారు. భోజనం అయిన తరువాత ఆ ప్లేట్స్ అవీ తీసుకుని బయట వాషింగ్ ప్లేస్‌లో పెట్టేయాల్సి ఉంటుంది.
మీకు ఘాంగరియాలో కొన్ని హోటల్స్ అండ్ గెస్ట్ హౌజ్‌లు దొరుకుతాయి. అక్కడ మీరు ఉండవచ్చు. ఇక్కడ మీకు భోజనంతో పాటు ట్రెక్కింగ్‌కి కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. అయితే మీరు ఇక్కడికి వచ్చే ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే బెటర్ అనేది నా సలహా. మీకు ఎక్కడా రూమ్ దొరక్కపోతే స్థానికంగా ఉండే గురుద్వారలో ప్రయత్నించండి.
Read Also : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
నేను ట్రావెల్ ఏజెన్సీలో ఒక ప్యాకేజీ తీసుకుని వచ్చాను. నాతో పాటు చాలా మంది ఈ ట్రెక్కింగ్‌కి వచ్చారు. సో నాకు ఫుడ్డు బెడ్డు గురించి ఆలోచించే అవసరం రాలేదు.
బ్రహ్మకమలం చూశాను
హేంకుండ్ సాహిబ్ ట్రెక్కింగ్ పూర్తి చేసి దర్శనం పూర్తి చేసుకున్న తరువాత నేను అక్కడే బ్రహ్మకమలం ( Brahma Kamal ) చూశాను. అరుదైన ఈ పుష్పరాజసం చూడాలి అంటే లక్కు ఉండాలి. దాంతో పాటు మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేసే ట్రెక్కింగ్ గౌడ్ కూడా ఉండాలి. బ్రహ్మకమలం గురించి అనేక విశేషాలతో ఒక పోస్ట్ పబ్లిష్ చేశాను.
Read Also : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
హేంకుండ్ సాహిబ్ ఎలా వెళ్లాలి ?
How To Reach Hemkund Sahib : హేంకుండ్ సాహిబ్ చేరుకునేందుకు మీరు రైలు రోడ్డు, ట్రెక్కింగ్ అన్ని మోడ్స్ వినియోగించాల్సి ఉంటుంది. ఎలా రావాలో మీకు స్టెప్-బై-స్టెప్ వివరిస్తాను.
మీరు ఢిల్లీ నుంచి వస్తున్నారు అని భావించి ఈ ప్లాన్ వివరిస్తున్నాను.
- ట్రైన్ | Hemkund Sahib Train from Delhi : హేంకుండ్ సాహిబ్ అనేది 4600 మీటర్ల ఎత్తైన పర్వతాల మధ్యలో ఉంటుంది. ఇక్కడికి రైల్వే సర్వీసు లేదు. మీరు ఢిల్లీ నుంచి హరిద్వార్ ( Haridwar ), రిషికేష్ , లేదా డెహ్రాడూన్ రైల్వే స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. 5-6 గంటల్లో 270 కిమీ ప్రయాణించాల్సి ఉంటుంది. లేదా మీరు ఢిల్లీ నుంచి ఓవర్‌నైట్ బస్సులో కూడా రిషికేష్, హరిద్వార్ చేరుకోవచ్చు.
- రోడ్డు మార్గంలో | Hemkund Sahib By Road From Delhi : ఢిల్లీ నుంచి హరిద్వార్ లేదా రిషికేష్‌కు మీరు బస్సులో, ట్యాక్సీలో రావాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి 250 కిమీ దూరంలో ఉన్న జ్యోషిమఠ్, లేదా గోవింద్‌ఘాట్ అనే ప్రాంతానికి మీరు చేరుకుంటారు. సుమారు 10-12 గంటల ప్రయాణం ఇది. మధ్యలో మీకు గంగానది ఏర్పడే దేవ్ ప్రయాగ్ ( Dev Prayag ), రుద్ర ప్రయాగ్, కర్ణప్రయాగ్ లాంటి ప్రాంతాలు టచ్ అవుతాయి.
జోషిమఠ్ ( Joshimath ) వస్తే మాత్రం అక్కడి నుంచి 20 కిమీ దూరంలో ఉన్న గోవింద్‌ఘాట్‌కు షేరింగ్ జీప్ లేదా ట్యాక్సీలో చేరుకోవచ్చు.
3. పాదయాత్ర : గోవింద్ ఘాట్ ( Govind Ghat ) నుంచి ఘాంగరియాకు ట్రెక్కింగ్ చేసి వెళ్లాలి. రెస్టు తీసుకుని తరువాత మీరు హేంకుండ్ సాహిబ్ వెళ్లవచ్చు.
4. వాయు మార్గం | Hemkund Sahib By Air : హేంకుండ్ సాహిబ్‌కు దగ్గర్లో ఉన్న ఎయిర్‌పోర్టు పేరు జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్ ( Jolly Grant Airport) . ఇది డెహ్రాడూన్లో ( 300 కిమీ దూరంలో ) ఉంటుంది. అక్కడి నుంచి ట్యాక్సీ లేదా బస్సులో మీరు రిషికేష్, హరిద్వార్ చేరుకోవచ్చు. ఈ ప్రాంతాల నుంచి జోషిమఠ్, గోవింద్ ఘాట్ వెళ్లే బస్సులు, ట్యాక్సీలు దొరకుతాయి.
Read Also : Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు
రిషికేష్( Rishikesh ) , హరిద్వార్ నుంచి బద్రినాథ్ వెళ్లే బస్సులో మీరు గోవింద్‌ఘాట్ లేదా జ్యోషిమఠ్ చేరుకోవచ్చు. జ్యోషిమఠ్ అయితే మీకు ఉండేందుకు ఆప్షన్స్ బాగుంటాయి. దాంతో పాటు ఇక్కడ జగద్గురు ఆది శంకరాచార్యుల వారి ( Adi Shankaracharya ) మఠం కూడా ఉంటుంది.
ఎప్పుడు వెళ్లాలి ? | Best Time To visit Hemkund Sahib Gurudwara
హేంకుండ్ సాహిబ్ వెళ్లే బెస్ట్ టైమ్ వచ్చేసి మే లాస్ట్ వీక్ నుంచి అక్టోబర్ మొదటివారం లోపు అని చెప్పవచ్చు. మిగితా సమయంలో ఇది మంచు ప్రపంచంలా ఉంటుంది. అందుకే ఆ సమయంలో ఎవరూ అక్కడికి వెళ్లరు. ఎప్పుడు వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం..
మే నుంచి జూన్ | Hemkund Sahib In Late May and June : మే చివరి వారం నుంచి ప్రయాణికులు ఇక్కడికి రావడం మొదలు పెడుతుంటారు. పగటి సమయంలో ఉష్ణోగ్రత 15 నుంచి 20 డిగ్రీల వరకు వెళ్తుంది. ఇది ట్రెక్కింగ్‌కి మంచి సమయం. అన్ని దారులు తెరుచుకుంటాయి. మంచు కరిగిపోతుంది.
జూలై నుంచి ఆగస్ట్ | Hemkund Sahib In July to August : ఇది వర్షాకాలం. చుట్టు పక్కల ప్రాంతాల్లో మొత్తం పచ్చని లోయలు కనిస్తాయి. కానీ ల్యాండ్‌స్లైడ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వచ్చే ముందు వాతావరణం చెక్ చేసి రండి.
Very Important Note : మీరు ఛమోలి జిల్లాలో వర్షాకాలంలో వచ్చే ముందు ఖచ్చితంగా వాతావరణాన్ని చెక్ చేసుకుని రండి. ఎందుకంటే భయంకరమైన ల్యాండ్ స్లైడ్స్ ( కొండచరియలు విరిగిపడటం ), దేశంలోనే అత్యంత దారుణమైన వరదలు చోటు చేసుకున్న జిల్లా ఇది.
సెప్టెంబర్ నుంచి అక్టోబర్ | Hemkund Sahib In September To Early October : ఈ సమయంలో వాతావరణం ట్రెక్కింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో భక్తుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. అయితే ఎటు చూసినా అందమైన లోయలే కనిపిస్తాయి మీకు.
ట్రెక్కింగ్ టిప్స్ | Hemkund Sahib Trekking Tips
- శారీరకంగా సిద్ధం అవ్వండి : ఈ ట్రెక్కింగ్ మీరు ఊహించినంత ఈజీ కాదు. అలాగని మరీ కష్టం కాదు. మీడియం అని చెప్పవచ్చు. అయితే మీరు రెగ్యులర్‌గా ట్రెక్కింగ్ ప్రాక్టిస్ లేదా ఏరోబిక్ ( Aerobic ) వర్కవుట్స్ చేసి మీ స్టామినాను పెంచుకోవచ్చు.
- ప్యాకింగ్ | How To Pack For a Trek : ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు ప్యాకింగ్ చాలా పద్ధతిగా చేసుకోవాలి. ఎక్కువగా పనికి వచ్చే తక్కువ వస్తువులు ఉండాలి. ఉదాహరణకు : జిందా తిలిస్మాత్, జెండూబామ్ లాంటివి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. చిన్న చిన్న ప్యాకెట్స్‌లో అందుబాటులో ఉంటాయి. బరువు తక్కువగా ఉండే స్వెటర్లు/ జాకెట్స్, రెయిన్‌కోట్ లేదా పాంచో ( Pancho ) – ( వర్షాల్లో ) తప్పనిసరి. ట్రెక్కింగ్ షూ పక్కాగా తీసుకోండి. వాటర్ బాటిల్, ఎనర్జీ బార్స్ లేదా స్నాక్స్, సన్ గ్లాసెస్ ( Sun Glasses ) , ముఖాన్ని, తలను కవర్ చేసే వస్తువులు తీసుకెళ్లండి. పవర్ బ్యాంకు కెమెరా ఇవన్నీ మీ ఛాయిస్ .
- హైడ్రేట్ అవ్వండి : ట్రెక్కింగ్ సమయంలో ( Trekking Tips ) వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగండి. అవసరం అయితే నీటిని శుభ్రం చేసే ట్యాబ్లెట్స్ లేదా ఫిల్టర్ ఉన్న బాటిల్ తీసుకెళ్లండి. దారి మధ్యలో మీకు చాలా చోట్ల నీరు లభిస్తుంది.
- బాడీ చెప్పేది వినండి : మిగితా వారిని చూసి మీ శరీరాన్ని బలవంతంగా ముందుకు నెట్టకండి. ఇంత ఎత్తైన ప్రాంతాలకు అలవాటు పడే అవకాశాన్ని మీ బాడీకి ఇవ్వండి. దీనిని అక్లిమటైజేషన్ ( Acclimatization ) అంటారు. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే రెస్ట్ తీసుకోండి. లేదా వెనక్కి బేస్ క్యాంపువైపు వెళ్లండి. రిస్కు మాత్రం తీసుకోకండి.
- సూచనలు పాటించండి : హేంకుండ్ సాహిబ్ వెళ్లినప్పుడు మీరు స్థానికంగా ఉండే ఆచారాలు, విధానాలు, అధికారుల సూచనలను తప్పకుండా పాటించండి. మనం అతిథులం అతిథుల్లా ఉండాలి.
- అలవాటు అవ్వనివ్వండి : హేంకుండ్ సాహిబ్ ట్రెక్కింగ్‌కు ముందు బేస్ క్యాంప్ అయిన ఘాంగరియా వద్ద టైమ్ స్పెండ్ చేయండి. దీంతో మీ శరీరం అక్కడి వాతావరణానికి అలవాటు పడుతుంది. లేదంటే మీకు ఆల్టిట్యూడ్ సిక్నెస్ ( Altitude sickness ) ఏర్పడే ప్రమాదం ఉంది.
- ప్రకృతిని గౌరవించండి : హేంకుండ్ సాహిబ్ మాత్రమే కాదు మీరు ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రకృతిని గౌరవించండి. పరిశుభ్రతను పాటించండి.
- ఇవి నిషేధం : ఘాంగరియా, హేంకుండ్ సాహిబ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లో మీరు స్మాకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం నిషేధం. పొరపాటున కూడా సిగరెట్, మద్యం గురించి ఆలోచించకండి.
- Read Also : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
ఎవరు వెళ్లవచ్చు ?
Who Can go to Hemkund Sahib Gurudwara Trek : హేంకుండ్ సాహిబ్ గురుద్వారకు ఎవరైనా వెళ్లవచ్చు. ఇందులో జాతి, కులం , మతం అనే వర్గభేధాలు లేవు. అందుకే ఇక్కడికి అన్ని వర్గాల ప్రజల వస్తూ ఉంటారు. అయితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఎత్తైన పర్వతాల్లో అనారోగ్యానికి గురయ్యేవారు అంటే హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉన్నవారు ముందు వైద్యులను సంప్రదించి ఈ ట్రెక్కింగ్‌పై ఒక నిర్ణయం తీసుకోవాలనేది నా సలహా.
దగ్గర్లో చూడాల్సిన ప్రదేశాలు
Places To Explore Near Hemkund Sahib : హేంకుండ్ సాహిబ్ గురుద్వార అనేది హిమాలయల ఒడిలో ఉంటుంది. ఈ గురుద్వారకు సమీపంలో ఎన్నో పర్యటక ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మీకు బాగా నచ్చే అవకాశం ఉంది.
- ఓలి | Auli : ఆలి అనేది జ్యోషిమఠ్ నుంచి 14 కిమీ దూరంలో ఉంటుంది. ఇక్కడ చాలా మంది స్కీయింగ్ చేయడానికి వస్తుంటారు. నందా దేవి పర్వత శ్రేణులను ఇక్కడి నుంచి స్పష్టంగా చూడవచ్చు.
- వాలీ ఆఫ్ ఫ్లవర్స్ | Valley Of Flowers : ఘాంగరియా నుంచి కేవలం 4 కిమీ దూరంలో ఉంటుంది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఇది ఒక అందమైన స్వర్గంలాంటి ప్రదేశం. ఈ లోయ అందం గురించి వర్ణించడం అంత ఈజీ కాదు. అందుకే ఒక వ్లాగ్ చేశాను అది చూడండి.
- దేశంలో తొలి గ్రామం | Mana Village : బద్రినాథ్ ఆలయం నుంచి కొన్ని కిమీ దూరంలోనే ఉంటుంది మాణా అనే ఈ గ్రామం. ఇక్కడ సరస్వతీ నదిని చూడవచ్చు. నది నీటిని తాగవచ్చు. అక్కడే పుట్టి అక్కడే భూమిలోకి వెళ్లిపోతుంది సరస్వతీ నది.
- బద్రినాథ్ | Badrinath : ఛార్ ధామ్‌లలో ఒకటైన బద్రినాథ్ ఆలయం గోవింద్ ఘాట్ నుంచి సుమారు 24 కిమీ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం సమీపంలో నరుడు నారాయణుడి పర్వతాలు ఉంటాయి. దీంతో పాటు అలకనంద నదిలో మీరు స్నానం చేయవచ్చు. పితృ కార్యాలు చేయవచ్చు.
- జ్యోషిమఠ్ | Joshimath : జగద్గురు ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు మఠాల్లో ఒకటి ఇక్కడే ఉంది. ఈ ప్రాంతంలో భూమి కుంగిపోవడంతో చాలా రోజులు వార్తల్లో నిలిచింది. ఇక్కడ నరసింహ స్వామి ఆలయం ఉంటుంది. ఆలయం చాలా అందంగా ఉంటుంది. దీంతో పాటు ఇక్కడి మరెన్నో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి.
- లక్ష్మణ్ మందిర్ | Lakshman Temple, Hemkund Sahib: హేంకుండ్ సాహిబ్ గురుద్వార వెనకాలే లక్ష్మణుడి ఆలయం ఉంటుంది. శేష నాగు అవతారంలో ఆయన ఇక్కడ తపస్సు చేస్తారట. ఇప్పటికీ నిత్యం ఆయన ఇక్కడి సరస్సులో స్నానం చేస్తుంటారని అక్కడి అయ్యగారు చెప్పారు. ఇక్కడి క్షేత్రపాలకుడు లక్ష్మణుడ
Watch : Hemkund Sahib Gurudwara Vlog In Telugu
మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించండి
మీరు సాహసాన్ని ఇష్టపడేవారైనా లేక నాలాగ ప్రయాణికులైనా సరే హేంకుండ్ సాహిబ్ మీకు చక్కని ట్రిప్ అవుతుంది. వచ్చే ముందు ఈ పోస్ట్ మరోసారి రిఫర్ చేయండి. నేను మిస్ అయిన విషయాలు ఏమైనా ఉంటే లేదా నా పోస్టులో ఏమైనా తప్పులు మార్పులు చేయాల్సి ఉంటే కామెంట్ చేయగలరు.
Watch : హేంకుడ్ సాహిబ్ ట్రావెల్ వ్లాగ్
ఈ కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.